Roja Amabati: అవి వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పటి రోజులు.. జగన్ తర్వాత పార్టీలో ఫైర్ బ్రాండ్స్ ఎవరు అంటే రోజా, అంబటి రాంబాబుల పేర్లే చెప్పేవారు. అంతలా వారు మీడియాలో, బయట సందడి చేసేవారు. అప్పటి అధికార టీడీపీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవారు. జగన్ తర్వాత పార్టీలో తెలిసిన ముఖాలు ఎవరయ్యా అంటే అందరూ రోజా, అంబటి పేర్లే చెప్పేవారు. టాప్ మీడియా అంతా వైసీపీ తరుఫున వీరి బైట్స్ తీసుకునేవారు.. కానీ కట్ చేస్తే.. జగన్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరికి ప్రాధాన్యత దక్కలేదు. ఇప్పుడు దక్కేలా కనిపించడం లేదు. దీంతో అంబటి, రోజాలను చూసి పార్టీలో అయ్యో పాపం అంటున్నారట.. పార్టీ కోసం ఇంత కష్టపడ్డ వారికి పదవులు దక్కకపోవడం అన్యాయమంటున్నారు.
రోజాకు మంత్రి పదవి వస్తుందని.. ఆమె జగన్ తర్వాత హోం మినిస్టర్ గా రాజ్యమేలుతుందని అంతా అనుకున్నారు. రోజా హోం మినిస్టర్ అని సోషల్ మీడియా హోరెత్తింది. ఎందుకంటే జగన్ తండ్రి, మాజీ సీఎం వైఎస్ఆర్ కూడా సీఎం అయ్యాక.. చేవెళ్ల ఎమ్మెల్యే అయిన అప్పటి సబితా ఇంద్రారెడ్డిని హోం మినిస్టర్ చేశాడు. ఇప్పుడు జగన్ కూడా అదే పనిచేయబోతున్నాడని అందరూ అనుకున్నారు. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయ్యింది.
తొలిసారి సామాజిక సమీకరణాలు అంటూ ముక్కు మొహం తెలియని వారికి.. మొదటిసారి గెలిచిన వారికి సీఎం జగన్ మంత్రి పదవులు ఇచ్చి రోజా, అంబటి, ధర్మాన ప్రసాద్ రావు, భూమన కరుణాకర్ లాంటి ఎంతో మంది సీనియర్లను అగ్రవర్ణాలని పక్కనపెట్టారు. ఇక ఇది తీవ్ర విమర్శలు రావడంతో రోజాకు ‘ఏపీఐఐసీ’ చైర్మన్ పదవి ఇచ్చి కూల్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పదవి నుంచి కూడా కాలపరమితి ముగియడంతో తీసేసి వేరొకరికి ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత పూర్తి మంత్రివర్గ ప్రక్షాళన ఉంటుందని.. అప్పుడు వీరికి చాన్స్ ఇస్తామని జగన్ నాడు ప్రమాణ స్వీకారం రోజు హామీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే రెండున్నరేళ్లు పూర్తయ్యాయి. ఉన్న వారిని తొలగించి కొత్త కేబినెట్ మంత్రులను తీసుకునేందుకు జగన్ సిద్ధమయ్యారు. మంత్రివర్గంలో ఈసారి అంబటి, రోజాకు చోటు ఖాయమని వార్తలు వచ్చాయి. గుంటూరు జిల్లా కోటాలో అంబటికి కన్ఫామ్ అనుకున్నారు. 1989లో తొలిసారి రేపల్లె నియోజకవర్గం తరుఫున ఎన్నికైన అంబటి.. చాలా ఏళ్లకు తాజాగా ప్రస్తుతం సత్తెనపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎప్పటి నుంచో వైసీపీకి, జగన్ కు నమ్మిన బంటుగా ఉన్నారు. పార్టీ సిద్ధాంతాలు జనంలోకి తీసుకెళ్లేందుకు తెగ తాపత్రాయపడ్డారు. వైఎస్ఆర్ కుటుంబానికి వీరవిధేయుడిగా ఉన్నారు. అయితే అంబటికి ఈసారి కూడా మంత్రి పదవి దక్కడం కష్టమేనంటున్నారు. ఈయనకు బదులుగా ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్యే రజినీ పేరు కూడా మంత్రి పదవి కోసం వినిపిస్తోంది.ఇక ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మైనార్టీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు చాన్స్ ఉందని అంటున్నారు. ఈ ముగ్గురిలో అంబటికి ఈసారి మంత్రి పదవి కష్టమేనని అంటున్నారు. ఈసారి రజినీకి కానీ.. మైనార్టీ ఎమ్మెల్యేకు మహిళా కోటాలో ఇవ్వాలని జగన్ డిసైడ్ అయినట్టు సమాచారం.
ఇక నగరి ఎమ్మెల్యే రోజాది చిరకాల వాంఛ. ఆమె మంత్రి కావాలని ఆమెతోపాటు అందరూ కోరుకుంటున్నారు. వైసీపీలోనే ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ అయిన రోజా విపక్షంలోనే చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అని అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. జగన్ తర్వాత వైసీపీలో టీడీపీకి ఎక్కువగా టార్గెట్ అయ్యింది రోజానే. అలాంటి ఆమెకు ఈసారి అయినా మంత్రి పదవి రావాలని అందరూ కోరుకుంటున్నారు. విపక్షంలో ఉన్నప్పుడు అన్నీ తానై జగన్ తరుఫున పోరాడిన రోజాకు టీడీపీ నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వార్తల్లో నిలిచారు. కానీ ఇప్పుడు మంత్రి పదవి దక్కకపోవడంతో రోజా టీవీ షోలు చేసుకుంటూ సైలెంట్ అయ్యారు.
ప్రస్తుతం రోజాకు కూడా మంత్రి పదవి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే జగన్ కు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉన్న పెద్దిరెడ్డి చిత్తూరు జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు. రోజా ప్రాతినిధ్యం వహించే ‘నగరి’ నియోజకవర్గాన్ని కూడా ఇటీవల కొత్త జిల్లాల్లో చిత్తూరులోనే కలిపేశారు. నిజానికి రోజా తన ‘నగరి’ని తిరుపతిలో కలుపాలని ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్ మన్నించలేదు. సో ఒకే జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కష్టం. చిత్తూరులో ఆల్ రెడీ సీనియర్ పెద్దిరెడ్డికి మరోసారి జగన్ మంత్రి పదవి ఇవ్వడం ఖాయం. ఆయనను తొలగించే సాహసం చేయడు. కనుక రోజాకు ఈసారి కూడా మంత్రి పదవి దక్కడం కష్టమేనంటున్నారు.
పెద్దిరెడ్డి వర్గంతో యుద్ధం చేస్తున్న రోజుకు ఈసారి ఆయన ఎట్టి పరిస్థితుల్లో మంత్రి పదవి ఇస్తే ఊరుకునే రకం కాదు. జగన్ కూడా జిల్లాకు ఒక్కటే మంత్రి పదవి కావడంతో చిత్తూరు నుంచి పెద్దిరెడ్డిని తొలగించి రోజాకు ఇచ్చే ఛాన్స్ లేదు. సో నగరిని చిత్తూరులో కలిపేసుకొని ఆమెకు మంత్రి పదవిని పెద్దిరెడ్డినే దూరం చేశారని టాక్ నడుస్తోంది.
ఇలా పార్టీ కోసం పాటుపడ్డ ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ కు ఈసారి కూడా రెండో దఫాలో మంత్రి పదవి దక్కడం కష్టమని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.