Kodali Nani Arrested: కొడాలి నాని అరెస్టు ఎందుకు? అసలు కేసేంటి? ఎందుకు అరెస్టు చేస్తున్నారు?

Kodali Nani Arrested: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే తెలియని వారుండరు. నిత్యం మీడియా ముందు ఉంటారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. అయినా, ఆయన పోలీసుల రికార్డుల్లో పరారీలో ఉన్నట్లు చూపుతున్నారు. ప్రజా ప్రతినిధుల కోర్టు ఎదుటకు హాజరుకావాలని చేసిన జారీ చేసిన వారెంట్ ను ఆయన లెక్కచేయకపోవడంతో, తక్షణమే కోర్టు ముందుకు హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది. Also Read: Minister Jayaram: అడ్డంగా బుక్కైన మంత్రి జయరాం వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు […]

Written By: SHAIK SADIQ, Updated On : March 3, 2023 3:29 pm
Follow us on

Kodali Nani Arrested

Kodali Nani Arrested: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే తెలియని వారుండరు. నిత్యం మీడియా ముందు ఉంటారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు. అయినా, ఆయన పోలీసుల రికార్డుల్లో పరారీలో ఉన్నట్లు చూపుతున్నారు. ప్రజా ప్రతినిధుల కోర్టు ఎదుటకు హాజరుకావాలని చేసిన జారీ చేసిన వారెంట్ ను ఆయన లెక్కచేయకపోవడంతో, తక్షణమే కోర్టు ముందుకు హాజరు పరచాలని కోర్టు ఆదేశించింది.

Also Read: Minister Jayaram: అడ్డంగా బుక్కైన మంత్రి జయరాం

వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరిగిపోతుందని, టీడీపీ నాయకులు కనీసం పట్టించుకోవడం లేదని అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ప్రత్యేక హోదా తీసుకురావాల్సిందేనట్లు పట్టుబట్టి ఉద్యమాలు చేశారు. ఈ క్రమంలో 2016 మే 10వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మాజీ మంత్రి కొలుసు పార్థసారధితో పాటు మరికొందరితో కలిసి కొడాలి నాని అనుమతి లేకున్నా వన్ వేలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఈ ఆరోపణలతో అప్పుడు కొడాలి నాని పై గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

అప్పటి నుంచి ఆయన పలుమార్లు మాత్రమే కోర్టులకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, రాష్ట్రంలో జగన్ రూల్ మాత్రమే నడుస్తుంది. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులకు అధికారులు బలవడం సర్వసాధారణంగా మారింది. ఇప్పుడు కొడాలి నాని కేసు వ్యవహారంలో కూడా సీఐ కోర్టు ముందు దోషిగా నిలబడ్డారు. జనవరి 5వ తేదీ నుంచి నానిపై జారీ అయిన వారెంట్ ను ఎందుకు పెండింగ్ పెట్టాల్సి వచ్చిందని ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి ప్రశ్నించారు. వెంటనే అరెస్టు చేయాలని ఆదేశాలిచ్చారు.

Kodali Nani Arrested

ఇదిలా ఉంటే, కొడాలి నానిపై జారీ అయిన అరెస్టు వారెంటు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిన ప్రత్యేక హోదా అంశం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మరుగునపెట్టేసింది. కనీసం ప్రధాని మోడీని డిమాండ్ గా అడిగిన దాఖలాల్లేవు. లోక్ సభలో అధికార పార్టీ ఎంపీలు ప్రశ్నించిన దాఖలాలు చాలా తక్కువ. బటన్ నొక్కేందుకు అప్పులకు మాత్రం ప్రతి నెల జగన్ కేంద్రం నాయకులను మత్రం కలుస్తూనే ఉన్నారు.

Also Read:Foxconn- Telangana: తెలంగాణకు ‘ఫాక్స్‌ కాన్‌’ పెట్టుబడి.. లక్షల్లో ఉద్యోగాలు..!

Tags