KCR Vs BJP: పార్టీలు, ప్రభుత్వాలు ప్రజలకు మేలు చేయడం అటుంచి.. రాజకీయ చట్రంలో తిరుగుతూనే ఉంటాయి.. ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నా చివరికి బలైపోయేది సాధారణ పౌరుడేనని నమ్మలేని సత్యం.. తెలంగాణ విమోచన దినోత్సవం స్కెచ్ తో టీఆర్ఎస్ ను బీజేపీ ఇరుకున పెడితే గిరిజన రిజర్వేషన్ ప్రకటించి కేసీఆర్ బీజేపీని డైలామాలో పడేశాడని జోరుగా చర్చ సాగుతోంది. వారంలోగా అమలవుతుందని చెప్పడం మరో స్టంట్..
ఇరుకున పడేసిన టీఆర్ఎస్
గిరిజన భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ గిరిజనుల రిజర్వేషన్ ను ప్రకటించి వారంలోగా జీవో కూడా జారీ చేయాలని సభ సాక్షిగా సీఎస్ కు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక దీన్ని పార్టమెంట్ లో ఫైనల్ చేయాలని కేంద్రానికి కూడా పంపుతామని చెప్పడం మరో స్టెంట్. 6 శాతం ఉన్న గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2017లో బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి, పార్లమెంట్ ఆమోదించేందుకు పంపారు. దాదాపు ఐదేండ్ల తర్వాత ఇదే అంశాన్ని తెరమీదకు తెచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీని డైలామాలో పడేసింది.
ఒత్తిడి పెంచుతున్న బీజేపీ
గిరిజన రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీ కూడా వెనక్కు తగ్గడం లేదు. ప్రజా సంగ్రామ యాత్రలో రాష్ర్ట ఛీప్ బండి సంజయ్ కుమార్ ఇదే అంశంపై కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ పార్టీ పాపులారిటీ తగ్గకుండా చూసుకుంటున్నారు. ‘సభల ద్వారా జీవోలు జారీ చేయడం మగతనం కాదని అమలు చేసి చూపాలని’ సవాల్ విసురుతున్నారు. గతంలో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో ఊటంకిస్తూనే దీన్ని కూడా అమలు చేయడని ఆరోపణలు గుప్పిస్తున్నాడు. ఎస్టీలకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, అందుకే ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ముర్మును రాష్ర్టపతిని చేశామని గిరిజనులకు దేశంలో పెద్ద పదవి ఇచ్చి తమ చిత్తశుద్ధి ఎప్పుడో చాటుకున్నామని ఆ సమయంలో కేసీఆర్ ఎటు ఉన్నారో ప్రజలకు తెలుసునని చెప్పారు.
Also Read: Ramanuj Pratap Singh- Cheetahs: ఆ రాజు వేట సరదా.. చిరుతల అంతానికి కారణం
సుప్రీం ఏం చెప్పింది
రాజకీయ చదరంగాంలో రిజర్వేషన్ పావులు ఎటు కదులుతాయో అందరికీ తెలసిన సత్వమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంలో పరిధులు ఉండాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. సామాజిక రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని 1992 ఇందిరా సాహ్ని కేసులో తీర్పు వెలువరించింది. గతంలో ఎన్టీఆర్ హయాంలో బీసీలకు 40 శాతం రిజర్వేషన్ అంశంలో ఉమ్మడి రాష్ర్టంలో ఆందోళనలు పెరగడంతో సుప్రీంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై స్పందించిన సుప్రీం గతంలో తీర్పును పరిగణలోకి తీసుకుంది. దీంతో ఎన్టీఆర్ ఆ అంశాన్ని వెనక్కు తీసుకున్నారు.
ఎలక్షన్ స్టంట్
రాష్ర్టంలో ఎన్నికల వేడి మరింత రాజుకుంటుంది. దాదాపు వచ్చే ఏడాది తెలంగాణకు సాధారణ ఎన్నికలు ఉండంతో అన్ని పార్టీలు సభలు, సమావేశాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, హామీలతో మరింత దూకుడు పెంచుతున్నారు. వివిధ అంశాలపై పార్టీలన్నీ ఒకదానిపై ఒకటి దుమ్మెత్తిపోస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రాష్ర్ట ఎమ్మెల్సీ హస్తం ఉందని బీజేపీ టీఆర్ఎస్ ను ఇరుకున పెడితే.. గిరిజన రిజర్వేషన్ ప్రకటించి ఆమోదానికి కేంద్రానికి పంపుతామని టీఆర్ఎస్ బీజేపీని సెంటర్ చేసింది. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ బిల్లు రూపంలో ముందుకెళ్లారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. రిజర్వేషన్ అంశం కొత్తదేమీ కాదని గతంలో కూడా ఇదే విధంగా ముస్లింలకు రిజర్వేషన్ కల్పించాలని శాసనసభ ఆమోదించిన తీర్మానం విషయం ఏమైందని ఇప్పుడు ఇది కొత్తగా ఎన్నకల కోసం తీసుకచ్చారే తప్ప గిరిజనులకు దీనితో ఒరిగేది ఏం లేదని, ఇదే అంశం ఎన్నికల ప్రచారానికి వాడుకుంటారని బాహాటంగానే చర్చ జరుగుతోంది. జీవో జారీ తర్వాత కేసీఆర్ వర్గమే కోర్టును ఆశ్రయిస్తుందని దీంతో ఎన్నికల వరకు ఇది స్టాండ్ బైగా ఉంటుందని విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.