CM Kcr: టీఆర్ఎస్ లో మంత్రుల పాత్ర వివాదాస్పదంగా మారుతోంది. ఈటల రాజేందర్ ను తొలగించడంతో చాలా మందిపై ఆరోపణలు వచ్చినా కేసీఆర్ దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నారు కానీ వారిపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు. ఇటీవల ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై సైతం ఇదే కోవలో ఆరోపణలు వచ్చినా ఆయనపై కూడా చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. గతంలో సైతం ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినా లెక్కలోకి తీసుకోవలేదు.

ఇంకో అమాత్యుడిపై లైంగిక ఆరోపణలు సొంత మీడియాలోనే హల్ చల్ చేసినా పట్టించుకోలేదు. పైగా ఆయనపై గ్రానైట్ అక్రమ రవాణా కేసులుండటం తెలిసిందే. అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు ఈటల రాజేందర్ నైతే పక్కన పెట్టి మిగతా వారిని మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదు. మంత్రి మల్లారెడ్డిపై ఉన్నన్ని ఆరోపణలు ఎవరి మీదా లేవు.
Also Read: Modi Jammu Tour: జమ్మూలోని ‘పల్లి’ ప్రత్యేకత ఏంటి..? ప్రధానికి ఇక్కడికి ఎందుకు వెళ్తున్నారు..?
మరోవైపు గవర్నర్ తో ఉన్న భేదాభిప్రాయాల కారణంగా మంత్రివర్గ విస్తరణపై మాట్లాడటం లేదు. ఇదే టీంతో ఎన్నికలకు వెళితే విజయం సాధిస్తారా? పీకే సూచించిన సలహాలు, సూచనలు లెక్కలోకి తీసుకుంటారా? లేక సొంత నిర్ణయాలతోనే ఎన్నికలకు సిద్ధమవుతారా? అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రులందరి పైనే ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు. ఇదే టీంతో ఎన్నికలకు వెళితే మట్టి కరవడం ఖాయమనే అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు.

కేసీఆర్ తలుచుకుంటే ఏదైనా చేస్తారు. కలెక్టర్ ను ఎమ్మెల్సీ చేస్తారు? ఎందుకు పనికిరాని వారిని మంత్రిని చేస్తారు? ఇంకా తలుచుకుంటే ఎక్కడో ఉన్న వారికి అందలాలు ఎక్కించగలరు. కానీ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఇదే టీంతో కలిసి రాదనే బెంగ పట్టుకుంది. మంత్రివర్గ విస్తరణ చేపడతామంటే గవర్నర్ తో విభేదాలు ఉన్నాయి. ఆమెతో మాట్లాడకుండా తప్పించుకుతిరిగే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణ చేపట్టాలంటే ఆమెను కలిసి మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారనే సందిగ్ధంతో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:Padayatra: పాదయాత్రలతో అధికారంలోకి వస్తారా..? చరిత్ర ఏం చెబుతోంది..?
[…] Mangam Peta Karimnagar: ఎవరో వస్తారని ఏదో చేస్తారి ఎదురు చూసి మోసపోకుమా అన్నారో సినీకవి. ఇది అక్షరాల వారికి వర్తిస్తుంది. తాము అనుకున్న లక్ష్యం కోసం అందరు ఒకటై శ్రమిస్తున్నారు. శ్రమదానంతో గుట్టను సైతం చదును చేస్తున్నారు. ముంపు గ్రామమైనా కంపును ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఆశపడలేదు. చేతుల్లో సత్తువ ఉంది. కష్టపడే తత్వం ఉందని నిరూపిస్తున్నారు. పదిమందికి ఆధర్శంగా నిలుస్తున్నారు. […]