Huzurabad Bypoll: హుజూరాబాద్ ఎన్నిక చరిత్రలో నిలిచిపోనుందా?

Huzurabad Bypoll: హుజురాబాద్ (Huzurabad)లో నిధుల వరద కొనసాగుతోంది. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించాలని తాపత్రయ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో దళితబంధు (Dalit Bandhu) పథకంతో హుజురాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని తన ప్రభావాన్ని చూపెడుతోంది. దీనికి గాను దాదాపు రూ.2 వేల కోట్లు కేటాయించి తన మార్కును చాటాలని భావిస్తోంది. ఇదే తరుణంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం అంతే తీరుగా సమాధానం […]

Written By: Srinivas, Updated On : September 1, 2021 10:00 am
Follow us on

Huzurabad Bypoll: హుజురాబాద్ (Huzurabad)లో నిధుల వరద కొనసాగుతోంది. పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం సాధించాలని తాపత్రయ పడుతున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ (TRS) సర్వశక్తులు ఒడ్డుతోంది. ఈ నేపథ్యంలో దళితబంధు (Dalit Bandhu) పథకంతో హుజురాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని తన ప్రభావాన్ని చూపెడుతోంది. దీనికి గాను దాదాపు రూ.2 వేల కోట్లు కేటాయించి తన మార్కును చాటాలని భావిస్తోంది. ఇదే తరుణంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సైతం అంతే తీరుగా సమాధానం చెప్పాలని చూస్తున్నా ఆయన సొంతంగానే ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి పైసా కూడా ఈటలకు అందకపోవడంతో ఆయన ఆపసోపాలు పడుతున్నారు. ఎన్నికల్లో గట్టెక్కాలంటే డబ్బులు అవసరం ఖచ్చితమే అని తెలిసినా తన దగ్గర లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ ఇప్పటికి అనధికారికంగా రూ.500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్ లీగా చరిత్రలో మిగిలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీల్లో ఎక్కడ లేని విధంగా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో విజయం సాధించడమే తమ లక్ష్యంగా చూస్తున్నాయి. ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు కానీ విజయమే ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో పార్టీల్లో డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. ఇంకా రాబోయే రోజుల్లో డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేస్తారనే విషయం అందరికి తెలుస్తుంది.

ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకంజలో ఉంది. పార్టీ ఏడేళ్లుగా అధికారానికి దూరంగా ఉండడంతో నిధుల సమస్య తలెత్తుతోంది. దీంతో ఇప్పటి నుంచే పోటీలో ఉంటే ఖర్చు పెరిగిపోతుందని భావించే నోటిఫికేషన్ వచ్చే వరకు ఎదురుచూస్తుందని తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా కొండా సురేఖ పేరును ఖరారు చేసినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో రెండు పార్టీల్లో దూకుడు పెరిగినా కాంగ్రెస్ లో మాత్రం జోష్ కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో పార్టీల్లో ప్రచారం జోరుగానే సాగుతోంది. దీటుగా బీజేపీ, టీఆర్ఎస్ దూసుకుపోతున్నాయి. ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయాయి. ఇందులో భాగంగానే అధికార పార్టీ దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తున్నా సానుభూతితోనే ఓట్లు సాధించాలని బీజేపీ కూడా ఆలోచిస్తోంది. దీంతో నియోజకవర్గంలో రెండు పార్టీలు సమ ఉజ్జీలుగా నిలుస్తున్నాయి. పోటీ కూడా రెండు పార్టీల్లోనే కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే అని చెబుతున్నారు.