ఒలింపిక్స్ తో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందా?

ఒలింపిక్స్ సంబరం మొదలు కాబోతోంది. టోక్యో వేదికగా ఈ వేడుక ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని దేశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈసారి గేమ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోనున్నాయి. గతేడాది కరోనా నేపథ్యంలో వాయిదా పడిన క్రీడలను ఈ సారి నిర్వహించేందుకు సమాయత్తం కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. జపాన్ ప్రభుత్వం ఈ క్రీడల కోసం 2013లోనే బిడ్ వేసింది. అప్పట్లో గేమ్స్ నిర్వహణ కోసం 730 కోట్ల డాలర్లు (సుమారు రూ.54 వేల […]

Written By: Srinivas, Updated On : July 22, 2021 6:50 pm
Follow us on

ఒలింపిక్స్ సంబరం మొదలు కాబోతోంది. టోక్యో వేదికగా ఈ వేడుక ప్రారంభం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని దేశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈసారి గేమ్స్ చరిత్రలో అత్యంత ఖరీదైనవిగా నిలిచిపోనున్నాయి. గతేడాది కరోనా నేపథ్యంలో వాయిదా పడిన క్రీడలను ఈ సారి నిర్వహించేందుకు సమాయత్తం కావడంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది. జపాన్ ప్రభుత్వం ఈ క్రీడల కోసం 2013లోనే బిడ్ వేసింది. అప్పట్లో గేమ్స్ నిర్వహణ కోసం 730 కోట్ల డాలర్లు (సుమారు రూ.54 వేల కోట్లు) ఖర్చు కానుందని అంచనా వేసింది.

బిడ్ దాఖలు చేయడానికే 10 కోట్ల డాలర్లు ఖర్చయింది. గతేడాది క్రీడలు వాయిదా వేయడానికి ముందు ఒలింపిక్స్ నిర్వహణ కోసం 1260 కోట్ల డాలర్లు (సుమారు రూ.93 వేల కోట్లు) ఖర్చవుతాయని సవరించిన అంచనాలను జపాన్ ప్రభుత్వం విడుదల చేసింది. గేమ్స్ వాయిదా పడడం వల్ల జపాన్ కు అదనంగా 280 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. కానీ ఈ అంచనాలన్ని తలకిందులై ఇప్పుడు మొత్తంగా ఖర్చు 3300 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.45 లక్షల కోట్లు)గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

ఒలింపిక్స్ లో ప్రేక్షకులను అనుమతించి ఉంటే దీని ద్వారా 80 కోట్ల డాలర్లు (సుమారు రూ.6 వేల కోట్లు) వచ్చేవి. కరోనా నేపథ్యంలో క్రీడలు ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తుండడంతో మొత్తం టోక్యో ఒలింపిక్స్ నష్టపోయినట్లే. క్రీడల కోసం వివిధ ప్రదేశాల్లో జపాన్ కు చెందిన 60 కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 300 కోట్ల డార్లు వస్తాయి. ఇతర స్పాన్సర్లు మరో 20 కోట్ల డాలర్లు ఇస్తున్నారు. టీవీ హక్కులు, స్పాన్సర్ షిప్స్ , ఆతిథ్య రంగాలన్ని కలిపి మరో 200 కోట్ల డాలర్లు కూడా వచ్చాయి.

ఒలింపిక్స్ పోటీలు నిర్వహించే కమిటీలకు లాభాలు తెచ్చిపెట్టాయి తప్ప ఆతిథ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మాత్రం అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్క 1984 లాస్ ఏంజిల్స్ గేమ్స్ మాత్రమే అమెరికాకు లాభాలు తెచ్చి పెట్టాయి. రియో, సోచి, ఏథెన్స్, మోంట్రియాల్ నగరాలు క్రీడలు నిర్వహించినప్పుడు ఆయా దేశాలు దారుణమైన అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది.