https://oktelugu.com/

Prashanth Kishore: పీకే.. ప్రాంతీయ పార్టీలను కాదని కాంగ్రెస్ లోకి ఎందుకు వెళుతున్నారు?   

Prashanth Kishore: దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు జోరందుకుంటున్నాయి. ఇటీవల ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన పీకే ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేయడమే కాకుండా ఆ పార్టీ నాయకుడిగా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతకాలం కేవలం రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు నేరుగా […]

Written By:
  • NARESH
  • , Updated On : April 20, 2022 / 09:10 AM IST
    Follow us on

    Prashanth Kishore: దేశంలోనే పాపులర్ రాజకీయ వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు జోరందుకుంటున్నాయి. ఇటీవల ఆయన పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమనే తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ అధికారంలోకి రావడానికి తోడ్పడిన పీకే ఇప్పుడు కాంగ్రెస్ కోసం పనిచేయడమే కాకుండా ఆ పార్టీ నాయకుడిగా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో ఇంతకాలం కేవలం రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు నేరుగా పార్టీ నాయకుడిగా ఎందుకు మారాలనుకుంటున్నాడు…? అంతేకాకుండా ప్రాంతీయ పార్టీల కోసం పనిచేసి.. ఆ పార్టీలను అధికారంలో కూర్చోబెట్టిన పీకే.. కాంగ్రెస్ కోసం ఎందుకు ఆరాటపడుతున్నాడన్న దానిపై స్పెషల్ ఫోకస్..

    Prashanth Kishore, Sonia, Rahul

    నెల కిందట ఓ ప్రకటనలో ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీపై పరోక్షంగా విమర్శలు చేశారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బలం సరిపోదన్నారు. అంతేకాకుండా ప్రజలు మోదీపై ఆగ్రహంతో ఉన్నారని, ఆయనను ఓడిస్తారని కాంగ్రెస్ నేతలు భ్రమపడద్దని సూచించారు. రాహుల్ గాంధీకి బీజేపీని తరిమేయడం సాధ్యం కాదని పీకే అన్నారు. ఇక ‘మీరు మోదీని అర్థం చేసుకోకపోతే అయన బలాన్ని అర్థం చేసుకోలేరు.. ఆయనను ఓడించడానికి వ్యూహం రచించలేరు..’ అని పీకే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఓడినా.. గెలిచినా.. కేంద్రంలో కీలకంగా ఉంటుందని సెలవిచ్చారు.

    ఓ వైపు ఇలా బీజేపీ బలాన్ని నేరుగా గుర్తు చేస్తూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ ధీన వ్యవస్థలో ఉందని ప్రశాంత్ కిశోర్ చెప్పకొచ్చారు. అయితే కొన్ని రోజుల కిందట ఢిల్లీలో ప్రముఖ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఆ తరువాత సోనియా గాంధీతో సమావేశమై పలు విషయాలను చర్చించారు. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలతో పాటు గుజరాత్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను టార్గెట్ చేసుకోవాలని సోనియాగాంధీ చెప్పారు. అయితే రాజకీయ వ్యూహకర్తగా కాకుండా పార్టీ నాయకుడిగా ఉంటే ఇది సాధ్యమని పీకే చెప్పడంతో అందుకు సోనియా గాంధీ అంగీకరించారు.

    Also Read: BJP : టీఆర్ఎస్ దాష్టీకాలపై బీజేపీ సమరశంఖం

    ప్రాంతీయ పార్టీలను అధికారంలో కూర్చోబెట్టిన పీకే కాంగ్రెస్ పార్టీ వైపు ఎందుకు మనసు పడింది..? అనే విషయంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. బీహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ ఆర్జేడీ పార్టీలో కొంతకాలం కొనసాగాడు. అయితే కొన్ని కారణాల వల్ల పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే మళ్లీ ఆయనను ఆహ్వానించినా ఆ పార్టీలోకి వెళ్లడానికి సుముఖత చూపలేదు. అంతేకాకుండా 2017లో ఇక్కడ కాంగ్రెస్ కోసం పీకే రచించిన వ్యూహం సక్సెస్ కాలేదు. దీంతో ఏ పార్టీలో ఉండలేకపోయారు.

    కొన్ని నెలల కిందట జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ కోసం పనిచేసి ఆ పార్టీలను అధికారంలోకి తేవడానికి కృషి చేశారు. దీంతో ఆయన టీఎంసీ లోకి చేరుతారని ప్రాచారం సాగింది. కానీ ఆ వైపు వెళ్లేలేదు. అయితే ప్రాంతీయ పార్టీలతో భాషా సమస్యతో పాటు స్థానిక నాయకులతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పీకే ఆలోచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వైపు తన దృష్టి పెట్టారు. బీజేపీ, కాంగ్రెసేతర కూటమి ఏర్పాటు కావడానికి కొన్ని పార్టీలు ప్రయత్నించాయి. టీఆర్ఎస్, టీఎంసీలు ఈ విషయంలో ముందుకు వచ్చాయి. కానీ ఈ సమయంలో పీకే మాట్లాడుతూ కాంగ్రెసేతర కూటమి అసాధ్యమని చెప్పారు. బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సహకారం తప్పనిసరి అన్నారు. ఇందులో భాగంగా ఆయన జాతీయ పార్టీలో చేరితేనే బీజేపీని కేంద్రంలో దెబ్బ కొట్టొచ్చని ఆలోచిస్తున్నాడు. అందుకే కాంగ్రెస్ లో చేరడానికి యోచిస్తున్నట్టు తెలిసింది. ఇఫ్పటికే రాహుల్ గాంధీ నాయకత్వ సమస్యతో వెనుకబడడంతో ఆలోటును తాను పూడ్చగలనని పీకే భావిస్తున్నట్టు సమాచారం.

    తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం.. పీకేకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో ఇక కాంగ్రెస్ కు ఇక మంచిరోజులు వచ్చాయని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో పీకే ఎలాంటి మాయ చేస్తారో చూడాలి.

    Also Read: CM Kcr- Prashant Kishor: ‘పీకే’ అడుగులు.. కేసీఆర్ గుట్టు కాంగ్రెస్ చేతికి?
    Recommended Videos