Telangana Congress: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ప్రజల్లో పోయిన పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక పార్టీని గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. దీని కోసం ప్రణాళికలు రచిస్తున్నారు ఇందులో భాగంగానే రాహుల్ గాంధీని తెలంగాణల పర్యటించేలా చేసి రైతు డిక్లరేషన్ చేయించారు. దీంతో పోయిన పరువును కాపాడుకోవాలని చూస్తున్నారు. అందుకే రాష్ట్రంలో అధికార పార్టీని ఎదుర్కొనే క్రమంలో అన్ని మర్గాలు వెతుకుతున్నారు. గెలుపు కోసం వ్యూహాలు అమలు చేయాలని చూస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల్లోనే రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. హైదరాబాద్ లో తెలంగాణ అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని భరోసా ఇచ్చారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ చేస్తున్న ఆగడాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తుతున్నారు దాదాపు రూ. 5 లక్షల కోట్లు అప్పులుగా తెచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతోంది. వృథా ఖర్చులతో ప్రజలపై పెనుభారం మోపుతోంది. అందుకే రైతు డిక్లరేషన్ ప్రకటించాం. రాబోయే రోజుల్లో విద్య, వైద్యం, నిరుద్యోగం వంటి అంశాల్లో కూడా డిక్లరేషన్ ప్రకటిస్తామన్నారు. దీంతో ప్రజల సమస్యలు పరిష్కరించే బృహత్తర కార్యక్రమాలకు బీజం వేస్తాం.
తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెసే అయినా ఫలితం మాత్రం టీఆర్ఎస్ అనుభవిస్తోంది. వందలాది అమరవీరుల త్యాగాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను నిత్యం బాధలకు గురిచేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలను ఎండగడతాం. కేసీఆర్ అవినీతిని బయటపెడతాం. ప్రాజెక్టుల్లో వేలాది కోట్లు పర్సంటేజీలుగా తీసుకుని తమ సంపద పెంచుకుంటోంది.
రైతులను కూడా ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. కేంద్రం, రాష్ట్రం కలిసి ఆటలాడుతూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. రాహుల్ గాంధీ తెలంగాణ విషయంలో క్లారిటీగా ఉన్నారు. ఇక్కడ పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని సూచించారు. నేతల్లో ఐకమత్యం తీసుకొచ్చి ఆందోళనలు ఉధృతం చేయాలని సూచించారు. దీనికోసం అందరు కలిసి పని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
Also Read:YCP Rajyasabha: తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు.. వైసీపీలో ఆక్రోశం.. జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?
Recommended Videos