spot_img
Homeజాతీయ వార్తలుBJP Strategy To Attract Farmers: తెలంగాణ‌లో రైతుల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ వ్యూహం ఫ‌లిస్తుందా?

BJP Strategy To Attract Farmers: తెలంగాణ‌లో రైతుల‌ను ఆక‌ట్టుకునేందుకు బీజేపీ వ్యూహం ఫ‌లిస్తుందా?

BJP Strategy To Attract Farmers: తెలంగాణ‌లో బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఇందులో భాగంగానే రెండు పార్టీల్లో విభేదాలు ముదిరాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయితే బీజేపీని టార్గెట్ చేసుకుని కేంద్రంలో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నారు. ఇందుకు గాను త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ప‌శ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల సీఎంల‌ను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ప్ర‌జాఫ్రంట్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి అప్పుడే కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక త‌యారు చేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ప‌లువురిని క‌లుస్తూ త‌మ ఉద్దేశాలు వివ‌రిస్తూ దేశాన్ని ర‌క్షించాల‌ని పిలుపునిస్తున్నారు. దేశ స‌మ‌గ్ర‌త‌కు ముప్పు వాటిల్లిన‌ప్పుడు చూస్తూ ఊరుకోబోమ‌ని అడ్డుకుంటామ‌ని ఉప‌న్యాసాలు ఇస్తున్నారు.

BJP
BJP

దీంతో కేసీఆర్ పాత్ర‌పై అంద‌రికి అనుమానాలున్నా ఆయ‌న మాత్రం వెన‌క్కి త‌గ్గేదేలే అంటూ క‌య్యానికి కాలు దువ్వుతున్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దింపాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెబుతున్నారు. కానీ కేసీఆర్ కు వీరంతా క‌లిసి వ‌స్తారా అనేదే ప్ర‌శ్న. గ‌తంలో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు కూడా జాతీయ రాజ‌కీయాల్లో వేలు పెట్టి కాల్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వంతు అని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

BJP Strategy To Attract Farmers
Telangana CM KCR

అయినా కేసీఆర్ మాత్రం మొక్క‌వోని ధైర్యంతో ముందుకు వెళ్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక త‌రువాత టీఆర్ఎస్ వ్యూహం పూర్తిగా మారిపోయింది. బీజేపీని రాష్ట్రంలో ఎదురు లేకుండా చేసుకోవాల‌నే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ కుట్ర‌లు చేస్తుంద‌ని చెబుతున్నారు దీంతో టీఆర్ఎస్ కు చెక్ పెట్టాల‌ని బీజేపీ కూడా యోచిస్తోంది.

BJP Strategy To Attract Farmers
BJP Strategy To Attract Farmers

Also Read: పెండింగ్ చ‌లాన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎగ‌బ‌డుతున్న జ‌నాలు.. నిముషానికి 1000 క్లియ‌ర్‌

తెలంగాణ‌లో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నా ప్ర‌స్తుతం కౌలు రైతుల స‌మ‌స్య‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. రాష్ట్రంలో రైతుల‌కు రైతుబందు, రైతు బీమా ఇస్తున్న ప్ర‌భుత్వం కౌలు రైతుల ప్ర‌యోజ‌నం కోసం ఏం చేస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వం ఇరుకున ప‌డుతుంద‌ని తెలుస్తోంది. ఇదే నినాదంతో ముందుకు వెళ్లి టీఆర్ఎస్ కు సైతం ఓటు బ్యాంకును దూరం చేయాల‌ని ప్లాన్ వేస్తోంది.

దీంతో తెలంగాణ‌లో రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతోంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మ‌ధ్య పోరు పెరుగుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ఇదే వ్యూహంతో బీజేపీ టీఆర్ఎస్ ను డైల‌మాలో ప‌డేసి ఓట్లు సాధించాల‌ని ఆశిస్తోంది. ఇందుకు గాను ప‌టిష్ట ప్ర‌ణాళిక త‌యారు చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Also Read: అత్యంత వేడిగాలులు.. భారీ వరదలు.. హైదరాబాద్ కు ఇది హెచ్చరికే!

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper