Wildlife Bridges: అడవులు తగ్గిపోతున్నాయి. కాలుష్యం పెరిగిపోతోంది.. అరుదైన జంతువులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అభివృద్ధి అనేది ఆగకూడదు.. ఒకవేళ అది ఆగితే మనుషుల మనుగడకు ప్రమాదం వాటిల్లుతుంది. అలా జరగకూడదు అనుకుంటే జంతువులను కాపాడాలి. అభివృద్ధి ఆగకూడదు. ఇవి చదివేందుకు ఈజీగా అనిపిస్తున్నా.. ఒకే అరలో ఉన్న కత్తుల లాంటివి. కానీ వీటిని భారత ప్రభుత్వం ఇమడేలా చేసింది. ప్రపంచానికి కొత్త పాఠాలు చెబుతోంది.

ఎక్స్ప్రెస్ హైవేలపై వంతెనలు, ఫ్లై ఓవర్లు
మహారాష్ట్రలో నాగపూర్, ముంబాయి మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం బాలా సాహెబ్ ఠాక్రే సమృద్ధి మహా మార్గ్ మొదటి దశ ఎక్స్ప్రెస్ హైవే ను ప్రారంభించారు. మనదేశంలో నిర్మించిన పూర్తిస్థాయి తొలి ఎక్కువ వంతన ఇది. రోడ్లపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వచ్చే వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా ఈ ఎక్స్ప్రెస్ వే మార్గం పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. కాదు దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించేందుకు తొమ్మిది గ్రీన్ వంతెనలు ఇవి ఫ్లై ఓవర్ తరహాలో ఉంటాయి. మరో 17 అండర్ పాసెస్ కూడా నిర్మించారు.

ఏమిటి ఈ వంతెనలు
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వన్యప్రాణుల రాకపోకలు సాగించేందుకు లక్ష్యంగా నిర్మించే వంతెనలను ఎకో వంతెనలు, వన్యప్రాణుల వంతెనలు అని పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే హైవేలపై వాహనాలకు అడ్డంగా పడి జంతువులు ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు కూడా ఈ వంతెనలు నిర్మిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో ఎకో వంతెనల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఎకో వంతెనలు మూడు రకాలు. చిన్న చిన్న పాలిచ్చే జంతువులను కాపాడేందుకు ఉద్దేశించిన కల్వర్టులు. వీటిని ఆంఫిబియన్ వంతెనలు అని పిలుస్తారు. ఇక రెండో రకం కానోపీ బ్రిడ్జెస్. కోతులు, ఉడతలు వంటి చెట్లపై నివసించే వాటిని రక్షించేందుకు, సులభంగా రాకపోకలు సాగించేందుకు చెక్కలతో ఈ వంతెనలు నిర్మించారు. ఇక కాంక్రీట్ తో నిర్మించే అండర్ పాసెస్, ఓవర్ పాస్ టన్నెల్స్ అంటారు. పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించేందుకు వీటిని నిర్మిస్తారు.
ఎందుకు వచ్చింది ఈ ఆలోచన
ప్రతి ఏటా వివిధ రహదారులపై పడి ఎన్నో జంతువులు మృతి చెందుతున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం ప్రమాదాలు జాతీయ రహదారులు, ఎక్స్ ప్రెస్ హైవే ల మీద జరుగుతున్నాయి. క్రమంలో వాటి నివారణ కోసం ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంలో ఈ జాగ్రత్తలు పాటించనుంది. దీనివల్ల జంతువుల ప్రాణ నష్టం తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా మునుముందు నిర్మించే జాతీయ రహదారుల విషయంలో ఇదే తరహా జాగ్రత్తలు కేంద్ర ప్రభుత్వం తీసుకోనుంది.