https://oktelugu.com/

India TV survey : తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడం సాధ్యమా? బీజేపీ గెలుస్తుందా?

India TV survey : దేశంలో రెండు సార్లు అధికారం దక్కినా కూడా మోడీపై ప్రజల్లో ఆశ చావలేదని తేలింది. ద్రవ్యోల్బణం పెరిగినా.. ధరలతో చావబాదతున్నా.. నిరుద్యోగం రేటు పెరిగినా కూడా ప్రత్యామ్మాయం లేకపోవడం.. మోడీ పాలనపై వ్యతిరేకత రాకపోవడంతో ఆయనే మరోసారి ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ బీజేపీకే అధికారం ఇస్తామని తాజాగా ‘ఇండియా టీవీ’ సర్వేలో జనాలు తేల్చారు. బీజేపీకి ఫేవర్ గా ఉండే ఇండియా టీవీ చానెల్ విశ్వసనీయతను […]

Written By:
  • NARESH
  • , Updated On : July 30, 2022 11:25 pm
    Follow us on

    India TV survey : దేశంలో రెండు సార్లు అధికారం దక్కినా కూడా మోడీపై ప్రజల్లో ఆశ చావలేదని తేలింది. ద్రవ్యోల్బణం పెరిగినా.. ధరలతో చావబాదతున్నా.. నిరుద్యోగం రేటు పెరిగినా కూడా ప్రత్యామ్మాయం లేకపోవడం.. మోడీ పాలనపై వ్యతిరేకత రాకపోవడంతో ఆయనే మరోసారి ప్రధాని కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ బీజేపీకే అధికారం ఇస్తామని తాజాగా ‘ఇండియా టీవీ’ సర్వేలో జనాలు తేల్చారు. బీజేపీకి ఫేవర్ గా ఉండే ఇండియా టీవీ చానెల్ విశ్వసనీయతను విపక్షాలు కొట్టిపారేస్తున్నా కానీ ఆ చానెల్ చేసిన సర్వే మాత్రం నిక్కచ్చిగానే చేసినట్టు తెలుస్తోంది.

    ఇండియా టీవీ-మ్యాట్రిజ్ ఒపీనియన్ పోల్ ‘దేశ్ కి ఆవాజ్’ పేరిట జూలై 11 నుండి 24 వరకు దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించాయి. ఈ చానెల్ భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో 136 ఎంపీ సీట్ల పరిధిలో 34,000 మంది క్రియాశీల ప్రజల నమూనాలు సేకరించారు. వీరిలో 19,830 మంది పురుషులు, 14,170 మంది మహిళలు ఉన్నారు. దీంతో కాస్తో కూస్తో సర్వేపై నమ్మకం పెరుగుతోంది.

    సర్వే ప్రకారం.. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు గాను 362 స్థానాల్లో భారీ మెజారిటీతో విజయం సాధించగలదని తేల్చింది. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA)  97 లోక్ సభ సీట్లు మాత్రమే గెలుస్తుందని అంచనా వేయబడింది. చిన్న, ప్రాంతీయ పార్టీలు మరియు స్వతంత్రులతో సహా ‘ఇతరులు’ 84 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది.  ఎన్డీయేకు 41 శాతం, యూపీఏకు 28 శాతం, ఇతరులకు 31 శాతం ఓట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది.

    -తెలంగాణలో టీఆర్ఎస్ కు షాక్ లగా?
    ఇండియా టీవీ సర్వే కేవలం లోక్ సభ సీట్లను మాత్రమే ప్రాతిపదికగా చేసుకొని సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఇందులో తెలంగాణలో చూసుకుంటే టీఆర్ఎస్ కు 8 ఎంపీ సీట్లు వస్తాయని తేల్చింది. ఇక బీజేపీకి 6, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 సీట్లు వస్తాయని సర్వేలో పేర్కొంది. ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే ఓట్ల శాతం వచ్చేసరికి బీజేపీకి అనూహ్యంగా ఓటు బ్యాంకు పెరిగింది. ఇదే టీఆర్ఎస్ కొంప ముంచేలా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ స్థాయిలో వస్తే.. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో ఇలానే కంటిన్యూ అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని తెలుస్తోంది.

    తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాజా సర్వేలో టీఆర్ఎస్ కు 34 శాతం ఓట్లు వస్తాయని సర్వే తేల్చింది. 2019లో ఇదే టీఆర్ఎస్ కు ఏకంగా 42 శాతం ఓటు బ్యాంకు వచ్చింది. అంటే అప్పటికి.. ఇప్పటికి 8శాతం ఓట్లను టీఆర్ఎస్ కోల్పోయింది.

    ఇక బీజేపీ 2019లో కేవలం 20శాతం ఓటు బ్యాంకు మాత్రమే తెచ్చుకుంది. కానీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే బీజేపీ ఓటు శాతం 39 శాతానికి పెరుగుతుందని సర్వే తేల్చింది.

