Pawan Kalyan: ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో వైసీపీ గెలవకూడదు.. ఇదే పంతంతో ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఆయన తాను బీజేపీని వదిలేస్తానని ఎక్కడా చెప్పడం లేదు. కానీ ఓట్లు చీలిపోకుండా వైసీపీని ఓడించేందుకు బీజేపీని ఒప్పిస్తానని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సంచలన శపథం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇప్పటికే అమరావతి విషయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ దీన్ని చేసి చూపించారు. రైతుల కోసం బీజేపీని ఒప్పించారు. ఆందోళనలో కలిసి చేసేలా చేశారు. దీనికి టీడీపీ కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు వైసీపీని ఓడించేందుకు ఓట్లు చీలిపోకుండా బీజేపీని ఒప్పిస్తానన్న పవన్ కళ్యాణ్ మాటలు వైరల్ అయ్యాయి.
అయితే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ ధియోధర్ లాంటి వారు టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరోవైపు జనసేన పార్టీ అధికారికంగా బీజేపీతో పొత్తులో ఉంది. అయితే వైసీపీని ఓడించేందుకు ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ సంకేతాలిచ్చారు. కానీ ఇదివరకే ఒకసారి మోసం చేసిన చంద్రబాబుతో కలిసి వెళ్లేందుకు బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదు. మరి టీడీపీతో కలిసేందుకు ససేమిరా అంటున్న బీజేపీని పవన్ కళ్యాణ్ ఒప్పిస్తాననడం అనడంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఓట్లు చీలనివ్వమని పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనతో ఏపీ రాజకీయాల్లో కీలకమైన మార్పు వచ్చింది. ఈ క్రమంలోనే బీజేపీ ఒప్పుకుంటుందా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రధానాంశంగా మారింది. బీజేపీ ఒప్పుకోకుంటే అది అంతిమంగా వైసీపీకే లాభం చేకూరుస్తుంది. ఓట్లు చీలేందుకు బీజేపీనే అవకాశం ఇచ్చినట్టు అవుతోంది. బీజేపీ ఒప్పుకోకుంటే పరిస్థితి ఏంటన్నది ఇప్పసుడు అసలు ప్రశ్న. వైసీపీని ఓడించేందుకు బీజేపీని పవన్ వదిలేస్తారా? అన్న ప్రచారం కూడా ప్రారంభమైంది. ఒప్పుకుంటేనే పొత్తుతో ముందుకెళుతారా? అన్న అనుమానాలు నెలకొంటున్నారు.
ఇక ఇప్పటికే జనసేన క్యాడర్ , నేతలు కూడా బీజేపీతో కలిసి సాగేందుకు పెద్దగా ఇష్టపడడం లేదన్న టాక్ ఉంది. బీజేపీ వల్ల ఓ వర్గం ఓటు బ్యాంకు తమకు దూరం అవుతున్న ఆవేదన ఉంది. మైనార్టీ ఓట్లు పోతున్నాయని కొందరు జనసేన నేతలు ఆందోళనగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేనలు కలిసి ప్రచారం చేసిన దాఖలాలు లేవు.
ఇక ప్రతి సారి ఎన్నికల్లో జనసేన వైదొలగడం.. బీజేపీ పోటీచేయడంతో జనసేన ఓటు బ్యాంకును బాగానే బీజేపీకి టర్న్ అవుతోంది. బలపడుతున్నామన్న భావనను బీజేపీ అన్వయించుకుంటోంది.
కేంద్రంలో అధికారం ఉండడం బీజేపీకి పెద్ద ఫేవర్ గా ఉంది. ఈ క్రమంలోనే కేంద్రంలో వైసీపీతో బీజేపీ స్నేహంగా ఉంది. ఈ క్రమంలోనే జనసేన పిలుపు మేరకు టీడీపీతో బీజేపీ కలుస్తుందా? లేదా? అన్నది పెద్ద ప్రశ్న. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతోనే కలిసి సాగి టీడీపీని కలుపుకుపోవాలన్న పవన్ నైజం. కేంద్రాన్ని బూచీగా చూపి జగన్ ను ఆడించాలని పవన్ స్కెచ్ గీస్తున్నారు. తనను ఏమీ చేయకుండా బీజేపీ అండదండలతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయాలని పవన్ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఏపీలో వైసీపీని ఓడించేందుకు బీజేపీని అంటిపెట్టుకునే ఆలోచనలోనే పవన్ ఉన్నారు. ఇందుకోసం ఒప్పించడానికే సిద్ధమైనట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ మాటకు బీజేపీ ఒప్పుకుంటుందా? కలిసి సాగుతుందా? అన్న దానిపైనే ఏపీ భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి ఉన్నాయి.