MLC Anantha Udaya Bhaskar: ఆంధ్రప్రదేశ్ లో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య సంచలనం సృష్టిస్తోంది. డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. తన దగ్గర పనిచేసే డ్రైవర్ నే చంపడంతో రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. దొంగలకు, హంతకులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో సుబ్రహ్మణ్యం ను ఎందుకు హత్య చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హత్య చేశానని ఒప్పుకున్నా ఎమ్మెల్సీపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అడుగుతున్నారు. అధికార పార్టీ లక్ష్యంగా విమర్శలకు దిగుతున్నారు.

ఎమ్మెల్సీ తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. హంతకుడికి జైల్లో సకల సదుపాయాలు కల్పిస్తున్నారని మండిపడుతున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా అతడికి సహకరిస్తూ రాచ మర్యాదలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుందో చూస్తే అర్థమవుతుందన్నారు. దొంగలు, హంతకులు, కిరాతకులు పార్టీలో ఉన్నా వారికే అందలాలు ఇవ్వడంపై హాస్యాస్పదమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని ఎద్దేవా చేశారు.
Also Read: Konaseema: ‘కోనసీమ’ నిందితులెవరో తెలుసు.. యాక్షన్ పైనే అనుమానం
టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత కూడా వైసీపీ ఎమ్మెల్సీ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని విమర్శించారు. హంతకుల పార్టీగా అభివర్ణిస్తున్నారు. ఎమ్మెల్సీని పదవి నుంచి తొలగించాలని కోరుతున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. ఎమ్మెల్సీ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉదయ భాస్కర్ ను కఠినంగా శిక్షించాలని మూకుమ్మడిగా విమర్శలు చేస్తున్నారు.

వైసీపీలో నైతిక విలువలు కొరవడుతున్నాయి. నేరస్తులకే టికెట్లు ఇస్తూ పార్టీని నేరమయంగా చేస్తున్నారు. దీంతో వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పార్టీకి మీరు గౌరవ అధ్యక్షురాలుగా ఎలా ఉన్నారు విజయమ్మ అని ప్రశ్నిస్తున్నారు. హంతకులకు కొమ్ము కాసే వైసీపీకి రాబోయే రోజుల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు గాలికొదిలేశారు. అక్రమాలు, అన్యాయాలకు పెద్ద పీట వేస్తున్నారు. మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి వరకు అందరు ఇలా చేస్తే పార్టీ పరువు ఉంటుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ దీనికి కచ్చితంగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దళితుడైనందుకే అతడిని అన్యాయంగా పొట్టన పెట్టుకుని చంపడం అమానవీయ చర్యగా అభివర్ణించారు. నిందితుడిపై కేసులు నమోదు చేసి శిక్షించాలని అన్ని సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read:Pawan Kalyan : కోనసీమ ఉద్రిక్తతలకు కారణం వారే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Recommended videos



[…] […]
[…] […]