https://oktelugu.com/

Umamaheshwari Issue: సాయిధరమ్ తేజ్ పై యాగీ.. ఉమామహేశ్వరి సూసైడ్ పై సైలెంట్? ఇదేమీ జర్నలిజం ఏబీఎన్ రాధాకృష్ణ?

NTRs Daughter Suicide Umamaheshwari Issue: ‘మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా తయారైంది’ ‘పచ్ఛ’ మీడియా పిచ్చిరాతల పరిస్థితి. మన కులపోడు అయితే చాలు నెత్తిన పెట్టుకోవడం.. మన పగోడు అయితే చాలు వీధినపడేయడం బాగా అలవాటైంది. మీడియా చేతిలో ఉంది కదా? అని పగోళ్లను రచ్చరచ్చ చేయడం ఈ మీడియాకు అలవాటుగా మారింది. చంద్రబాబు అను‘కుల’ మీడియా ధాటికి ఎంతో మంది బాధితులుగా మారారు. బాబుపై ఈగ వాలనీయకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2022 / 12:45 PM IST

    Umamaheshwari Issue

    Follow us on

    NTRs Daughter Suicide Umamaheshwari Issue: ‘మనం చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా తయారైంది’ ‘పచ్ఛ’ మీడియా పిచ్చిరాతల పరిస్థితి. మన కులపోడు అయితే చాలు నెత్తిన పెట్టుకోవడం.. మన పగోడు అయితే చాలు వీధినపడేయడం బాగా అలవాటైంది. మీడియా చేతిలో ఉంది కదా? అని పగోళ్లను రచ్చరచ్చ చేయడం ఈ మీడియాకు అలవాటుగా మారింది.

    చంద్రబాబు అను‘కుల’ మీడియా ధాటికి ఎంతో మంది బాధితులుగా మారారు. బాబుపై ఈగ వాలనీయకుండా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ కాపు కాస్తుంటాడని వైసీపీ నేతలు ఆరోపిస్తూనే ఉంటారు. ఏదైనా టీడీపీ, చంద్రబాబు కుటుంబంలో జరిగితే అది వార్త కాదన్నట్టు..? ఇక వైసీపీ సహా ఇతర కాపు, రెడ్డి వర్గాల్లో జరిగితే అదో ఇంటర్నేషనల్ వార్త అయినట్టు కోడి మీద ఈకలు పీకినట్టు పీకేసి వారిని నడిబజారున పడేయడం ఈ పచ్చ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. కానీ సోషల్ మీడియా వచ్చాక ఈ పచ్చ మీడియా వికటట్టాహాసానికి తెరపడింది. వాస్తవాలు నేరుగా ప్రజలకు తెలుస్తున్నాయి. ఎవరికి వారు సోషల్ మీడియాలో వాస్తవాలతో కడిగేస్తుండడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సహా టీడీపీ అనుకూల మీడియా ఆటలు సాగడం లేదు.

    -గతంలో చిరంజీవి బాధితుడు
    చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీపై ‘కాపు’ ముద్రవేసి కమ్మలకు పోటీగా రాకుండా ఎంతగా ప్రతిష్ట దిగజార్చారో అందరికీ తెలిసిందే. ఒక నాయకుడిని ముందు పెట్టి ఆటాడించి చిరంజీవి టికెట్లు అమ్ముకుంటున్నాడని ప్రజల్లో ఇదే పచ్చ మీడియా కుట్రలు చేసింది. చిరంజీవిని రాజకీయాల్లోనే రిటైర్ అయిపోయేలా చేసింది..

    ఇక శ్రీరెడ్డి ఏకంగా పవన్ కళ్యాణ్ ను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి విమర్శిస్తూ ఎపిసోడ్ లకు ఎపిసోడ్ లు ప్రసారం చేసి మెగా ఫ్యామిలీ పరువును ఇదే పచ్చ మీడియా తీసేసింది.

