AP Employees: ఏపీ ఉద్యోగులకు జీతాల తిప్పలు? .. ఈనెల వేతనాలు అందుతాయా?

AP Employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంపై కోపంతో ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో ప్రజా పనులు గాడిన పడటం లేదు. ఫలితంగా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాలు ఇచ్చే స్థాయిలో కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక నాలుగు రోజుల్లో వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ సారి ఉద్యోగుల […]

Written By: Srinivas, Updated On : January 27, 2022 6:21 pm
Follow us on

AP Employees: ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంపై కోపంతో ఉద్యోగులు విధులకు హాజరు కావడం లేదు. దీంతో ప్రజా పనులు గాడిన పడటం లేదు. ఫలితంగా వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా మారుతోంది. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వేతనాలు ఇచ్చే స్థాయిలో కూడా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక నాలుగు రోజుల్లో వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఈ సారి ఉద్యోగుల జీతాలు చెల్లింపు లేనట్లే అని స్పష్టమవుతోంది.

AP Employees Salaries

మరో నాలుగు రోజుల్లో ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు పడాల్సి ఉన్నా ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ మాత్రం చేపట్టడం లేదు. దీంతో ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై అనుమానాలు వస్తున్నాయి. సహజంగానే మొండికేసే ప్రభుత్వం ఈసారి సమ్మె చేస్తే జీతాలు ఇస్తుందా అనే వాదన సైతం వినిపిస్తోంది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.

Also Read: ఏపీ ఉద్యోగుల్లో టెన్షన్.. వేతనాలు సమయానికి అందుతాయా?

ఒకవేళ ప్రభుత్వం జీతాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. కానీ ఉద్యోగుల సమ్మెతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో జీతాలు ఆలస్యం చేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు సమ్మె రూపంలో మరో ఆయుధం లభించినట్లయింది. దీంతో వేతనాల చెల్లింపు ప్రక్రియ చేపట్టడం లేదు. ఫలితంగా ఉద్యోగులు వారి జీతాల కోసం ఎదురుచూపులే కనిపిస్తున్నాయి.

ఇక ఈసారి మాత్రం వేతనాలు చెల్లింపుపై స్పష్టమైన ప్రకటన మాత్రం కానరావడం లేదు. గతంలోనే కరోనా కాలంలో నిలిపివేసిన వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో ఈ సారి సమ్మె చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు వస్తాయో రావో అనే ఆందోళన అందరిలో వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో ఏపీలో ఉద్యోగుల్లో జీతాల గుబులు రేగుతోంది. ఎలాగైనా ప్రభుత్వం చెల్లిస్తుందో లేక వాయిదా వేస్తుందో అనే మీమాంసలో ఉద్యోగులు పడిపోయారు.

Also Read: టికెట్ల వివాదం ముగిసేనా.. వచ్చే నెల 10న ధరలపై క్లారిటీ..!

Tags