https://oktelugu.com/

Kejriwal: ఆమ్ ఆద్మీ పార్టీ ఇక జాతీయపార్టీ అవుతుందా? మోడీకి కేజ్రీవాల్ పోటీనిస్తాడా?

Kejriwal: బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కేవలం కలలుగన్నారు. జాతీయస్థాయి నేతగా ఎదగాలని.. ప్రధాని పీఠం అధిరోహించాలని ఆశపడ్డారు.కానీ ‘సామాన్యుడు’ అయిన కేజ్రీవాల్ అలాంటి ఆశలేవీ పెట్టుకోలేదు. కేవలం మంచి సుపరిపాలన.. ప్రజలకు సంక్షేమం పంచిపెట్టారు. ఢిల్లీలో పాలనతో ప్రజల మనసు గెలిచారు. పక్కనే ఉన్న పంజాబీలను ఆకట్టుకొని గెలిచారు. ఇక గోవా సహా పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించి ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు. సామాన్యుడికి ప్రతీక అయిన కేజ్రీవాల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 10, 2022 3:26 pm
    Follow us on

    Kejriwal: బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కేవలం కలలుగన్నారు. జాతీయస్థాయి నేతగా ఎదగాలని.. ప్రధాని పీఠం అధిరోహించాలని ఆశపడ్డారు.కానీ ‘సామాన్యుడు’ అయిన కేజ్రీవాల్ అలాంటి ఆశలేవీ పెట్టుకోలేదు. కేవలం మంచి సుపరిపాలన.. ప్రజలకు సంక్షేమం పంచిపెట్టారు. ఢిల్లీలో పాలనతో ప్రజల మనసు గెలిచారు. పక్కనే ఉన్న పంజాబీలను ఆకట్టుకొని గెలిచారు. ఇక గోవా సహా పలు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించి ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు.

    సామాన్యుడికి ప్రతీక అయిన కేజ్రీవాల్ ఎప్పుడూ సీఎం, పీఎం అవుతానని ఆశపడలేదు. తనకు రాజ్యాధికారం ఇచ్చిన ప్రజలకు సేవ చేశాడు. తన అభిమానులున్న రాష్ట్రాల్లోనూ పార్టీని పోటీచేయించి వారితో గెలిచాడు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్మాయంగా ఆమ్ ఆద్మీ పార్టీని ఇప్పుడు జాతీయ పార్టీగా మలిచాడు. కేజ్రీవాల్ సహజంగా ఇలా అనుకోలేదు.కానీ ప్రజలే ఆప్ పార్టీని ఓన్ చేసుకొని గెలిపించి కేజ్రీవాల్ ను జాతీయ స్థాయి నేతగా.. ప్రధాని మోడీకి ప్రత్యామ్మాయ రాజకీయ శక్తిగా వాళ్లకు వాళ్లే మలిచారు.

    మమతా బెనర్జీ, కేసీఆర్ లు కేవలం బీజేపీ ఓడిపోతే సంకీర్ణ రాజకీయాలు వస్తేనే పీఎం పీఠం ఆశించారు. అంతే తప్పా తమ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించాలని.. అక్కడ కూడా గెలిపించి జాతీయ పార్టీగా మారుద్దామని అనుకోలేదు. అయితే కేజ్రీవాల్ మాత్రం తనపార్టీని విస్తరించాడు. బలం ఉన్నచోటల్లా ఆప్ నేతలను దించాడు. ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు.ఇప్పుడు ఏకంగా పంజాబ్ లో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను చిత్తుచిత్తుగా ఓడించి అధికారం సంపాదించాడు.

    ఇక గోవాలో కూడా ఆప్ పార్టీ ఖాతా తెరిచింది. పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు దక్కించుకుంది.తెలుగు రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ శాఖలున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఆప్ ఉనికి ఉంది. ఇలా ఢిల్లీలో చిన్నగా మొదలైన ఆమ్ ఆద్మీ ప్రస్థానం.. ఇంతింతై.. వటుడింతై అన్న చందంగా విస్తరిస్తోంది. కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ లోనూ పాగా వేశాడు. పలురాష్టాల్లోనూ ఎమ్మెల్యే సీట్లు గెలిచాడు.

    కేజ్రీవాల్ గెలుపునకు ప్రధాన కారణం.. నీతిమంతమైన రాజకీయాలు.. అవినీతి లేని పాలన.. ప్రజలకు సంక్షేమ పథకాలు.. ఉచితంగా అందించడం కేజ్రీవాల్ ను దేశప్రజల దృష్టిలో హీరోగా నిలబెట్టాయి. ఉత్తరాధి, దక్షిణాది అన్న తేడా లేకుండా కేజ్రీవాల్ కు ఇప్పుడు క్రేజ్ వచ్చింది. దాన్ని నిలుపుకొని మోడీకి ప్రత్యామ్మాయంగా.. కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఒక జాతీయ పార్టీగా ‘ఆమ్ ఆద్మీ’ని నిలుపాల్సిన అవసరం ఉంది. మమతా బెనర్జీ, కేసీఆర్ చేయలేని పనిని సైలెంట్ గా కేజ్రీవాల్ చేసేశారు. దాంతో దేశ రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.