కాంగ్రెస్ లో ప్రక్షాళన ప్రారంభం కానుందా?

పీసీసీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు కామనే. కొత్తేమీ కాదని పలువురు చెబుతున్నారు. పీసీసీ కార్యవర్గం ప్రకటించిన ప్రతిసారి ఇలాంటి వాతావరణం షరా మామూలే అని సెలవిస్తున్నారు కొందరు. అయితే ఇక్కడ మొదటి నుంచే రేవంత్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది. త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనున్న సందర్భంలో కాంగ్రెస్ ఏ మేరకు తనప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే […]

Written By: Raghava Rao Gara, Updated On : June 28, 2021 1:52 pm
Follow us on

పీసీసీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు కామనే. కొత్తేమీ కాదని పలువురు చెబుతున్నారు. పీసీసీ కార్యవర్గం ప్రకటించిన ప్రతిసారి ఇలాంటి వాతావరణం షరా మామూలే అని సెలవిస్తున్నారు కొందరు. అయితే ఇక్కడ మొదటి నుంచే రేవంత్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ బతికి బట్టకట్టే పరిస్థితి లేదని తెలుస్తోంది.

త్వరలో హుజురాబాద్ ఉప ఎన్నిక జరగనున్న సందర్భంలో కాంగ్రెస్ ఏ మేరకు తనప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే నేతల్లో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలతో కలిసేది లేదని తెగేసి చెబుతున్నారు. వారనుకున్నది వారు చేశారు. మేం అనుకున్నది మేం చేస్తామని పేర్కొంటున్నారు.

పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి అప్పగించడంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రేవంత్ రెడ్డికి పదవి దక్కడంలో చంద్రబాబు పాత్ర ఉందని కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ వచ్చేలా చూడాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి టాలెంట్ పై కోమటిరెడ్డి విమర్శలు చేయడంతో ఇప్పుడు ఆయన ప్రతిభను గుర్తించేలా నడుచుకోవాల్సిన అసవరం ఏర్పడింది. ఒకవేళ హుజురాబాద్ లో అలాజరగకపోతే కోమటిరెడ్డి మాటలే నిజమయ్యాయనే అపవాదును మూట గట్టుకునే పరిస్థితి ఎదురవుతుంది.

హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో గత రెండు సార్లు కౌశిక్ రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు. కౌశిక్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి బంధువు కావడంతో ఈసారి ఆయనకు టికెట్ కష్టమేనని చెబుతున్నారు. కౌశిక్ రెడ్డి స్థానంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యుడు పొన్నం ప్రభాకర్ కు అవకాశం ఇవ్వొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోటరీకి ఇక్కడ నుంచే చెక్ పెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లే కాంగ్రెస్ అధోగతి పాలైందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు సైతం ఉత్తమ్ పై బాహాటంగానే విమర్శలు చేశారు. టీఆర్ఎస్ తో కుమ్మక్కు కావడంతోనే తెలంగాణలో పార్టీ భవితవ్యం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏ మేరకు దిద్దుబాటు చర్యలు తీసుకుంటారోననే సందేహాు వ్యక్తం అవుతున్నాయి. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఉత్తమ్ పై రేవంత్ రెడ్డి అప్పటి పార్టీ ఇన్ చార్జి కుంతియాకు నేరుగా ఫిర్యాదు చేశారు. అభ్యర్థి ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో జరిగిన కుంభకోణాన్ని బయటపెడతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ తరువాత మరచిపోయారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ఉత్తమ్ కారులో భారీగా నగదు పట్టుబడినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఉత్తమ్ పాత్రపై అనుమానాలు రేగాయి.