ఒకరి రాజీనామా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఆయన వ్యక్తిగత రాజీనామా ఆ నియోజకవర్గం దరిద్రాన్ని పారద్రోలింది. తెలంగాణ మొత్తం కూడా అన్ని నియోజకవర్గాలు ఈర్ష్య పడేలా చేసింది. ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ లో నెగ్గడం కోసం కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, పతకాల జాతర చూసి ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు తమ ఎమ్మెల్యేలను రాజీనామా చేయమని అడుగుతున్నారు. అలా చేస్తేనన్న తమ నియోజకవర్గాలకు నిధులు వచ్చి బాగుపడుతాయని ఆశిస్తున్నారు. రాజీనామా చేసి హుజూరాబాద్ పేదల బతుకులో వెలుగులు నింపుతున్న ఘనత ఈటల రాజేందర్ దే అని చెప్పొచ్చు. ఆయన రాజీనామాతో హుజూరాబాద్ దశ తిరుగుతోందట..

గెలవాలని కేసీఆర్ ఆ నియోజకవర్గానికి నిధులు వరద పారిస్తున్నాడు. కొత్త ఎత్తుగడ వేస్తున్నాడు. గతంలో కేసిఆర్ కి ఈటల రాజేందర్ లొంగిపోయినట్లు ఒక లేఖ సృష్టించి ఈటలను దెబ్బతీసిన కేసీఆర్ ఇప్పుడు కొత్త ఎత్తుల వేస్తున్నాడట.. ఆ లేఖ ఎవరు రాశారో తేల్చమని హుజురాబాద్ లో పోలీసు కంప్లైంట్ ఈటల చేసిన ఇంత వరకు తేల్చలేదు. ఇప్పుడు దళిత బంధు వద్దు అని లేఖ ఈటల రాసినట్టుగా పుట్టించారు. ఇది ఎవరు సృష్టించారు తేల్చాలని ఈటల డిమాండ్ చేస్తున్నాడు. దళిత బంధు అందరికీ ఇవ్వాలని ఈటల డిమాండ్ చేస్తున్నా ఆయన ఇవ్వకూడదని లేఖ రాశాడని పుట్టిస్తూ నైతికంగా ఈటలను దెబ్బతీసే కుట్ర సాగుతోంది..
ఈటలను టీఆర్ఎస్ లో పొమ్మనలేక కెసిఆర్ పొగ పెట్టాడనే టాక్ ఉంది. నేను ఎప్పుడన్నా హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించానా ? అని ఈటల తాజాగా వీణవంకలో ప్రశ్నించారు. నాకు కుడి, ఎడమ భుజం అని.. చివరికి నాకు కూడా జీతం ఇచ్చేది కూడా ఈటెల అని కేసీఆర్ చెప్పిండా ? లేదా? మరి ఎలా దయ్యం అయ్యానని ప్రశ్నించారు. ఆనాడు సమైక్య ముఖ్యమంత్రులు నా భూమి లాక్కున్నా నేను తెలంగాణ ప్రజల పక్షాన ఉన్నాను. ఉద్యమంలో జైళ్లలో ఉన్నాను. వీడు రోజు రోజుకు గట్టిగా అయితుండు అని కెసిఆర్ కి కోపం వచ్చింది. నాతో పని చేసిన హరీష్ మరో అవతారం ఎత్తిండు.. నాకు పదవులు ఇచ్చిన అంటున్నాడు. నాకు చేతకాకపోతేనే ఎమ్మెల్యే, ఫ్లోర్ లీడర్, మంత్రి పదవి ఇచ్చారా ? దమ్ముంది కాబట్టే ఇచ్చారని ఈటల విమర్శించారు.
‘‘ఏ పని చెప్పిన చేసిన. కెసిఆర్ కొత్త ఎత్తుగడ వేసిండు… కెసిఆర్ కి లొంగిపోయినట్లు ఒక లేఖ సృష్టించారు. ఇది ఎవరు రాశారో తేల్చమని హుజురాబాద్ లో పోలీసు కంప్లైంట్ చేసిన ఇంత వరకు తేల్చలేదు. ఇప్పుడు దళిత బంధు వద్దు అని లేఖ రాసిన అని పుట్టించారు. ఇది ఎవరు సృష్టించారు తేల్చాలి. రాజీనామా చేసి కూడా నా పేదల బ్రతుకులో వెలుగులు నింపుతున్న అని గర్వ పడుతున్నాను. ’’ ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారుు.
కేసీఆర్ ఇస్తున్న డబ్బులు అన్నీ మనవే తీసుకోండి. నేను ఎప్పుడన్నా కులం, మతం ఎంటి అని అడిగినా? బాధ ఎంటి అని తెలుసుకొని పని చేసిన. ఈటెల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఇన్ని వచ్చాయి, ఇక గెలిస్తే ఎన్ని వస్తాయి చూసుకోండి అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు ఈటల.. సద్ది తింటే రేవు తలచుకుంటాం నన్ను మర్చిపోకండి. మీ బిడ్డగా నన్ను ఆదరించండని వినూత్న శైలిలో ఈటల ప్రచారం చేస్తున్నారు.