CP Sajjanar suspends SI: చేనుకు రక్షణగా కంచె ఉండాలి. కానీ కంచె చేనును వేయకూడదు. అలాంటి పని ఈ ఎస్ఐ చేశాడు. సమాజానికి కంటగింపుగా మారిన వ్యక్తిని కాపాడాడు. మోసాలు చేసి వేల కోట్లు సంపాదించిన వ్యక్తిని వదిలిపెట్టి.. ఖాకీ చుక్కకూ ఉన్న మర్యాదను నాశనం చేశాడు. సమాజంలో పోలీసులకు ఉన్న గౌరవాన్ని పోగొట్టాడు. కానీ చివరికి ఆ ఖాకీ దొరికిపోయాడు. అయితే ఈ వ్యవహారంలో అనేక మలుపులు చోటుచేసుకున్నాయి. ఇంతకీ ఆ దొంగ ఖాకీ ఎలా దొరికాడంటే..
ఓ వ్యక్తి దాదాపు 3,000 కోట్ల ఆర్థిక నేరానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళిపోయాడు. ఈ క్రమంలో అతడిని హైదరాబాద్ తీసుకురావడానికి పోలీసులు టాస్క్ ఫోర్స్ బృందాన్ని ముంబై పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ బృందంలో ఉన్న ఎస్ఐ శ్రీకాంత్ ఆలోచన మరో విధంగా మారింది. ఏకంగా దొంగకు సద్దికూడు మాయడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు అతని ద్వారా డబ్బులు తీసుకొని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశాడు.
వాస్తవానికి ఆ నేరస్థుడిని ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకుని వస్తుండగా శ్రీకాంత్ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడ్డాడు. ఆ ఆర్థిక నేరగాడితో రెండు కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాదు అతడిని ముంబై తీసుకొస్తుండగా శ్రీకాంత్ వదిలేసాడు.
రెండు కోట్లను శ్రీకాంత్ పై అధికారులకు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీకాంత్ తో పాటు అధికారుల పాత్ర పై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపారు. తుది నివేదికను సిపి సజ్జనార్ కు అందజేయడంతో.. ఆయన సదరు ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. అతడిని సస్పెండ్ చేయడంతో పాటు.. అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆ ఆర్థిక నేరగాడిని హైదరాబాద్ తీసుకొస్తుండగా ఎస్ఐ శ్రీకాంత్ పోలీసులను ఏ మార్చాడు. తాను మాత్రం నిందితుడితో వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాడు. మిగతా పోలీసులను వేరే వాహనంలో పంపించాడు. రెండు వాహనాలకు దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాడు. వస్తుండగానే ఆర్థిక నేరగాడు కుటుంబ సభ్యులకు ఎస్ఐ ఫోన్ చేశాడు.
ఓ హోటల్ వద్దకు వచ్చి రెండు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఆర్థిక నేరగాడి కుటుంబ సభ్యులు హోటల్ వద్దకు వచ్చి రెండు కోట్లు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత నిందితుడిని ఎస్ఐ వదిలిపెట్టాడు. అంతేకాదు తాను హోటల్ వద్ద వాహనం ఆపినప్పుడు అతడు పారిపోయాడని ఉన్నతాధికారులకు చెప్పాడు. ఈ విషయం డిపార్ట్మెంట్ అధికారులకు అనుమానంగా అనిపించడంతో ఎంక్వయిరీ మొదలుపెట్టారు. అన్ని విధాలుగా పరిశీలించి ఆర్థిక నేరగాడి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు తీసుకొని వదిలేసాడని నిర్ధారణకు వచ్చారు. శ్రీకాంత్ 2020 బ్యాచుకు చెందిన అధికారి. అయితే అతడు కొంతకాలంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
రూ.3 వేల కోట్ల ఆర్థిక నేరం చేసిన నిందితుడిని రూ.2 కోట్లు తీసుకొని వదిలేసిన టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ శ్రీకాంత్‌పై సస్పెండ్
శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సీపీ సజ్జనార్
ఆర్థిక నేరస్తుడిని ముంబయిలో అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా, రూ.2 కోట్ల డీల్… https://t.co/uvMpkFMLsZ pic.twitter.com/D4Cr3lq4GY
— Telugu Scribe (@TeluguScribe) October 31, 2025