https://oktelugu.com/

ABN RK vs Jagan: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను జైలుకు పంపాలన్న జగన్ కోరిక నెరవేరుతుందా?

ABN RK vs Jagan: ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని అందరికీ ఉంటుంది. రాజకీయాల్లో ఇది ఇంకా పతాకస్థాయిలో ఉంటుంది. అందుకే అడుగడుగునా ప్రత్యర్థులు ఎదగకుండా తొక్కేయాలని చాలా మంది చూస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఇలానే తొక్కేశారు. ఏపీలో టీడీపీని తొక్కే పనిలో జగన్ బిజీగా ఉన్నారు. దేశంలోని చాలా మంది రాజకీయ నేతలు కొంత మంది ఇదే పని పెట్టుకుంటారు. ఏపీలో అయితే ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. జగన్ సీఎం అయ్యాక టీడీపీ అనుకూల […]

Written By:
  • NARESH
  • , Updated On : July 1, 2022 / 06:16 PM IST
    Follow us on

    ABN RK vs Jagan: ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని అందరికీ ఉంటుంది. రాజకీయాల్లో ఇది ఇంకా పతాకస్థాయిలో ఉంటుంది. అందుకే అడుగడుగునా ప్రత్యర్థులు ఎదగకుండా తొక్కేయాలని చాలా మంది చూస్తుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ ను కేసీఆర్ ఇలానే తొక్కేశారు. ఏపీలో టీడీపీని తొక్కే పనిలో జగన్ బిజీగా ఉన్నారు. దేశంలోని చాలా మంది రాజకీయ నేతలు కొంత మంది ఇదే పని పెట్టుకుంటారు. ఏపీలో అయితే ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. జగన్ సీఎం అయ్యాక టీడీపీ అనుకూల మీడియాను టార్గెట్ చేసి ముప్పుతిప్పలు పెడుతున్నారు. అఫ్ కోర్స్.. చంద్రబాబు సీఎంగా ఉన్న రోజుల్లో జగన్ ను ఇంతకుమించి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఘనత ఈ టీడీపీ మీడియా సొంతం. అందుకే ఆ ప్రతీకారం ఇప్పుడు కొనసాగుతోంది.

    జగన్ అంటే ఎంతో అభిమానం చూపించే బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కోర్టుల్లో పిటీషన్లు వేస్తూ అందరినీ జైలు పాలు చేస్తుంటాడు. సోనియా, రాహుల్ పై ‘నేషనల్ హెరాల్డ్ ’ కుంభకోణం కేసు వేసింది ఈ సుబ్రహ్మణ్యస్వామినే.. ఇప్పుడు వారిద్దరూ ఈ కేసులో పీకల్లోతూ కూరుకుపోయి ఈడీ విచారణ ఎదుర్కొంటున్నారు.

    ఇక జయలలిత అక్రమాస్తుల కేసును కూడా వేసింది ఇదే సుబ్రహ్మణ్య స్వామి. చాలా లిటికేషన్లు బయటకు తీసి దేశంలోని ప్రముఖులను జైలు పాలు చేసిన ఘనత సుబ్రహ్మణ్య స్వామి సొంతం. అయితే ఈయన ఒక లాయర్ కాదు.అయినా లూప్ హోల్స్ వెతికి భలే పిటీషన్లు వేసి ప్రత్యర్థులను ఇరికించేస్తుంటారు.

    జగన్ పై ప్రేమతో.. తనపై వార్తలు రాసిందన్న కక్షతో ఆంధ్రజ్యోతిపై అప్పట్లో తిరుపతి కోర్టులో పరువునష్టం దాఖలు చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. ఆర్కేపై పిటీషన్ వేసిన సుబ్రహ్మణ్యస్వామికి అన్ని రకాల అండదండలు అందిస్తోందట వైసీపీ బ్యాచ్. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణను జైలుకు పంపడమే ధ్యేయంగా ఈ కేసులో విచారణకు తాజాగా సుబ్రహ్మణ్య స్వామి హాజరయ్యాడు. లాయర్ ను పెట్టుకోకుండా స్వయంగా వాదనలకు సిద్ధం కావడం కోర్టు జడ్జీని ఆశ్చర్యపరిచింది.

    ఎందుకంటే సుబ్రహ్మణ్యస్వామి ఒక లాయర్ కాదు.. ఒక సీనియర్ బీజేపీ రాజకీయ నేత. ఆయన ఎలా వాదిస్తారని అందరికీ డౌట్ వచ్చింది. లాయర్ ను పెట్టుకునే స్థోమత లేదా? లేక కావాలనే తనను తాను ఊహించుకొని సుబ్రహ్మణ్యస్వామి ఇలా చేస్తున్నాడా? అన్న డౌట్లు వినిపిస్తున్నాయి.

    ఇక మరికొందరు ఏమో.. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యస్వామి వెనుకాల వైసీపీ పెద్దలు ఉన్నారని.. వారే ఆయనకు ఢిల్లీ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా తన ప్రత్యర్థి ఆంధ్రజ్యోతి ఆర్కేను జైలుకు పంపాలన్న జగన్ అభిలాషను సుబ్రహ్మణ్య స్వామి నెరవేరుస్తాడో లేదో చూడాలి.