https://oktelugu.com/

KCR- Modi: ఈ సారి కూడా ప్రధానిని సీఎం కలవడం లేదా?

KCR- Modi: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఎంతగా విభేదాలు పెరిగాయంటే ప్రధాని పర్యటనలకు కూడా సీఎం హాజరు కావడం లేదు. దీంతో బీజేపీ నేతలు కేసీఆర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పాల్సి ఉన్నా ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమాలైతే అవసరం లేదు కానీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం సీఎం కచ్చితంగా ఉండాల్సిందే. కానీ సీఎం కేసీఆర్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 22, 2022 / 12:57 PM IST
    Follow us on

    KCR- Modi: ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య వైషమ్యాలు పెరుగుతున్నాయి. ఎంతగా విభేదాలు పెరిగాయంటే ప్రధాని పర్యటనలకు కూడా సీఎం హాజరు కావడం లేదు. దీంతో బీజేపీ నేతలు కేసీఆర్ తీరుపై విమర్శలు చేస్తున్నారు.దేశ ప్రధాని వస్తే సీఎం కేసీఆర్ ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం చెప్పాల్సి ఉన్నా ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేటు కార్యక్రమాలైతే అవసరం లేదు కానీ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం సీఎం కచ్చితంగా ఉండాల్సిందే. కానీ సీఎం కేసీఆర్ మాత్రం దీన్ని విస్మరిస్తున్నారు.

    KCR- Modi

    మే 26న ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనలకు రానున్నారు. నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవానికి హాజరు అవుతున్నారు. కానీ దీనికి కూడా సీఎం హాజర కావడం లేదని తెలుస్తోంది. ఆ రోజు ఆయన బెంగుళూరు వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కేసీఆర్ మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా పలువురు సీఎంలను కలుస్తున్నారు. 26న కర్ణాటకలో దేవెగౌడ కుమారుడు కుమారస్వామిని కలుస్తారని ప్రకటిస్తున్నారు.

    Also Read: Rishabh Pant- DRS: ఢిల్లీ క్యాపిటల్స్ కొంప ముంచిన కెప్టెన్ పంత్!

    గతంలో కూడా ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడం విమర్శలకు తావిచ్చింది. గత నవంబర్ లో పీఎం నగరంలోని ఇక్రిశాట్ లోజరిగే కార్యక్రమానికి హాజరైతే కూడా అనారోగ్య కారణాలని చెప్పి తప్పించుకున్నారు. సమతామూర్తి విగ్రహావిష్కరణకు కూడా వెళ్లలేదు. దీంతో సీఎం కేసీఆర్ విమర్శల మూటగట్టుకున్నారు. అయినా ఆయనలో ఏ మాత్రం పశ్చాత్తాపం లేదు. దీనిపై బీజేపీ నేతలు ఎదురు దాడి చేస్తున్నారు. ఎందుకు పీఎం సమావేశాలకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

    Modi and KCR

    ఇలా తరచూ పీఎం కార్యక్రమాలకు డుమ్మా కొడుతూ ఏవో కారణాలు చెబుతూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కేంద్రంతో పెట్టుకుంటే అంత తేలిగ్గా ఉండదని తెలిసినా కేసీఆర్ లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రొటోకాల్ ను విస్మరించి ప్రవర్తించడంపై విమర్శల పాలవుతున్నారు. అయినా ఆయనలో ఏ మాత్రం చింత కనిపించడం లేదు. కానీ కేంద్రంతో పెట్టుకుని నెగ్గాలని చూస్తే ఆయనకే నష్టమని నిపుణులు సూచిస్తున్నా కేసీఆర్ మారడం లేదు.

    ఈ నేపథ్యంలో కేసీఆర్ తీరుపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎక్కడ కార్యక్రమం జరిగినా ఏ పార్టీ సీఎంలు ఉన్నా ప్రధానికి స్వాగతం పలకడం సహజమే. కానీ కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా ఉంటోంది. కేంద్రం తలుచుకుంటే కేసీఆర్ కు చుక్కలు చూపించడం ఖాయమే అని తెలిసినా ఆయన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు.

    Also Read:CM KCR- Early Elections: ముందస్తు ఎన్నికలకు కేసీఆర్ వెళ్లనున్నారా?

    Tags