కేసీఆర్ ముందస్తు వ్యూహం ఫలిస్తుందా?

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. భారీ సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా ఎదిగేందుకు కేసీఆర్, కేటీఆర్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఇప్పటికే అక్కడే మకాం వేసిన నేతలు తమ పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. కేసీఆర్ మనసెరిగిన రేవంత్ […]

Written By: Srinivas, Updated On : July 10, 2021 3:59 pm
Follow us on

తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దీంతో ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. భారీ సంక్షేమ పథకాలు ప్రకటిస్తున్నారు. దళిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాజకీయంగా ఎదిగేందుకు కేసీఆర్, కేటీఆర్ కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి నిలిపారు. ఇప్పటికే అక్కడే మకాం వేసిన నేతలు తమ పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు.

కేసీఆర్ మనసెరిగిన రేవంత్ రెడ్డి కూడా వచ్చే ఏడాది ఆగస్టు 15 తరువాత అసెంబ్లీ రద్దు చేస్తారని జోస్యం చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ ను సీఎం చేయరని స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యూహాలపై అవగాహన ఉన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. కేసీఆర్ ఆలోచనలపై తెలిసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారానికి అందరు కూడా ఔననే అంటున్నారు. ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే పనిలో పడిపోయారని తెలుస్తోంది. అసెంబ్లీ రద్దు వ్యవహారంలో కూడా ఇదే పద్దతి పాటిస్తున్నట్లు తెలుస్తోంది.

ముందస్తు ఎన్నికల ప్రచారంలో భాగంగా 2023 ద్వితీయార్థంలోనే నిర్వహిస్తారని తెలుస్తోంది. మరో ఏడాది ఉండగానే కేసీఆర్ ప్రణాళికలు వేసుకుంటున్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని అదే సమయానికి సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణలో ఎన్నికల కాలం ప్రారంభమైనట్లేనని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీల్లో కూడా ఈ మేరకు ప్లాన్ చేసుకుంటున్నట్లు నాయకుల తీరుతో తేటతెల్లం అవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు తమ ఉనికి చాటుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రణాళికలు వేస్తున్నారు.

రాబోయే ఎన్నికలను అన్ని పార్టీలు రెఫరెండంగా భావిస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించి తీరాలని చూస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటి నుంచే పక్కా ప్లాన్లు వేసుకుంటున్నాయి. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ తోపాటు షర్మిల కూడా తమ ప్రభావాన్ని చూపించేందుకు సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో అన్ని పార్టీల్లో ముందస్తు ఎన్నికల భయం పట్టుకుంది.