    ఇక నిన్నటికి నిన్న చిరంజీవి మేనల్లుడి బైక్ ఆక్సిడెంట్ పెద్ద న్యూసా? గా భావించి సాయిధరమ్ తేజ్ తాగి నడిపాడని.. స్పీడ్ గా వెళ్లాడని ఎంత పెద్ద రచ్చ చేశారో అందరికీ తెలిసిందే.

    సాయిధరమ్ తేజ్ న్యూస్ ను పెద్ద న్యూస్ గా భావించి నాలుగైదు రోజుల పాటు ఎంతగా నానాయాగీ చేశారో తెలిసిందే. ఎందుకంటే చిరంజీవి, మెగా ఫ్యామిలీ కాపులు.. పైగా వారికి రాజకీయ అండదండలు లేవు.. పైగా కమ్మవారికి పోటీగా పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వారిపై బురదజల్లడానికి టీడీపీ మీడియా కాచుకు కూర్చుంది.

    సాయిధరమ్ తేజ్ వార్తను అంతగా యాగీ చేసిన ఈ పచ్చ మీడియా ఇప్పుడు పెద్ద ఎన్.టీ.ఆర్ కూతురు ఆత్మహత్య పెద్ద న్యూస్ కాదన్నట్టుగా వ్యవహరిస్తుండడమే అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.. సాయిధరమ్ ది కానీ.. ఉమా మహేశ్వరి ఆత్మ హత్య కానీ రెండూ సాదా సీదా న్యూసులే.. కానీ ఏబీ.ఎన్ రాధాక్రిష్ణకి మాత్రం చిరంజీవి మేనల్లుడి బైక్ ఆక్సిడెంట్ చాలా పెద్ద న్యూస్ గా కనిపడింది.. దాన్ని రోజుల తరబడి న్యూసెన్స్ చేసేంత పెద్ద న్యూస్ గా ఆయన మీడియాలో రచ్చ చేయించాడు.

    ఇదే సమయంలో పెద్ద ఎన్.టీ.ఆర్ కూతురు ఆత్మహత్య చాలా చిన్న న్యూస్ గా టీడీపీ మీడియా అస్సలు పట్టించుకోవడం లేదు… పైగా అది వ్యక్తిగత వార్తాయే అన్నట్టుగా ఏబీఎన్ వ్యవహరించడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.. ‘తమ కులపోళ్ళ వార్త అందులో వ్యక్తిగత వార్త.. అందుకే ఇంకేమి వేస్తాడు రాధాకృష్ణ’ అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఏబీఎన్ తీరుపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. చనిపోయిన ఆవిడ వేరే ఇంటి బిడ్డ అయితే ఇదే రాధాకృష్ణ దాన్ని చిలవలు పలువలు చేసి వారం రోజులు టీఆర్పీ కోసం రచ్చ చేసి ఎంత యాగీ చేసేవాడో అని విమర్శలు గుప్పిస్తున్నారు. తాను చెప్పిన అనారోగ్యం కారణం మీదే ఎన్నో వార్తలు ఇలా ఉండేవంటూ నెటిజన్లు కామెంట్స్ చేశారు.

    ఎన్టీఆర్ కూతురు.. చంద్రబాబు మరదలు కాకుంటే ఉమామహేశ్వరి ఆత్మహత్య వ్యవహారాన్ని ఇదే ఏబీఎన్ రాధాకృష్ణ వదిలేవాడు కాదని.. ‘అనారోగ్యానికి కారణం ఏంటి ఎయిడ్సా? క్యాన్సరా? లివర్ పాడైపోయిందా? కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఎంత కాలం నుండి అనారోగ్యం? ఎక్కడ వైద్యం తీసుకున్నారు? డాక్టర్ ఎవరు? ’ అబ్బో ఇంకా చాలా చాలా బ్రేకింగ్ వార్తలు ప్రసారం చేసేవాడంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు ఆధారాలతో సహా నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. తమ కులపోళ్లు, సన్నిహితులు అయితే ఒకలా? వేరే వాళ్లు అయితే మరోలా వ్యవహరిస్తారా? అని కడిగిపారేస్తున్నారు.