సినీనటుడు మోహన్ బాబు పెదవి విప్పడం లేదు. ఎప్పుడు వివాదాల్లో ఉండే ఆయన ప్రస్తుతం సైలెంట్ గా మారిపోయారు. ఏ విషయం అయిన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మోహన్ బాబు గొంతు మూగబోయింది. ప్రభుత్వం పై కోపం ఉన్నా వెళ్లగక్కడం లేదు. ఫలితంగా ఆయన తన సహజ గుణాన్ని దాచిపెడుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇకపై రాజకీయాలకు 99 శాతం దూరం ఉంటానని పేర్కొనడం గమనార్హం. ఒక వేళ చేరాలనుకుంటే మాత్రం బీజేపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది.
జగన్ పాలనలో రాష్ర్టం సుభిక్షంగా ఉందని మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆయన పాలనపై ప్రశంసలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ ను ఎవరు కూడా నిందించడానికి ముందుకు రావడం లేదు. ,గతంలో చంద్రబాబును నిందించినట్లుగా జగన్ ను నిందించడానికి ధైర్యం సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో చిరంజీవితో కూడా గొడవలు వచ్చినట్లు తెలుస్తోంది. మా ఎన్నికల విషయంలో రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉండే మోహన్ బాబు ఇటీవల కాలంలో కాస్త సైలెంట్ అయిపోయారు. రాజకీయాల్లో పలు పదవులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం వాటికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. అయినా కొడుకు మా అధ్యక్షుడిగా పోటీ చేయడంతో మోహన్ బాబు సైతం ప్రచారం చేస్తూ విష్ణు ను గెలిపించాలని కోరుతున్నారు.
మా ఎన్నికల్లో మునుపెన్నడు లేని విధంగా పోటీ నెలకొంది. పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రకాశ్ రాజ్ పై స్థానికత అంశాన్ని లేవనెత్తుతుండగా దీనికి ఆయన కూడా సరైన విధంగానే సమాధానం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు ఏ మేరకు ప్రభావం చూపుతారో అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
