Homeఆంధ్రప్రదేశ్‌Castes vs Jagan : ఆ కులాలను జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు కారణమేంటి?

Castes vs Jagan : ఆ కులాలను జగన్ ఎందుకు పట్టించుకోవడం లేదు కారణమేంటి?

CM Jagan

Castes vs Jagan : ఏపీలో కుల జాఢ్యం ఎక్కువే. అందునా రాజకీయాల్లో మరీ ఎక్కువ. కమ్మలైతే టీడీపీ, రెడ్డిలైతే వైసీపీని ఓన్ చేసుకుంటారు. కానీ కాపులు మాత్రం స్థిర నిర్ణయంతో ఉండలేరు. అందుకే వారిని టార్గెట్ చేసుకుంటూ ఏపీలో జరిగినన్ని రాజకీయాలు మరెవరిపై జరగవు. సంఖ్యాబలంగా ఉన్న కాపులను ప్రతి ఎన్నికల్లోనూ విభజించి పాలించు అన్న చందంగా మార్చుతుంటారు. రాజకీయ లబ్ధికి వాడుకుంటారు. -అయితే ఈసారి కాపులు పవన్ వైపు మొగ్గుచూపుతుండడంతో జగన్ పునరాలోచనలో పడ్డారు. అందుకే కాపులను ఏకాకి చేయడానికి బలిజ, శెట్టిబలిజ, తెలగ, ఒంటరి కులస్థులను ప్రోత్సహించే పనిలో పడ్డారు జగన్. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కాపులకు ప్రాధాన్యం తగ్గించి గట్టి సంకేతాలే పంపారు. పవన్ వెంట మీరు నడిస్తే.. ఇక మీతో మాకు పనిలేదని.. ఇతర కులాలతో రాజకీయం చేసుకుంటానని స్పష్టం చేశారు.

అయితే బ్రాహ్మణ, వైశ్య వంటి సామాజికవర్గాలను పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలకు ప్రాధాన్యమిచ్చారు. సంక్షేమ పథకాల పేరిట నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణ, వైశ్య కులస్థులకు ఈ ఫలాలేవీ అందడం లేదు. దీంతో వారిలో అసంతృప్తి నెలకొంది. అందుకే వారు వైసీపీకి వ్యతిరేకులుగా మారారు. అందుకే జగన్ వారికి రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనీసం మంత్రివర్గంలో చోటు కల్పించలేదు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసి చేతులు దులుపుకున్నారు. మిగతా ఎక్కడా ఆ రెండు కులాలకు ప్రాధాన్యం లేదు.

అటు కమ్మ సామాజికవర్గంలో దాదాపు 90 శాతం టీడీపీ వైపు టర్న్ అయ్యింది. వైసీపీ ప్రభుత్వ చర్యల పుణ్యమా అని చంద్రబాబు నాయకత్వం ఇష్టం లేనివారు సైతం టీడీపీ గూటికి చేరిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి లబ్ధిపొందని వారు వైసీపీని ఆదరించారు. కానీ జగన్ తన చర్యలతో వారిని దూరం చేసుకున్నారు. ఆ సామాజికవర్గానికి ఉన్న ఒక్కగానొక్క మంత్రి కొడాలి నానిని మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే కమ్మ సామాజికవర్గం టర్న్ అయినందున ఆ కులంతో తనకు పనిలేదన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు.

ఇక సొంత సామాజికవర్గం రెడ్డికి జగన్ ప్రాధాన్యమిచ్చారు. కేబినెట్ లో కాపులతో పాటు ఇతర బీసీ వర్గాలకు ప్రయారిటీ ఇచ్చినా పవర్ పాలిట్రిక్స్ మాత్రం రెడ్డి నేతలకే అప్పగించారు. సలహాదారుల నుంచి భారీగా లబ్ధి చేకూర్చే నామినేటెడ్ పోస్టులను వారికే కట్టబెట్టారు. కానీ రెడ్డి సామాజికవర్గంలో కూడా మెజార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఒకరిద్దరు నాయకులకు తప్పించి మిగతా వారికి తీరని అన్యాయం చేస్తున్నారని ఆక్షేపిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో సామాజిక సమతూకం పాటిస్తున్నానని చెప్పి.. రెడ్డిలను పక్కన పడేశారు. అలా చేసినా తన వెంటే ఉంటారన్న నమ్మకంతో ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకే ఒక సీటు కేటాయించారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version