CM Jagan: ఆంధ్రప్రదేశల్ లో సంక్షేమ పథకాల జోరు కొనసాగుతోంది. అభివృద్ధి పనులు వెనుకబడిపోయాయి. దీంతో పైసలనే నమ్ముకున్న కాంట్రాక్టర్లకు పని లేకుండా పోతోంది. పైసలన్నీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే చేరడంతో చేయడానికి పని లేకుండా పోతోందని వైసీపీ ఎమ్మెల్యేలే పెదవి విరుస్తున్నారు. దాదాపు రూ. లక్ష కోట్లు ప్రజలకు చేరాయంటే ప్రభుత్వం ఏ మేరకు ఖర్చు చేస్తోందో తెలుస్తోంది. కానీ అభివృద్ధి పనులు మాత్రం కానరావడం లేదు. దీంతో నేతల్లో, ప్రజల్లో నిరసన వ్యక్తమవుతోంది.

గతంలో చంద్రబాబు కూడా పసుపు కుంకుమ పథకం కింద ఇంటికో రూ.10 వేలు అందించినా ప్రజలు జగన్ కే పట్టం కట్టారు. దీంతో సంక్షేమ పథకాలు ఏ మేరకు వైసీపీని గట్టెక్కిస్తాయోననే అనుమానాలు అందరిలో నెలకొన్నాయి. ఇటీవల విశాఖలో జరిగిన ఓ సమావేశంలో కొందరు వైసీపీ నేతలు అభివృద్ధి పనులు కూడా ఉండాలంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ముందే కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారోనని పార్టీ నేతలే ఎదురు చూస్తున్నారు.
ఎన్నికలెప్పుడొచ్చినా చేతిలో రూ.2 వేల నోటు పెట్టనిదే ఓటర్లు ఓటు వేయడనే సంగతి తెలిసిందే. దీంతో ఈ స్కీములు పార్టీని ఏ తీరుగా రక్షిస్తాయోననే సందేహాలు వస్తున్నాయి. అయినా జగన్ వాటిని నమ్ముకుని ఉన్నదంతా ఊడ్చిపెడుతున్నారు. అప్పులు తెచ్చి మరీ ప్రజల జేబులు నింపుతున్నారు. దీంతో ఇదే ఫార్ములాతో వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందాలని భావిస్తున్నారు. కానీ ఓటర్లు ఏ మేరకు స్పందించి ఓట్లు వేస్తారోననే శంఖ అందరిలో పట్టుకుంది.
ఏపీ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కూడా ఏడాదికి రూ.10 వేలు అందజేస్తోంది. కానీ వారు మాత్రం రోడ్లు బాగా లేకపోవడంతో ఆటో నడపడం కష్టంగా మారిందని చెబుతున్నారు. పది వేలు ఇచ్చే బదులు రోడ్లు బాగు చేస్తే మాకు ఇబ్బందులు ఉండవు కదా అని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ సంక్షేమ పథకాలు ప్రజలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాల్సిందే.