Pawan Kalyan BJP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లో దూకుడుగా వెళ్తున్నారు. ఇంతకాలం కాస్త వెనకా ముందు ఆలోచిస్తూ అడుగులు వేసిన పవన్ ఇక సీరియస్ గా పొలిటికల్ నజర్ పెట్టాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నాడు. ఇటీవల ఆయన మత్స్యకారులకు మద్ధతుగా నరసాపురంలో సభ నిర్వహించారు. ఈ సభ దాదాపు సక్సెస్ అయ్యింది.. మత్స్యకారులతో పాటు జనసేన నాయకులతో ఈ సభ దద్దరిల్లింది. అయితే పవన్ నరసాపురం సభ నిర్వహించడంపై ఓ ఆసక్తికర చర్చ వెలుగులోకి వచ్చింది. ప్రత్యేకించి నరసాపురంలోనే సభ పెట్టడంతో ఆయన బీజేపీకి రాంరాం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందులో ఉన్న మతలబేంటో చూద్దాం..
పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం ఎంపీ నియోజకవర్గం నుంచి రఘురామకృష్ణం రాజు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీ నుంచి గెలిచిన ఆయన కొంతకాలంగా ఫ్యాన్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో ఆయన ప్రభుత్వానికి చేసిన వ్యతిరేక కామెంట్ల కారణంగా ఆయనను జైళ్లో పెట్టి హంగామా చేశారు. దీంతో ఆయన వైసీపీపై పోరాడుతున్నారు. ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ఇరుకునపెడుతున్నారు. గత కొద్ది రోజులుగా బీజేపీలోకి చేరుతారంటూ ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా ఇటీవల ఓ మీడియా సమావేశంలో ఆయన తన పదవికి రాజీనామా చేస్తానని కూడా అన్నారు. తాను రాజీనామా చేస్తే బీజేపీ నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఒకవేళ నరసాపురం ఎంపీ నియోజకవర్గం నుంచి మరోసారి రఘురామకృష్ణం రాజు బీజేపీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడున్న లెక్కల ప్రకారం.. పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలి. ఆయన తరుపున ప్రచారం చేయాలి. కానీ పవన్ అలా అనుకోవడం లేదట. ఎందుకంటే బద్వేల్ ఉప ఎన్నికల్లో సానుభూతి కోణంలో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు పవన్.. అన్ని పార్టీలు అలానే చేయాలని సూచించారు. కానీ పవన్ మాటలను ధిక్కరించి మిత్ర పార్టీ బీజేపీ మాత్రం అభ్యర్థిని నిలబెట్టింది. అయితే ఆ అభ్యర్థి తరుపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు. అప్పటి నుంచి పవన్ బీజేపీకి దూరంగానే ఉంటున్నాడు. తాజాగా నర్సాపురంలో జనసేన సభ నిర్వహించడంతో పవన్ ఇక బీజేపీకి రాం రాం చెప్పినట్లేనని తెలుస్తోంది.
Also Read: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి అసలు కారణం ఏంటి?
ఇక నరసాపురం నుంచి సోదరుడు నాగబాబు గతంలో పోటీచేశారు. ఇప్పుడు కూడా మళ్లీ నరసాపురం నుంచే నాగబాబును పోటీలోకి దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసిన నాగబాబు ఓడిపోయారు. ఒకవేళ రఘురామరాజు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో నాగబాబును బరిలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు. అందువల్లే బీజేపీకి పవన్ దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు ముందు పవన్ బీజేపీలో ఉంటాడా..? లేదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.
గత కొన్ని రోజులుగా పవన్ బీజేపీతో అంటిముట్టనట్లుగా ఉంటున్నాడు. అలాగే కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. ఒకవేళ ఏపీ బీజేపీతో కలిసున్నా.. తెలంగాణ బీజేపీతో కలిసుండాల్సిన పరిస్థితి. కానీ అక్కడ పవన్ టీఆర్ఎస్ తో సత్సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో తనకు బీజేపీతో ఎలాంటి లాభం లేనందువల్ల ఆ పార్టీతో తెగదెంపులే బెటరని ఆలోచిస్తున్నారట.. దీంతో పవన్ ఇక బీజేపీతో పూర్తిగా బంధం తెంచేసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది.
Also Read: ‘భీమ్లానాయక్’కు చంద్రబాబు, లోకేష్ సపోర్టు.. జూ.ఎన్టీఆర్, బాలకృష్ణను లాగి కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని
Recommended Video: