https://oktelugu.com/

Lakhimpur khiri: లఖింపూర్ ఘటన: యూపీలో బీజేపీకి అధికారం దూరం చేస్తుందా?

Lakhimpur khiri: ఉత్తరప్రదేశ్ లోని ‘లిఖింపూర్ ఖేరి’లో హింసాత్మక ఘటన అక్కడి బీజేపీ సర్కార్ మెడకు చుట్టుకుంటోందా? మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఇష్యూ బీజేపీని భారీ దెబ్బ కొడుతోంది. రైతులపైకి బీజేపీ నేతల కారు ఎక్కించి చంపిన వైనం ఆ రాష్ట్రంలో కమలం పార్టీకి మైనస్ గా మారనుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది. లిఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితుల వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 5, 2021 / 04:45 PM IST
    Follow us on

    Lakhimpur khiri: ఉత్తరప్రదేశ్ లోని ‘లిఖింపూర్ ఖేరి’లో హింసాత్మక ఘటన అక్కడి బీజేపీ సర్కార్ మెడకు చుట్టుకుంటోందా? మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈ ఇష్యూ బీజేపీని భారీ దెబ్బ కొడుతోంది. రైతులపైకి బీజేపీ నేతల కారు ఎక్కించి చంపిన వైనం ఆ రాష్ట్రంలో కమలం పార్టీకి మైనస్ గా మారనుందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.

    లిఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితుల వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి బీజేపీ మెడకు చుట్టుకుంటోంది. ఈ రైతులను చంపిన వైనాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఎలుగెత్తి చాటుతోంది. యూపీ కాంగ్రెస్ బాధ్యురాలు ప్రియాంక గాంధీ ఆ చోటుకు వెళ్లడానికి ప్రయత్నించడం.. ఆమెను అడ్డుకోవడం.. అరెస్ట్ చేయడం.. కేసులు నమోదు చేయడం మరింత అగ్గి రాజేసింది. ప్రియాంక గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండడం వంటి కారణాలు బీజేపీని ఇరుకుపెడుతున్నాయి.

    రైతుల పైకి బీజేపీ నేతలు కారెక్కించి చంపించిన వీడియోను జాతీయ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. అందరు కాంగ్రెస్ నేతలు దాన్ని షేర్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్, బెంగాల్ సీఎం మమత సహా చాలా మంది ఈ దారుణాన్ని ఖండిస్తున్నారు.

    యూపీలో అసలే కులాల కొట్లాట.. అగ్రవర్ణాలు, దళితులు, యాదవులు అంటూ వర్గాల వారీగా విడిపోయిన పరిస్థితి. అందులోకి రైతు సమాజం అత్యంత బలంగా ఉంది. ఇప్పుడు బీజేపీ నేతలు రైతులనే తొక్కించి చంపడంతో యూపీలోని రైతు సంఘాలన్నీ ఏకమయ్యాయి. బీజేపీ కేంద్రమంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఇక కేంద్రమంత్రి కుమారుడిపై ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయించాయి.

    ఈ క్రమంలోనే రాబోయే కొన్ని నెలల్లోనే ‘యూపీ ఎన్నికలు’ ఉన్నాయి. ఈ రైతు ఉద్యమాలు.. రైతులను చంపించిన వైనం ఖచ్చితంగా యూపీలో అధికారంలో ఉన్న బీజేపీకి మైనస్ గా మారనుంది. అదే జరిగితే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం బీజేపీ చేతుల్లోంచి పోవడం ఖాయం. ఇక దేశంలో అధికారంలోకి రావాలంటే యూపీ ఎంపీ సీట్లే కారణం. ఆ రాష్ట్రంలో అధికారం కోల్పోతే కేంద్రంలో బీజేపీ నిలబడడం కష్టమే. సో లఖింపూర్ ఘటన బీజేపీకి మైనస్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    అసలే యూపీ ఎన్నికల టైం.. ప్రతిపక్షాలు కాచుకు కూర్చున్నాయి. ఈ టైంలో ఏది జరగకూడదో అదే జరిగింది. దీన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ , ఎస్పీ, బీఎస్పీ బలంగా జనంలోకి తీసుకెళుతున్నాయి. ఇది బీజేపీకి తీవ్ర దెబ్బగా మారింది. పైగా రైతుల విషయంలో బీజేపీ ఆది నుంచి కర్కషంగా వ్యవహరిస్తుందన్న ప్రచారం మొదలైంది. దీంతో ఈ పరిణామంలో యూపీలో బీజేపీ అడ్రస్ గల్లంతు చేసేలా ఉందన్న ఆందోళన ఆ పార్టీలో మొదలైందని చర్చ సాగుతోంది.