భారత్ లో కరోనా విలయం

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. లక్ష నుంచి మొదలుకొని రోజుకు మూడు లక్షల వరకు ఆ సంఖ్య చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేసులు తగ్గట్లే మరణాలు సైతం సంభవిస్తుండడంతో మరింత భయపడాల్సి వస్తోంది. తాజాగా.. దేశంలో 24 గంటల్లో 3.14 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మొన్నటివరకు అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ఈ మహమ్మారి ఇప్పుడు ఇండియాను అంతకంటే రెట్టింపు స్థాయిలో భయపెడుతోంది. ఒక్క రోజులో 16,51,711 […]

Written By: NARESH, Updated On : April 22, 2021 2:13 pm
Follow us on

భారతదేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. లక్ష నుంచి మొదలుకొని రోజుకు మూడు లక్షల వరకు ఆ సంఖ్య చేరింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కేసులు తగ్గట్లే మరణాలు సైతం సంభవిస్తుండడంతో మరింత భయపడాల్సి వస్తోంది. తాజాగా.. దేశంలో 24 గంటల్లో 3.14 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. మొన్నటివరకు అగ్రరాజ్యం అమెరికాను వణికించిన ఈ మహమ్మారి ఇప్పుడు ఇండియాను అంతకంటే రెట్టింపు స్థాయిలో భయపెడుతోంది.

ఒక్క రోజులో 16,51,711 శాంపిల్స్‌ టెస్టు చేయగా.. 3,14,835 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వరుసగా రెండు రోజూ 2 వేలకు పైగా మరణాలు సంభవించాయి. తాజాగా 2,104 మంది కరోనాతో మృత్యుఒడికి చేరారు. దేశంలో ఈ స్థాయిలో చనిపోవడం కూడా ఇదే మొదటిసారి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,59,30,965కి చేరగా.. మరణాలు 1,84,657 సంభవించాయి.

క్రియాశీల కేసుల సంఖ్య 22 లక్షలకు పైబడగా.. ఆ రేటు 13.82 శాతానికి పెరిగింది. ఇక నిన్న ఒక్కరోజే 1,78,841 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 34 లక్షల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 85.01 శాతానికి పడిపోయింది. మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్‌ ఉత్సవ్‌ నడుస్తూనే ఉంది.

ఇక తాజాగా మహారాష్ట్రలో 67,468 మంది కరోనా బారిన పడగా.. 568 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో 24,638, ఉత్తరప్రదేశ్‌లో 33,106 కేసులతో విజృంభిస్తోంది. ఢిల్లీలో 249 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 193, యూపీలో 187, గుజరాత్‌లో 125, కర్ణాటకలో 116 మరణాలు సంభవించాయి.