https://oktelugu.com/

ఆ ముగ్గురికి ఉద్వాసన అందుకేనా..?

ఎన్నో కసరత్తులు.. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రధాని మోదీ మోత్తానికి సెంట్రల్ కేబీనేట్లో చాలా మార్పలు చేశారు. ఊహించని విధంగా 12 మందికి ఉద్వాసన పలికి 43 మందితో కొత్తగా మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయితే కేబినేట్లోకి తీసుకున్నవారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకోవడం గమనార్హం. మరోవైపు రైతుల ఉద్యమాలను అణిచివేసేందుకు మోదీ కొత్తగా ‘సహకార శాఖ’ను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాఖను అమిత్ షా వద్దే ఉంచారు. ఇదిలా ఉండగా […]

Written By:
  • NARESH
  • , Updated On : July 9, 2021 / 03:37 PM IST
    Follow us on

    ఎన్నో కసరత్తులు.. ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రధాని మోదీ మోత్తానికి సెంట్రల్ కేబీనేట్లో చాలా మార్పలు చేశారు. ఊహించని విధంగా 12 మందికి ఉద్వాసన పలికి 43 మందితో కొత్తగా మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అయితే కేబినేట్లోకి తీసుకున్నవారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి తీసుకోవడం గమనార్హం. మరోవైపు రైతుల ఉద్యమాలను అణిచివేసేందుకు మోదీ కొత్తగా ‘సహకార శాఖ’ను ఏర్పాటు చేశారు. అయితే ఈ శాఖను అమిత్ షా వద్దే ఉంచారు. ఇదిలా ఉండగా కీలకంగా ఉన్న ముగ్గురు మంత్రులను కేబినేట్ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.

    కరోనా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలతో మాట్లాడుతూ ధైర్యం చెప్పారు. అత్యవసర నిర్ణయాలు తీసుకోవడంతో ఫస్ట్ వేవ్ నుంచి కొంచెం కాపాడగలిగారు. అయితే ఇతర పనుల వల్ల బిజీగా మారిన మోదీ ఆ బాధ్యతలను ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ కే అప్పగించారు. అయితే ఆయన సెకండ్ వేవ్ ను అంచనా వేయడంలో విఫలమయ్యారు.అంతేకాకుండా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా జాప్యాన్ని పాటించడంతో ఆయన మంత్రి పదవికి ఎసరొచ్చింది. దీంతో ఆయన స్థానంలో గుజరాత్ కు చెందిన మున్ సుక్ మాండవీయను భర్తీ చేశారు.

    కేబీనేట్లోని మరో కీలక శాఖ ఐటీ. ఈ శాఖ మంత్రిగా ఉన్న రవిశంకర్ 5జీ నెట్ వర్క్ ను విస్తరించడంలో విఫలమైనట్లు తెలసింది. మరోవైపు సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేజ్ బుక్ లతో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలోనూ ఆయన చొరవ చూపలేదు. ఇక న్యాయవ్యవస్థతో సత్సంబంధాలు లోపించడం కారణమని తెలుస్తోంది. అదే ఆయన మంత్రి పదవికి గండంగా మారింది. దీంతో ఆయన స్థానంలో మాజీ ఐఏఎస్ అధికారి అశ్విని వైష్ణవ్ ను నియమించారు.

    ప్రచారశాఖ మంత్రిగా ఉన్న జావడేకర్ పరిస్థితి కూడా అంతే. ప్రభుత్వ పనితీరును ప్రచారం చేయడంలో చాలా విఫలమయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తున్నా వాటిని ప్రజలకు చేరవేయడంలో పట్టించుకోలేదు. దీంతో ఆయన స్థానంలో అనురాగ్ ఠాకూర్ కు బాధ్యతలు అప్పగించారు.