జెండా ఎత్తేసుడేనా? బాబు ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

తెలుగు వాడి ఆత్మగౌరవం.. తెలుగువాడి పౌరుషం నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారకరామరావు గారు పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు.  40 ఏళ్ల చరిత్ర.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన గొప్ప తెలుగు పార్టీ ఇదీ.. ఇన్నేళ్ల పార్లమెంట్ చరిత్రలో పార్లమెంట్ లో ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే. అలాంటి పార్టీ ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు […]

Written By: NARESH, Updated On : April 4, 2021 2:21 pm
Follow us on

తెలుగు వాడి ఆత్మగౌరవం.. తెలుగువాడి పౌరుషం నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న నందమూరి తారకరామరావు గారు పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చారు.  40 ఏళ్ల చరిత్ర.. నాలుగు సార్లు అధికారంలోకి వచ్చిన గొప్ప తెలుగు పార్టీ ఇదీ.. ఇన్నేళ్ల పార్లమెంట్ చరిత్రలో పార్లమెంట్ లో ప్రతిపక్షంగా పనిచేసిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే.

అలాంటి పార్టీ ఈరోజు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించడం అంటే అంతకంటే అవమానం మరొకటి లేదంటున్నారు.  ఇది చంద్రబాబు సిగ్గుచేటు అంటున్నారు. అంత గొప్ప పార్టీ పోటీచేసేందుకు భయపడడం చూస్తుంటే పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆత్మ క్షోభించదా? అని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిని కూడా గెలుపునకు సోపనంగా మలుచుకుంటేనే రాజకీయాల్లో నిలబడగలం.. ఓటమియే గెలుపునకు నాంది అవుతుంది. ఆ పార్టీలే రాజకీయాల్లో రాణిస్తుంటారు. ఓడిపోతామని తెలిసినా పోరాడడం అనేది రాజకీయ నాయకులు ప్రధాన లక్షణం.

ముఖ్యంగా బీజేపీ, కమ్యూనిస్టులను చూసి నేర్చుకోవాలి ఇలాంటివి. వాళ్లెప్పుడూ మేం అధికారంలోకి వస్తాం.. గెలుస్తామనే నమ్మకంతో ఎప్పుడూ పోటీచేయరు. పోటీచేయడమన్నది ఒక పోరాటంగా ఆ రెండు పార్టీలు భావిస్తాయి. అది పార్టీలు, రాజకీయాల లక్షణం..

ఇన్నేళ్ల 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో తెలుగుదేశం పార్టీకి ఎన్నికలను బహిష్కరించిన చరిత్ర లేదు. అది ఎన్టీఆర్ టైంలోనైనా.. చంద్రబాబు సమయంలోనైనా ఇప్పటివరకు జరగలేదు.

కానీ ఇప్పుడు ఎంపీటీసీ, జడ్జీటీసీ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే.. జగన్ పార్టీతో పోటీపడి మనం గెలవలేము.. ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ లను దక్కించుకోలేము. ఇప్పటికే పంచాయతీ, మున్సిపోల్స్ లో దూల తీరిపోయింది. వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పరువు పోగొట్టుకోవడం ఇష్టం లేకనే చంద్రబాబు ఈ నిర్ణయం తసీుకున్నట్టు కనిపిస్తోంది.

కానీ ఇది సరైన పద్ధతి కాదు.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ ఎన్నికల్లో పోటీచేయకపోవడం వల్ల ఆ పార్టీనే నమ్ముకున్న కేడర్ కు ఎలాంటి సంకేతాలు ఇచ్చినట్టు? మనం వైసీపీతో పోటీపడలేం.. మన గెలవలేం అని సంకేతాలు ఇచ్చినట్టా అన్నది చంద్రబాబు ఆలోచించుకోవాలి. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఉన్న హుషారును పూర్తిగా నీరుగార్చడం తప్పితే ఇంకొకటి లేదు.

ఎన్నికలు అంటే పోటీచేయడం.. అభ్యర్థులను నిలబెట్టడం.. పోరాడడం చేస్తేనే ప్రజల్లో గుర్తింపు.. సానుభూతి ఉంటుంది. ప్రజలు గెలిపించాలా? లేదా అన్నది వాళ్ల విజ్ఞత. కానీ పోరాడేవాడికే వాళ్లు పట్టం కడుతారు. పోరాడకుండా అస్త్రసన్యాసం చేసే వారిని నమ్మి ఓటు వేయరు కదా.. 2014లో ఓడిన జగన్ ను ప్రజల్లో తిరిగితే 151 సీట్లు ఇచ్చి గెలిపించలేదా? ఆయన ఓటేయలేదని ఊరుకుంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చేవాడా? అన్నది చంద్రబాబు ఆలోచించుకోవాలి. ఇలా పోటీచేయకపోతే టీడీపీ కేడర్ అంతా పోయి వైసీపీలో చేరి పోటీచేస్తే ఇక టీడీపీ ఉంటుందా? కేడర్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? చూస్తుంటే చంద్రబాబు జెండా ఎత్తేసేలానే ఉన్నాడని సెటైర్లు పడుతున్నాయి.