Etela Rajender: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. సమీకరణల్లో మార్పులొస్తున్నాయి. హుజురాబాద్ లో ఈటల రాజేందర్ గెలుపుతో టీఆర్ఎస్ పార్టీ ఆలోచనలో పడింది. అంచనాలు తలకిందులు కావడంతో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీ ప్రతిష్ట మాత్రం పెరిగింది. కేసీఆర్ ను ఢీకొనే నేతగా ఈటలకు గుర్తింపు దక్కింది. అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయినా విజయం మాత్రం దక్కకుండా చేయడంలో ఈటల తీరును అందరు ప్రశంసిస్తున్నారు. కేసీఆర్ కు తగిన అభ్యర్థి ఈటలనే అని వేనోళ్ల పొగుడుతున్నారు.

ఈ నేపథ్యంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే ఆలోచనలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ కే ముచ్చెమటలు పట్టించిన నేతగా ఈటల ప్రస్థానంపై అందరి దృష్టి పడుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈటలను ఎంచుకునే వీలుందని ఓ వాదన వినిపిస్తోంది. బీజేపీకి దొరికిన ఆణిముత్యంలా ఈటలను అన్ని విధాలుగా ఉపయోగించుకుని టీఆర్ఎస్ పార్టీని మట్టి కరిపించాలని బీజేపీ అధిష్టానం చూస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఈటలను బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునేందుకు సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. గతంలో కూడా టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఈటలకు బీజేపీ శాసనసభా పక్ష నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ప్రజలన్నీ చూస్తూ ఉంటారు.. సమయమొచ్చినప్పుడే చెప్తారు..
ఈటల రాజేందర్ తో అన్ని పార్టీల నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ను ఢీకొనే సత్తా ఈటలకు ఉన్నట్లు ప్రత్యక్షంగా తెలియడంతో ఇక బీజేపీ ఈటల వైపు మొగ్గు చూపుతోంది. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవంతో రాజకీయ విలువలు కలిగిన నేతగా ఈటల బీజేపీ ఆశల తీర్చే వ్యక్తిగా భావిస్తున్నారు. ఈటల తో బీజేపీకి లాభమే తప్ప నష్టం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: BJP In Telangana : తెలంగాణలో బీజేపీ అతివిశ్వాసం కొంప ముంచుతుందా?