Vijayawada Crime: ఏపీలో దారుణాది దారుణాలు వెలుగుచూస్తున్నాయి. ఒక అసహాయ మానసిక వికలాంగురాలు అని కూడా చూడకుండా ఒక ఆస్పత్రిలో పనిచేసే దుర్మార్గుడు తీసుకెళ్లి అక్కడే ఒక రూంలో అత్యాచారం చేసి వదిలేశాడు. ఇది చూసినా ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది ఇద్దరూ ఆ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఇక కూతురు రాత్రి అయినా కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తే ఆ పోలీసులు పెద్దగా స్పందించలేదు. చివరి కాల్ ఇతడి నుంచి వచ్చిందని ఒకసారి చర్య తీసుకోమని కోరినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం వాపోతోంది.
Also Read: Vijayawada Government Hospital: విజయవాడలో దివ్యాంగురాలైన యువతిపై గ్యాంగ్ రేప్? చివరకు ఏమైంది?
చివరకు చివరి కాల్ వచ్చిన వాడిని తీసుకొచ్చి విచారిస్తే ఆస్పత్రిలో వదిలేశానని చెప్పాడు. ఆస్పత్రికి వెళ్లి చూడగా.. పవన్ అనే వ్యక్తి ఆ మానసిక వికలాంగురాలిపై అత్యాచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో బాధిత కుటుంబం వాడిని కొట్టి పోలీసులకు అప్పగించింది.
ఏపీ రాజధాని నడిబొడ్డున జరిగిన ఈ దారుణంపై ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీలు భగ్గుమన్నాయి. పోలీసుల అలసత్వం వల్లే ఇదంతా జరిగిందని ఆరోపిస్తూ విజయవాడ ప్రభుత్వాసుపత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ నేతలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. చంద్రబాబు వచ్చి పరామర్శించారు.
ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆస్పత్రికి రాగా మహిళలు అడ్డుకొని ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆస్పత్రిలోకి పోనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు అతికష్టం మీద ఆమెను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు.
చంద్రబాబు, వాసిరెడ్డి పద్మ సమక్షంలో విజయవాడ సీపీని బాధిత కుటుంబం కడిగేసింది. ఫిర్యాదు చేసినా పట్టించుకోరా అని నిలదీసింది. ఏపీలో ఆడబిడ్డల మానానికి రక్షణ లేదా? అంటూ బాధితులు కన్నీళ్ల పర్యంతం అయ్యారు.
ఈ దారుణంలో ఖచ్చితంగా పోలీసుల నిర్లక్ష్యం ఉందని బాధితులు ఆరోపిస్తున్నారు. వారు స్పందించి ఉంటే ఇది జరిగేది కాదని నిలదీస్తున్నారు.
Also Read:TRS Politics : బీజేపీతో ఫైట్.. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ టీఆర్ఎస్ కు పనిచేస్తుందా?
Recommended Videos: