KCR- National Politics: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ రాణిస్తారా?

KCR- National Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ దారెటు అటు జాతీయ రాజకీయాలకా ఇటు రాష్ట్ర రాజకీయాలకా అనేది తేలడం లేదు. ఓ పక్క జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్నా అక్కడ సరైన ఆదరణ కనిపించడం లేదు. ఏదో ఒకటో రెండో రాష్ట్రాలను పట్టుకుని జాతీయ రాజకీయాలంటే కుదరదు. దానికి చాలా కసరత్తు ఉండాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. విభిన్నమైన వ్యూహాలు రచించాలి. అప్పుడే జాతీయ రాజకీయాల్లో మనకు అవకాశాలు లభిస్తాయి. కేసీఆర్ ను ఎవరు […]

Written By: Srinivas, Updated On : May 24, 2022 12:52 pm
Follow us on

KCR- National Politics: తెలంగాణ సీఎం కేసీఆర్ దారెటు అటు జాతీయ రాజకీయాలకా ఇటు రాష్ట్ర రాజకీయాలకా అనేది తేలడం లేదు. ఓ పక్క జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్నా అక్కడ సరైన ఆదరణ కనిపించడం లేదు. ఏదో ఒకటో రెండో రాష్ట్రాలను పట్టుకుని జాతీయ రాజకీయాలంటే కుదరదు. దానికి చాలా కసరత్తు ఉండాలి. ముందుచూపుతో వ్యవహరించాలి. విభిన్నమైన వ్యూహాలు రచించాలి. అప్పుడే జాతీయ రాజకీయాల్లో మనకు అవకాశాలు లభిస్తాయి. కేసీఆర్ ను ఎవరు నమ్మడం లేదు. అందుకే అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. కేసీఆర్ మాత్రం వాపును చూసి బలుపనుకుని మురుస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

KCR

మరోవైపు తెలంగాణకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా, రాహుల్ గాంధీ వంటి వారిని పొలిటికల్ టూరిస్టులుగా అభివర్ణించిన టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తమ నేత ఢిల్లీ వెళితే ఆయన టూరిస్టు అవుతారా? లేక జాతీయ నేత అవుతారా? అని బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడతారనే దానికి ఇదే నిదర్శనం. ఎప్పుడైనా ఒకరిని విమర్శించే ముందు మన లెక్క కూడా చూసుకుంటే మంచిది. కేసీఆర్ వ్యూహం జాతీయ రాజకీయాలను శాసించాలని ఉన్నా అది అంత సాధ్యం కాదనే విషయం ఈపాటికే అర్థమై ఉండాలి.

Also Read: KCR Returned From Delhi: మోడీ దెబ్బకు కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్.. అసలు కారణమిదే?

తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులను పరామర్శించిన పాపాన పోకుండా ఎక్కడో పంజాబ్ లో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వడమేమిటని రైతులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఏమైనా ఫర్వాలేదు కానీ దేశాన్ని ఉద్దరిస్తారట. కూట్లో రాయి ఏరలేనోడు ఏట్లో రాయి ఏరినట్లుగా ఉందని అందరు దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. జాతీయ రాజకీయాలు ఏమో కానీ రాష్ట్రంలో మాత్రం పరువు పోతోంది.

KCR

అయినా తెలంగాణ మంత్రులు తమదే పైచేయి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి జాతీయ రాజకీయాలు అంటూ వెంపర్లాడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఉత్తరాదిలో దక్షిణాది వారి మాట చెల్లుబాటు కాదనే విషయం ఈ పాటికే బోధపడి ఉండాలి. కానీ కేసీఆర్ మొండి వైఖరితో అందరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ఆయన అవసరం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రధాని అవుతారా? అంత సత్తా ఉందా? అనే కోణంలో విభిన్న విమర్శలు వస్తున్నాయి. వాటిని కేసీఆర్ లెక్క చేయడం లేదని తెలుస్తోంది. కానీ రాష్ట్రంలో పార్టీ భవితవ్యం అగమ్యగోచరంగా మారనుంది. రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు జరిగినా స్పందించని కేసీఆర్ అక్కడ జరిగితే ఎలా స్పందిస్తున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తారా? లేక ఢిల్లీ వేదికగా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారో వేచిచూడాల్సిందే మరి.

Also Read:Bandi Sanjay: ‘బండి’ పాదం ఆగనంటోంది.. మరో యాత్రకు రె‘ఢీ’
Recommended videos


Tags