https://oktelugu.com/

అమరరాజా కంపెనీపై ఏపీ ప్రభుత్వానికి ఎందుకంత కోపం?

పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాష్ర్టం పురోభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికీకరణలో వెనుకబడుతోంది. దీంతో అభివృద్ధి కుంటుపడుతోందని తెలుస్తోంది. ఉన్న పరిశ్రమలు సైతం సజావుగా సాగడం లేదు. కొత్త పరిశ్రమల రావడం లేదు. దీంతో నిరుద్యోగ సమస్య సైతం పెరిగిపోతోంది. దీనికి పారిశ్రామికీకరణ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ర్టంలో అమరరాజా సంస్థ చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వమే ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 12, 2021 / 01:27 PM IST
    Follow us on

    పారిశ్రామికీకరణతోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాష్ర్టం పురోభివృద్ధి సాధించాలంటే పరిశ్రమలే కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామికీకరణలో వెనుకబడుతోంది. దీంతో అభివృద్ధి కుంటుపడుతోందని తెలుస్తోంది. ఉన్న పరిశ్రమలు సైతం సజావుగా సాగడం లేదు. కొత్త పరిశ్రమల రావడం లేదు. దీంతో నిరుద్యోగ సమస్య సైతం పెరిగిపోతోంది. దీనికి పారిశ్రామికీకరణ కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ర్టంలో అమరరాజా సంస్థ చుట్టూ వివాదాలు చెలరేగుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఉల్లంఘించారని ప్రభుత్వమే ఈ సంస్థన తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అమరరాజా సంస్థ తరలించక తప్పని పరిస్థితి.

    పారిశ్రామిక పెట్టుబడుల విసయంలో అష్టకష్టాలు పడుతున్న సమయంలో 1.35 బిలియన్ డాలర్ల రెవెన్యూ దాటిన పెద్ద కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు ఉందనే దానిపై వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏపీకి ఆర్థిక సమస్యలు వెన్నంటుతున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణంల జాప్యం జరుగుతోంది. ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రెవెన్యూ అవసరం అవుతుంది. అటువంటి డబ్బు పరిశ్రమల వల్లేవస్తుందని తెలిసినా అమరరాజాను మాత్రం పంపించేందుకే నిర్ణయించుకుంది.

    ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పరిశ్రమల్లో నుంచి వెలువడే ఉద్గారాలు పర్యావరణానికి ప్రమాదంగా పరిణమిస్తున్నాయి. దీంతో రోజురోజుకు వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటారని పర్యావరణ శాస్ర్తవేత్తలు సైతం హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు.ఐక్యరాజ్య సమితి వెలువరించిన నివేదికలో విస్తుగొలిపే నిజాలు ఉన్నాయి. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు కనువిప్పు పొందాలని కోరుతున్నాయి.

    గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ గల్లా జయదేవ్ కు చెందని సంస్థ అమరరాజా సంస్థ. దీంతో ఆ కంపెనీని మూసేయాల్సిందే అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అమరరాజా 1985లో స్థాపించారు. ఈ కంపెనీకి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో కరకంబాడి, చిత్తూరు సమీపంలోని నూనగుండ్లపల్లిలోో రెండు యూనిట్లు ఉన్నాయి. ఈ సంస్థ బ్యాటరీలు తయారు చేసే రెండో అతిపెద్ద సంస్థ. ఇక్కడ తయారయ్యే బ్యాటరీలు 37 దేశాలకు ఎగుమతి అవుతుంటాయి. మూడున్నర దశాబ్ధాల క్రితమే స్థాపించిన ఈ పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించిందని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం గమనార్హం.

    ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. నోటీసులు రద్దు చేయాలని కోరింది. దీంతో ఏపీ హైకోర్టు కూడా క్లోజర్ నోటీసులపై నాలుగు వారాల స్టే విధించింది. ఆగస్టు 16న దీనిపై తదుపరి విచారణ చేపట్టనుంది. అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థ వల్ల ప్రమాదకర రసాయనాలు, సీసం నీటిలో కలుస్తున్నాయని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. సీబీఐతో పాటు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు జరిపిన పరిశీలనలో సమీపంలోని చెరువులు కలుషితం అవుతున్నట్లు పరిశీలనలో వెల్లడైంది.

    జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనే ఆక్వా పరిశ్రమలు, దివీస్ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారు. తాము అధికారంలోకి వస్తే ఆ పరిశ్రమలు మూసేస్తామని అప్పుడే చెప్పారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమ కాలుష్యం వెదజల్లుతోందని ఆందోళనలు వస్తున్న తరుణంలో వాటిని మూసివేసేందుకు నిర్ణయించారు. కానీ ఇంకా కొన్ని సంస్థల జోలికి మాత్రం వెళ్లడం లేదు.

    అమరరాజా కంపెనీపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మూసి వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ర్టంలో మిగతా పరిశ్రమలు ఉన్నా అమరరాజానే టార్గెట్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ వల్ల ప్రజలకు ఎంత నష్టం జరిగిందో తెలిసినా దాని మూసివేతకు మాత్రం ఆదేశాలు ఇవ్వడం లేదు. కాలుష్య కారక పరిశ్రమలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్నింటిని మూసేయాల్సిన ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

    అమరరాజా కంపెనీ తన వాదనలను ఇప్పటికే హైకోర్టుకు తెలిపింది. పీసీబీ జారీ చేసిన క్లోజర్ ఆర్డర్స్ ని రద్దు చేయాలని కోరింది. కోర్టు తాత్కాలికంగా వాటిని అమలు చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఈ సమస్యను పరిష్కరించేందుకు సంప్రదింపులు జరిపి జులై 28 నాటి లేఖలోో పేర్కొంది. అమర రాజా కంపెనీపై ప్రభుత్వం చేపడుతున్న నిర్ణయాలపై కంపెనీ యాజమాన్యం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది పక్షపాత ధోరణితో ప్రవర్తించడం పై తన అసహనాన్ని వ్యక్తం చేస్తోంది.