Fake Woman Lawyer Arrested: అది మధ్యప్రదేశ్.. నర్మదాపురం లోని కోర్టు.. అక్కడ ఫిర్యాదుదారులు.. న్యాయవాదులతో ఆ ప్రాంతం మొత్తం కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో అక్కడికి పోలీసులు ప్రత్యేక వాహనాలలో వచ్చారు. కోర్టు అన్నాక పోలీసులు రావడం సహజం. అక్కడికి వచ్చిన ఫిర్యాదారులు కూడా ఆ పోలీసులను చూసి పెద్దగా కంగారు పడలేదు. ఆ పోలీసులు నేరుగా న్యాయవాదులు ఉండే ఛాంబర్ వద్దకు వెళ్లారు. అక్కడ ఉపాధ్యాయ అనే పేరుతో ఉన్న ఒక మహిళ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. దీంతో కోర్టులో వాతావరణం మొత్తం ఒక్కసారిగా కలకలం నెలకొంది.
ఒక మహిళా న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేస్తే.. ఆమె కనీసం ప్రతిఘటించలేదు. పైగా ఆమె పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగలేదు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే ఆమె వారితో పాటు వెళ్లిపోయింది. న్యాయవాదులు.. పోలీసులను ప్రశ్నిస్తే.. ఆ తర్వాత వారు చెప్పిన నిజాలు షాక్ కు గురిచేశాయి. అంతేకాదు.. ఈ పరిణామాల వెనుక ఉన్న దారుణం అందరిని కలవరపాటుకు గురిచేసింది. ఇలా కూడా జరుగుతుందా.. ఒక మహిళ ఇలా కూడా చేస్తుందా అనే భయం కలిగింది.
పోలీసులు అరెస్ట్ చేసిన ఆ మహిళ న్యాయవాది అసలు పేరు రుబీనా షేక్. ఈమె ఉపాధ్యాయ పేరుతో న్యాయవాదిగా చలామణి అవుతుంది. రుబీనా చదువుకున్నది 8వ తరగతి వరకే. తాను ఉన్నత చదువులు చదివినట్టు.. న్యాయవాద విద్య అభ్యసించినట్టు అందరిని నమ్మించింది. ఫేక్ సర్టిఫికెట్లు తీసుకొచ్చి పేరు పొందిన న్యాయవాది దగ్గర ప్రాక్టీస్ మొదలు పెట్టింది.
తన దగ్గరికి వచ్చే మహిళలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా డైవర్స్ కేసులను టేక్ అప్ చేసేది. వారికి విడాకులు వచ్చేలాగా కృషి చేసేది. ఆ తర్వాత వారిని క్రమంగా మాయమాటలు చెప్పి మార్చేది. అనంతరం వారికి మతం మార్చేది. ఇలా 175 మంది మహిళలను మతం మార్చింది. వారికి ముస్లిం యువకులతో పెళ్లి చేసింది. వాస్తవానికి దీనికి ఆమె లవ్ జిహాద్ అని పేరు పెట్టుకుంది.
ఇలా సాగిపోతున్న రూబీన వ్యవహారం ఒక యువతి ద్వారా బయటపడింది. ఆ యువతీకి వివాహం జరిగింది. భర్త తాకిడి తట్టుకోలేక విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆమె కేసును రూబీనా టేకప్ చేసింది. ఆమెకు మాయమాటలు చెప్పి మతం మార్చేందుకు ప్రయత్నించింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమె చెప్పిన వివరాలు మొత్తం సేకరించి.. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా హిందూ మహిళగా.. ఉపాధ్యాయగా ఒక రేంజ్ లో మహానటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది రూబీనా.. లవ్ జిహాద్ ను విజయవంతంగా కొనసాగించింది. చివరికి ఒక యువతీ ద్వారా ఈమె బండారం బయటపడింది. నర్మదాపురంలో ఈ సంఘటన సంచలనం సృష్టించగా.. దేశవ్యాప్తంగా కలకలానికి కారణమైంది. ఇటువంటి మహిళల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
