https://oktelugu.com/

Minimum Support Price Act : కనీస మద్దతుధర చట్టంపై ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదు.. రైతుల డిమాండ్ ఏమిటి..?

Minimum Support Price Act: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఉభయ సభల్లో పెట్టిన బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ఉద్యమం విరమించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కానీ రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఎంఎస్ పీకి చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని, మరికొన్ని డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు.అయితేఎంఎస్ పీ చట్టం […]

Written By:
  • NARESH
  • , Updated On : December 1, 2021 11:15 am
    Follow us on

    Minimum Support Price Act: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ఉభయ సభల్లో పెట్టిన బిల్లు ఆమోదం పొందింది. దీంతో ఏడాది కాలంగా రైతులు చేస్తున్న ఉద్యమం విరమించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. కానీ రైతులు మాత్రం వ్యవసాయ చట్టాల రద్దుతో పాటు ఎంఎస్ పీకి చట్టం తేవాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం తేవాలని, మరికొన్ని డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తామని అంటున్నారు.అయితేఎంఎస్ పీ చట్టం రద్దు సాధ్యం కాదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దీంతో అసలు ఎంఎస్ పీ అంటే ఏమిటి..? రైతులు దానిని చట్టం చేయాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారు..? ప్రభుత్వం ఒప్పుకోకపోవడానికి కారణం ఏంటి..?

    Minimum Support Price Act

    MNP

    రైతులు పండించిన పంటకు కేంద్ర ప్రభుత్వం కనీస ధర నిర్ణయిస్తుంది. దీనినే మినిమం సపోర్టు ప్రైస్ (ఎంఎస్ పీ) అంటారు. రైతులు తాము పండించిన పంటలను ప్రభుత్వం ఈ విధానం ద్వారా నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తుంది. దీంతో మార్కెట్లో ఆ పంటలకు ఎలాంటి డిమాండ్ ఉన్నా లేకపోయినా ప్రభుత్వం మాత్ర రైతులకు నిర్ణయించిన ధరను చెల్లిస్తుంది. అయితే 1960 సంవత్సరంలో దేశాన్ని ఆహార కొరత నుంచి కాపాడేందుకు ప్రభుత్వం మొదటగా గోధుమలపై ఎంఎస్ పీ ప్రారంభించింది. ఈ విధానం ద్వారా రైతుల నుంచి పంటలను కొనుగోలు చేసి వాటిని రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ చేస్తుంది.

    ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 23 రకాల పంటలకు మాత్రమే ఎంఎస్ పీ అందిస్తోంది. 7 తృణధాన్యాలు, 5 పప్పు ధాన్యాలు, 7 నూనె గింజలు, 4 ఇతర పంటలకు ప్రభుత్వం కనీస మద్ధతు ధర చెల్లిస్తుంది. అయతే 2014 ఆగస్టులో ఏర్పాటైన శాంతకుమార్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో 6 శాతం రైతులే ఎంఎస్ పీ విధానం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని తేల్చారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖకు చెందిన ‘కమిషన్ ఫర్ అగ్రిగల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్’ నుంచి రైతులకు కనీస మద్దతు ధర చెల్లిస్తారు. కొన్ని రాష్ట్రాల్లో దీనిని అమలు చేస్తున్నా బీహార్ రాష్ట్రంలో ఎంఎస్ విధానం లేదు.

    అయితే ఎంఎస్ పీ అనేది ఒక విధానం మాత్రమే. చట్టం కాదు. ప్రభుత్వం తలచుకుంటే దానిని ఎప్పుడైనా రద్దు చేయవచ్చు. దీంతో ఎంఎస్ పీని చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులు తాము ఎంఎస్ పీ విధానాన్ని రద్దు చేయబోమని తెలుపుతున్నారు. అయితే కొందరు ఎంఎస్ పీ చట్టం కానందు వల్ల కనీస మద్దతు ధర కంటే తక్కువకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలా చేయడాన్ని నేరంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకు చట్టం చేయడమే మార్గం అని అంటున్నారు. ఎంఎస్ పీ చట్టంతోనే రైతులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.

    Also Read: వరిధాన్యం కొనుగోళ్ల వివాదంలో తప్పెవరిది..? కేంద్రానిదా..? రాష్ట్రానిదా..?

    ప్రభుత్వం ఎంఎస్ పీ చట్టం చేయడం సాధ్యం కాదని అంటోంది. ఎంఎస్ పీ ఒక ‘ఫెయిర్ ఏవరేజ్ క్వాలిటీ’ని సూచిస్తుంది. అంటే నిర్ణయించిన ప్రమాణాకలు తగ్గ నాణ్యతతో పంటను పండిస్తేనే రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వగలరు. ప్రమాణాలకు తగిన విధంగా పంట ఉందా..? లేదా..? అనేది ఎలా నిర్ణయిస్తారు..? ఈ ప్రమాణాలను పాటించని రైతుల సంగతేంటి..? దీంతో ప్రభుత్వంపై తీవ్ర భారం పడుతుందని కేంద్ర మంత్రులు అంటున్నారు. 2019-20 సంవత్సరంలో 23 పంటల మొత్తం ఉత్పత్తి 10.78 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఉత్పత్తి చేసినదంతా మార్కెట్లో విక్రయించరు. కొంత భాగాన్ని సొంత అవసరాలకు వాడుకుంటారు.

    75 శాతం గోధుమలను లెక్కలోకి తీసుకుంటే 8 లక్షల కోట్ల రూపాయలపైనే అవుతుంది. ప్రభుత్వం ఎంఎస్ పీ హామీ ఇవ్వాలంటే ఇంత ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం తమ ఏజెన్సీల ద్వారా కొన్ని పంటలను ముందే కొనుగోలు చేస్తుంది. వీటి ఖర్చు మొత్తం 2.7 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడున్న విధానంతో ఒక రైతులు తమ పంటలను మొత్తం ప్రభుత్వానికి విక్రయించాల్సిన అవసరం లేదు. ఎక్కువ ధర ఇచ్చే ఏజెన్సీలకు అమ్ముకోవచ్చు. మరోవైపు ప్రభుత్వం రైతులకు సరైన ధర చెల్లించి సబ్సిడీ కింద విక్రయించాల్సి ఉంటుంది. దీనివల్ల బడ్జెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది అని అంటున్నారు.

    Also Read: ట్విట్టర్ కు మనోడే.. ప్రపంచ టెక్ సామ్రాజ్యాన్ని అధిరోహించిన భారతీయులు వీళ్లే..