Facebook: ఫేస్ బుక్ ను యూత్ ఎందుకు దూరం పెడుతున్నారు..? దీనికి పోటీనిచ్చే యాప్ లు ఏవీ..? 

Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఎవరంటే టక్కున చెప్పే ఒకే ఒక్కయాప్ ఫేస్ బుక్. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ ఫోన్ ఉన్న వారు దాదాపు ఫేస్ బుక్ కు కనెక్ట్ అవుతారు. కొందరు సరదా కోసం ఆశ్రయిస్తే.. మరికొందరు సమాచారం కోసం దీనిని వాడుతారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్లు ఉన్న ఫేస్ బుక్ కు రోజుకు ఎంత ఆదాయం వస్తుందో మాటల్లో చెప్పలేం. అంతేకాకుండా దీని అధినేత మార్క్ జుకర్ బర్గ్ […]

Written By: NARESH, Updated On : February 7, 2022 7:20 pm
Follow us on

Facebook: సోషల్ మీడియా దిగ్గజం ఎవరంటే టక్కున చెప్పే ఒకే ఒక్కయాప్ ఫేస్ బుక్. ఉదయం నుంచి రాత్రి వరకు మొబైల్ ఫోన్ ఉన్న వారు దాదాపు ఫేస్ బుక్ కు కనెక్ట్ అవుతారు. కొందరు సరదా కోసం ఆశ్రయిస్తే.. మరికొందరు సమాచారం కోసం దీనిని వాడుతారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది యూజర్లు ఉన్న ఫేస్ బుక్ కు రోజుకు ఎంత ఆదాయం వస్తుందో మాటల్లో చెప్పలేం. అంతేకాకుండా దీని అధినేత మార్క్ జుకర్ బర్గ్ ఎంత పెద్ద శ్రీమంతుడో అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల ఆయన ఒక్కరోజులో 17 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాడు. దీంతో ప్రపంచ కుభేరుల స్థానంలో 12వ స్థానానికి పడిపోయాడు. అయితే 10, 11 స్థానాల్లో మాత్రం మన భారతీయ అపర కుబేరులు అదానీ, అంబానీలు ఉన్నారు. రోజురోజుకు ఫేస్ బుక్ యూజర్ల తగ్గిపోవడమే జుకర్ బర్గ్ పతనానికి కారణమని నిపుణులు అంటున్నారు.. ఇంతకీ ఫేస్ బుక్ గురించి అసలు కథేంటంటే..?

ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’కు చెందిన షేర్ వాల్యూ ఈనెల 3న భారీగా పడిపోయింది. 323 డాలర్లుగా ఉన్న షేర్ ధర ఒక్కరోజులు 26 శాతం పడిపోయింది. దీంతో దీని మార్కెట్ విలువ 230 బిలియన్ డాలర్లు(రూ.17 లక్షల కోట్లు) నష్టపోయింది. ఫేస్ బుక్ షేర్ తగ్గడంతో జుకర్ బర్గ్ సంపద 6 లక్షల 30 వేల కోట్లకు పడిపోయింది. దీంతో జుకర్ బర్గ్ ప్రపంచ కుబేరుల్లో 12వ స్థానానికి పడిపోయారు. అయితే ఇదే సమయంలో ఇండియాకు చెందిన గౌతమ్ అదానీ 6 లక్షల 75 వేల కోట్లతో, ముఖేశ్ అంబానీ 6 లక్షల 70 వేల కోట్లతో 10,11 స్థానాలకు చేరుకున్నారు. ఇలా అదానీ, అంబానీల స్థానాలు మారడానికి కారణమంటి..?

ప్రపంచ వ్యాప్తంగా తొలిసారిగా ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య భారీగా పడిపోయింది. అయితే ఇందుకు ఫిబ్రవరి 2న ఫేస్ బుక్ ను నిర్వహిస్తున్న మెటా సంస్థ విడుదల చేసిన ఆర్థిక ఫలితాలే కారణమని అంటున్నారు. 2021 అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలో 5 లక్షల మంది డైలీ యూజర్ల సంఖ్యను కోల్పోయింది. దీని ఫలితంగా యాడ్స్ ను చూసేవారికి సంఖ్య కూడా తగ్గినట్లయింది. మొత్తంగా మెటాకు ఆదాయం తగ్గిపోయింది. దీంతో ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫేస్ బుక్ షేర్లను అమ్మేశారు. అయితే సంవత్సరం లెక్కల ప్రకారం 5 శాతం డైలీ యూజర్ల సంఖ్య పెరిగింది. ఇక నెలవారీ యూజర్ల సంఖ్య 4 శాతం పెరిగి 291 కోట్లకు పెరిగింది.

కొంతకాలంగా ఇతర సంస్థల నుంచి ఫేస్ బుక్ తీవ్రంగా పోటీని ఎదుర్కొంటోంది. టిక్ టాక్ వంటి యాప్ లపై యువత క్రేజ్ పెంచుకోవడంతో ఫేస్ బుక్ పై కాస్త అశ్రద్ధ వహిస్తున్నారని జుకర్ బర్గ్ స్వయంగా తెలిపారు. ఇక యూట్యూబ్ షార్ట్ వీడియోస్ కూడా ఫేస్ బుక్ కు గట్టిపోటీనిస్తుంది. 2016లో మార్కెట్లోకి వచ్చిన టిక్ టాక్ తక్కువ కాలంలోనే యూత్ ను ఆకట్టుకుంది. చైనాతో గొడవలకు ముందే ఇండియాలోనూ టిక్ టాక్ హవా సాగింది. 2021లో ప్రపంచంలో అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ గా టిక్ టాక్ నిలిచింది. ఆ తరువాత స్థానంలో ఇన్ స్ట్రాగ్రామ్, ఫేస్ బుక్ ఉన్నాయి.

ఇక యూత్ ఎక్కువగా ఫేస్ బుక్ ను పట్టించుకోనట్లు తెలుస్తోంది. 2012 నుంచే యువతను అట్రాక్ట్ చేయడంలో ఫేస్ బుక్ విఫలమవుతోందని ద వెర్డ్ అనే వెబ్ సైట్ పేర్కొంది. 2019 నుంచి అమెరికాలో టీనేజ్ శాతం 13 శాతం తగ్గినట్లు తెలిపింది. ఇక రాబోయే రోజుల్లోనూ ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది.