India rare earth sector: ప్రస్తుతం ప్రపంచంలో ఏం నడుస్తుంది అంటే.. ఒకవైపు అమెరికా టారిఫ్‌లు.. ఇంకోవైపు రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రపంచ దేశాల మధ్య పోటీ. ఎందుకంటే వీటి అవసరం అన్ని దేశాలకు ఉంది. కానీ, ఇవి దొరకడం అరుదు. అందుకే వీటిపై ఆధిపత్యం కోసం అమెరికా, చైనా పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఇందులోకి ఇప్పుడు భారత్ కూడా ఎంటర్ అవుతోంది. రియర్ ఎర్త్ మెటల్స్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ రికార్డ్ స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుద్దీకరణ, పునరుత్పాదక విద్యుత్, అత్యాధునిక ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వీటి వినియోగం కీలకంగా మారింది. 2023లో 2 లక్షల మెట్రిక్ టన్నుల డిమాండ్ ఉండగా, 2030 కల్లా 4 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఇండస్ట్రీ అవసరాల కారణంగా మెగ్నెట్ తయారీకి అవసరమైన నియోడైమియం, ప్రసియోడైమియం, డిస్ప్రోసియం వంటి రేర్ ఎర్త్ డిమాండ్ 10 శాతం వృద్ధి కనిపిస్తోంది.
భారత్‌లో నిల్వలు?
భారత్‌లో మొత్తం 8.52 మిలియన్ టన్నులు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ నిల్వలు ఉన్నాయి. వీటిల్లో 7.23 మిలియన్ టన్నులు మోనజైట్‌లో, 1.29 మిలియన్ టన్నులు గుజరాత్, రాజస్తాన్‌లోని హార్డ్ రాక్ డిపాజిట్లలో ఉన్నాయి. దేశంలోని తీర ప్రాంతాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, కేరళ, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్ మొదలైన రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ ఖనిజాలు ఉన్నాయి. జాతీయ శాస్త్రీయ సంస్థలు నూతనమైన వెలికితీత, శుద్ధీకరణ పనుల్లో ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఇవి ప్రపంచవ్యాప్తంగా అరుదుగా కనిపిస్తున్నా. ముఖ్యంగా ఉత్పత్తి, శుద్ధీకరణ ఖర్చులు ఎక్కువ. భారత ఖనిజాల్లో లైట్ రేర్ ఎర్త్ అంటే ’ఎల్‌ఐఆర్’ ఇక్స్‌ట్రాక్టేబుల్‌గా ఉండగా, హెవీ రేర్ ఎర్త్ ’హెచ్‌ఐఆర్’ కావలసినంతగా లభ్యం కావు. తీర ప్రాంతాల్లోని మోనజైట్ ఇసుకల్లో వీటి కొంత భాగం ఉంటుంది. అయినప్పటికీ, భారత్ రిఫైనింగ్, మధ్యవర్తి ఉత్పత్తుల తయారీ వంటి లోతైన వ్యవస్థలు అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.
భారత్ ముందు ఉన్న సమస్యలు
భారత్‌లో మైనింగ్, రిఫైనింగ్, అలాయ్ తయారీ, మెగ్నెట్ ప్రాసెసింగ్ రంగాలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఇటీవల చైనా దిగుమతి నియంత్రణలు, తీర ప్రాంత నిబంధనలు, అధునాతన యంత్రాలు లేని సమస్యలు భారత్ ప్లాన్‌లను దెబ్బతీశాయ్. కొత్తగా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ప్రైవేట్ పార్టనర్‌షిప్, కజకిస్థాన్‌తో ఒప్పందాలు వంటి చర్యలు భారతానికి డ్రైవ్‌ని ఇస్తున్నాయి.
చైనా అల్టిమేట్ డామినేషన్..
చైనా 49% రిజర్వ్, 69% మైనింగ్, 90% రిఫైనింగ్‌లో ఆధిపత్యం చూపుతోంది. అమెరికా, యూరప్, జపాన్, భారత్ రికవరీ యత్నాలు ప్రారంభించాయి. భారత్‌లో నిల్వలు విస్తృతంగా ఉన్నా, ఉత్పత్తి–శుద్ధీకరణ–మెగ్నెట్ తయారీకి సమయం పడుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, సాంకేతిక చర్యలు, ప్రైవేట్–పబ్లిక్ భాగస్వామ్యాలతో పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. త్వరగా ఉత్పత్తి ప్రారంభిస్తే భారత్ రేర్ ఎర్త్ రంగంలో పూర్తిగా ఆధిపత్యం సాధించకపోయినా కీలక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది.