
Vidadala Rajini: ఆమె హావభావాలు పలికించడంలో దిట్ట. అధినేతను అనుకరించడంలో తనకు తానే సాటి. సోషల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు. రాజకీయాల్లో అనతికాలంలోనే అంచలంచెలుగా ఎదిగింది. సీనియర్లను మించిన స్థానం ఆమెకు దక్కింది. ఇప్పుడు సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షంచుకోబోతోంది. సినిమాల్లో ఎంట్రీ ఇస్తోందన్న వార్తలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరు ? ఆ కథేంటో తెలుసుకోండి.
ఏపీ మంత్రి విడుదల రజినీ తెలియని వారు ఎవరూ ఉండరు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నవారికి ఆమె పరిచయం అక్కరలేని పేరు. 2014లో రాజకీయల్లోకి ఎంట్రీ ఇచ్చి.. 2019లో ఏకంగా మంత్రి పదవి కొట్టేసింది. అనతికాలంలోనే సీనియర్లను కాదని ఆమెను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి. జగన్ హావభావాలను అనుకరించడంలో ఆమెకు మంచి పట్టు ఉంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. జగన్ లా చేయి ఊపుతూ… నమస్కరిస్తూ.. నవ్వుతూ పలకరించడంలో జగన్ తర్వాత విడుదల రజినీనే అన్నట్టు ఆమె శైలి ఉంటుంది.
విడుదల రజనీ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారడానికి ఆమె ఎత్తబోతున్న కొత్త అవతారమే కారణం. ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న విడుదల రజినీ.. ఇప్పుడు సినీరంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి… సినిమాలు నిర్మించనుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా చర్చల కోసం ఇప్పటికే హైదరాబాద్ లో ఓ ఆఫీస్ కూడా తెరచినట్టు తెలుస్తోంది. రజినీ తీయబోయే సినిమాలో హీరో, హీరోయిన్ ఎవరు ? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం కథా చర్చల్లో నిమగ్నమైనట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.

విడుదల రజినీ అంటేనే సోషల్ మీడియాలో బజ్ ఉంటుంది. ఇప్పుడు సినిమాఎంట్రీ అనగానే ఆమె పై ఫోకస్ మరింత పెరిగింది. ఎలాంటి సినిమా తీయబోతున్నారు ? ఎవరితో తీయబోతున్నారు ? లాంటి ప్రశ్నలతో సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. మంత్రిగా బిజీగా ఉన్న రజినీ డైరెక్టుగా రంగంలోకి దిగుతారా ? ఇంకెవరినైనా ముందు ఉంచి నడిపిస్తారా ? అన్న చర్చ జరుగుతోంది. సినిమాల్లోని వారు రాజకీయాల్లోకి రావడం చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు సినిమా రంగంలోకి అడుగుపెట్టడం కొత్త ట్రెండ్ అని చెప్పవచ్చు. వ్యాపార ఉద్దేశంతోనో, సినిమాల పై ఉన్న ఆసక్తితోనో సినీరంగంలోకి రాజకీయ నాయకులు అరంగేట్రం చేస్తున్నారని చెప్పవచ్చు.
