Prashant Kishor: దేశంలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇన్నాళ్లు కాంగ్రెస్ తోనే బీజేపీకి కత్తెర వేయాలని భావించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన వైఖరి మార్చుకున్నారు. కాంగ్రెస్ తో బీజేపీని ఎదుర్కోలేమని చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ తోనే బీజేపీని ఢీకొనడం వీలవుతుందని చెప్పిన ఆయనే ప్రస్తుతం మాట మారుస్తున్నారు. కాంగ్రెస్ లో చేరి వెలిగిపోవాలని ఆశించినా ఆయన ప్రణాళిక సఫలం కాలేదు. దీంతో పీకే తన పంథా మార్చుకున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో మార్పులకు పెద్దపీట వేయాలని భావించినా ఆయన ప్లాన్ లు వర్కవుట్ కాలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీని పట్టుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బెంగాల్ లో విజయ దుందుబి మోగించిన దీదీ మమతా బెనర్జీ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెసే అసలైన కాంగ్రెస్ గా అభివర్ణిస్తున్నారు. మమతకే జై కొడుతూ మమత సారధ్యంలోనే మూడో కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం.
Also Read: ఏపీలో జగన్ పరిస్థితి ఏంటి? మళ్లీ గెలవగలడా? టీడీపీ పోటీనిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతో బాధపడుతోంది. సరైన నాయకుడు లేక పార్టీ డీలా పడుతోంది. అందుకే చేదు ఫలితాలు ఎదురవుతున్నాయి. అయినా ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉంటోంది. కానీ విజయం మాత్రం దక్కడం లేదు. కేంద్రంలో నాయకత్వం బలంగా ఉంటే స్టేట్లు కూడా బలంగా తయారయ్యేవి. కానీ అధిష్టానం పరిస్థితే అంతంత మాత్రంగా ఉండటంతో ఏం చేయాలనే మీమాంసలో పడిపోతోంది.
దీంతో పీకే ఇప్పటికే బీజేపీని ఓడించడం కష్టమనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచినా బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని సమర్థంగా ఢీకొనే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదని తెలుస్తోంది. దీంతో రాబోయే ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే అధికారం హస్తగతం చేసుకుంటుందని ఓ సర్వే చెబుతోంది.
Also Read: అంతర్మథనంలో మాటల మాంత్రికుడు.. కేసీఆర్ వ్యూహం అదేనా..?