    ఇక కాంగ్రెస్ పరిస్థితి రేవంత్ రెడ్డి పీసీసీ అయినా కూడా మార్పు రాలేదని తేలింది. 2019లో కాంగ్రెస్ కు 30శాతం ఓటు బ్యాంకు రాగా.. ఇప్పుడు 14శాతానికి పడిపోయింది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, టీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి యాడ్ అవుతోంది.

    అంటే తెలంగాణ రాజకీయాల్లో కనుక ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ ఓటు బ్యాంకు 39 శాతం, టీఆర్ఎస్ ఓటు బ్యాంకు 34 శాతం, కాంగ్రెస్ కు 14 శాతం ఓట్లు వస్తాయి. ఈ లెక్కన టీఆర్ఎస్ ఓడిపోయి బీజేపీకి అధికారం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

    -కేసీఆర్ పై వ్యతిరేకత నిజం

    తెలంగాణలో రెండు సార్లు గెలిచిన వ్యతిరేకత టీఆర్ఎస్ సర్కార్ పై బోలెడంత ఉంది. కేసీఆర్ అంటేనే జనంలో, వివిధ వర్గాల్లో ఒకింత ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఆ వ్యతిరేకతనే హుజూరాబాద్, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కనిపించింది. కేసీఆర్ వల్ల తెలంగాణ ధనిక రాష్ట్రం అప్పులపాలైంది. 15వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనర్లకు జీతాలు పడడం లేదు. వృద్ధాప్య సహా ఇతర పింఛన్లు అన్నీ లేట్ అయిపోతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగి జనం మొత్తుకుంటున్నారు. సంక్షేమ పథకాలు ప్రకటించకపోగా ఉన్నరేట్లను పెంచిన కేసీఆర్ ను ఎప్పుడు ఓడిద్దామా? అని జనం కాచుకుకూర్చున్నారు. కానీ ఏదో ఒక సెంటిమెంట్ బయటకు తీసి జనాలు మూడ్ డైవర్ట్ చేసి సానుభూతి పొంది గెలవడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. 2014, 2018లో అలాగే ‘తెలంగాణ సెంటిమెంట్ రాజేసి గెలిచాడు. ఈసారి పీకే తో కలిసి ఎలాంటి ప్రయోగం చేస్తాడన్నది ఆసక్తి రేపుతోంది.అందుకే కేీసీఆర్ ను అంత ఈజీగా లైట్ తీసుకోవడం కష్టమేనని అంటున్నారు.

    ఈ క్రమంలోనే ఇండియా టీవీ సర్వేలోనూ అదే ప్రస్ఫూటించింది. తెలంగాణలో  బీజేపీ ఓటు శాతం ఏకంగా 39 శాతానికి చేరుకొని అత్యధిక ఎమ్మెల్యే సీట్లు సాధించి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ 34 శాతం ఓట్లతో ఓడిపోతుందని తెలుస్తోంది.

    అయితే పార్లమెంట్ ఎన్నికల సర్వేకు.. అసెంబ్లీ ఎన్నికల సర్వేకు చాలా తేడా ఉంటుంది. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి మోడీ మేనియాను తప్పించుకొని కేవలం రాష్ట్ర ప్రతిపాదికన ఓట్లు అడగడంతో ఈజీగా గెలిచేశాడు. అదే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ దెబ్బ పడి బీజేపీకి, కాంగ్రెస్ కు జనాలు ఎంపీ సీట్లు ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 1 అసెంబ్లీ సీటు (రాజాసింగ్) మాత్రమే గెలిచాడు. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా హేమాహేమీలందరూ టీఆర్ఎస్ ధాటికి ఓడిపోయారు. అదే పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా కిషన్ రెడ్డి సహా 4 ఎంపీ సీట్లను బీజేపీ గెలిచేసింది. కాంగ్రెస్ కూడా 3 ఎంపీ సీట్లు గెలిచింది.

    -కేసీఆర్ ను ఓడించడం అంత ఈజీ అయితే కాదు..

    ఇక 2018లో 89 అసెంబ్లీ సీట్లు సాధించిన టీఆర్ఎస్ కు పార్లమెంట్ సీట్లలో భారీగా కోతపడింది. దీన్ని బట్టి పార్లమెంట్ ఎన్నికల మూడ్ కు.. అసెంబ్లీ ఎన్నికల మూడ్ కు ప్రజలు డిఫెరెంట్ గా స్పందిస్తారు. సో ఇండియా టీవీ సర్వే ప్రకారం.. ఎంపీ ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీజేపీకి ఎంపీ సీట్లు ఎక్కువ రావచ్చు. కానీ ఇదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మాత్రం ఈ లెక్క మారవచ్చు. కేసీఆర్ తో బీజేపీ టఫ్ ఫైట్ కొనసాగవచ్చు. సో తెలంగాణలో ఇండియా టీవీ సర్వేను నిశితంగా గమనిస్తే బీజేపీకి ఎడ్జ్ ఉన్నా కూడా కేసీఆర్ ను అంత ఈజీగా ఓడగొట్టడం మాత్రం కొంచెం కష్టమే అని చెప్పొచ్చు.