Lemongrass Products: తెలంగాణలోని కరువు పీడిత వనపర్తితోపాటు జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రదాడికి బలైన పుల్వామాలో ఇప్పుడు సుగంధ విప్లవం కనిపిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఆరోమాటిక్ ప్లాంట్స్ (CIMAP) ల్యాబ్‌లు ‘అరోమా మిషన్’లో భాగంగా దేశంలో ఈ సుగంధ విప్లవాన్ని సృష్టించాయి. కాశ్మీర్‌లో లావెండర్‌ను సాగు చేస్తుండగా, తెలంగాణలో వేలాది హెక్టార్లలో రైతులు ‘నిమ్మగడ్డి’ని పండించేలా చేస్తున్నాయి. ఈ రెండింటి నుంచి భారతదేశ అవసరాల కోసం సుగంధ తైలాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. ఇదివరకూ విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు సొంతంగా ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగాం.
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మండే మాట్లాడుతూ, “పుల్వామా మరియు కుప్వారా వంటి ప్రదేశాలు లావెండర్ (తులసి లాంటి సువాసన వెదజల్లే ఒక్క ఉదారంగు మొక్క) సాగుతో ఊదారంగు విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. ఇక్కడి పంటతో సుగంధ నూనెలు, పూలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే బాధ తప్పింది. విదేశీ మారకద్రవ్యం మిగిలిపోయింది.. ‘అరోమా మిషన్’ పేరిట చేపట్టిన ఈ పంట దిగుమతులను తగ్గించే లక్ష్యంతో వేశారు. అది విజయవంతమైందని తెలిపారు.. భారతదేశం ఈ పంటతో స్వయం సంవృద్ధి సాధించింది.
Also Read: CM Jagan with Employees: ఉద్యోగులతోపెట్టుకొని సీఎం జగన్ ఇరుక్కున్నారా?
సీఐఎంఏపీ లక్నో మరియు హైదరాబాద్‌లోని దాని ప్రాంతీయ కేంద్రం మిషన్‌లో ఈ పంట విత్తనాలను మన వాతావరణానికి అనుగుణంగా తీర్చిదిద్దారు. రైతుల సాగు కోసం ఇచ్చారు. “CSIR-IIIM జమ్మూ కాశ్మీర్‌లో లావెండర్‌ను సరఫరా చేయడంలో నిమగ్నమై ఉండగా, సీఐఎంఏపీ లక్నో రైతులకు లెమన్‌గ్రాస్‌ను సరఫరా చేస్తుంది.
దక్కన్ ప్రాంతంలో వ్యవసాయ వాతావరణం అనుకూలించడంతో నిమ్మగడ్డిని సాగుచేస్తున్నట్లు సీఐఎంఏపీ-హైదరాబాద్ శాస్త్రవేత్తలు తెలిపారు. వనపర్తి జిల్లాలోని చేకూరుచెట్టు తండా వంటి గిరిజన తండాల రైతులకు నిమ్మగడ్డి విత్తనాలు (కృష్ణా రకం) పంపిణీ చేస్తోంది. చేకూరుచెట్టు తండా గ్రామ పంచాయతీకి చెందిన సుగంధ మిషన్ లబ్ధిదారుడు వి మోతీబాయి మాట్లాడుతూ: “మేము నీటి కొరత.. పంట నష్టాలను ఎదుర్కొన్నాము. లెమన్‌గ్రాస్ పంటను పండించడం మొదలుపెట్టిన లాభాలను చూస్తున్నామని’ ఆనందం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం భారతదేశం ఏటా 182 టన్నుల లెమన్‌గ్రాస్ నూనెను దిగుమతి చేసుకుంటోంది. మొదట్లో అరోమా మిషన్ లక్ష్యం 5,500 హెక్టార్లు కాగా, మంచి స్పందన రావడంతో ఇప్పుడు దాన్ని అనేక రెట్లు దేశంలో పెంచారు. తెలంగాణలోని కరువు పీడిత వనపర్తి జిల్లాలోనూ ఈసాగును దిగ్విజయంగా పండిస్తూ లాభాలు గడిస్తున్నారు.
CSIR ల్యాబ్‌లు వివిధ వ్యవసాయ వాతావరణాలలో వివిధ సుగంధ పంటలకు అనుకూలతలను గుర్తించి ఆ దిశగా విత్తనాలను అన్ని తట్టుకునేలా తయారు చేశాయి. నిమ్మ నూనెను వెలికితీసే ప్రక్రియ సాంకేతికతలు, ఆర్థిక సాధ్యత లభించేలా రైతులకు ఈసాగుపై అవగాహన కల్పించి ఇప్పుడు లాభాల బాట పట్టించాయి.
CIMAP-హైదరాబాద్ ఆర్థికంగా ముఖ్యమైన ఔషధ, సుగంధ మొక్కలతో విస్తృత దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసింది. బంజరు భూములు మరియు పొడి భూములను పర్యావరణ అనుకూలమైన, లాభదాయకమైన గ్రీన్ హెర్బల్ ఫామ్‌లుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకొని విజయం సాధించింది.
వనపర్తితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన గిరిజన రైతులు వర్షాధారంగా సిట్రోనెల్లా, లెమన్‌గ్రాస్, యారో రూట్ మరియు పొడవాటి మిరియాలను సాగు చేస్తారు. కరువు పీడిత అనంతపురం జిల్లాలోని చిన్న మరియు సన్నకారు రైతులు వర్షాధార పరిస్థితుల్లో శీతాకాలపు చెర్రీని ఉత్పత్తి చేస్తారు. ఇక్కడ పండించే సాంప్రదాయ వేరుశెనగకు ప్రత్యామ్మాయంగా ఈ పంటలు పండిస్తూ రైతులకు లాభాలను అందజేస్తున్నారు.