BJP Targeted Southern States: దేశ రాజకీయం ఇప్పుడు దక్షిణాది వైపు చూస్తోంది. ఒకప్పుడు జాతీయ పార్టీలు ఇటువైపు రాష్ట్రాలను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కనీసం నిధులు విడుదల చేయడంలోనూ వివక్ష చూపేవారు. కానీ ఇప్పుడు అధికార, ప్రతిపక్ష జాతీయ పార్టీలన్నీ సౌత్ స్టేట్స్ వైపే దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కర్ణాటకలో అధికారంలో ఉన్న ఆ పార్టీ తెలంగాణలోనే పాగా వేయడానికి ప్లాన్ వేస్తోంది.
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పుడు తెలంగాణ ప్రముఖంగా మారింది. ఇక్కడ గత ఎన్నికల నుంచి ఇప్పటి వరకు బీజేపీకి బలం పెరిగింది. దీంతో తెలంగాణ నుంచి దక్షిణాది రాజకీయాలు చేయాలన్నది బీజేపీ ప్లాన్. ఇందులో భాగంగా ఇప్పటికే మోదీ తో సహ ముఖ్య నాయకులంతా ఇప్పటికే తెలంగాణలో పర్యటించారు. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు తెలంగాణలోనే నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు కమలం నాయకులు ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: YCP MP Into Janasena Party: జనసేన పార్టీ లోకి వైసీపీ ఎంపీ.. జగన్ కి ఊహించని షాక్
దుబ్బాక ఉప ఎన్నిక నుంచి బీజేపీ స్ట్రాటజీ పెరిగింది. అప్పటి నుంచి పార్టీ నాయకులు పార్టీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక ఆందోళన చేస్తూ పార్టీని సెకండ్ ప్లేస్ కు తీసుకొచ్చారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలోనూ బీజేపీ క్యాండెట్ ఈటల రాజేందర్ ను గెలిపించుకున్నారు. ఇదే ఊపులో వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలని తహతహలాడుతున్నారు. ఇక ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పాదయాత్రతో గ్రామాల్లోనూ కమలానికి ఊపు తెచ్చారు.
ఈ నేపథ్యంలో కేడర్లో జోష్ పెంచేందుకు కేంద్ర నాయకులు సైతం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రతీ విషయంపై స్పందిస్తున్నారు. అవసరమైతే నేరుగా వస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్లోనే నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాలతో పార్టీకి మరింత బలం చేకూరుతుందని పెద్దల ప్లాన్. ఇప్పటి నుంచి కసరత్తు మొదలుపెడితే ఎన్నికల వరకు ప్రజల్లోకి వెళ్లేందుకు ఈజీగా మారుతుందని అనుకుంటున్నారు. వచ్చేనెల మొదటి వారంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు మొదలు కానున్నాయి. ఈ సమావేశాల ద్వారా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పనున్నారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదే సమయంలో పార్టీలోకి కొత్తవారిని చేర్చుకోవాలని అధిష్టానం సూచిస్తోంది. కానీ రాష్ట్ర నాయకత్వ ఆ విషయంలో పురోగతి సాధించడం లేదు. హూజూరాబాద్ ఉప ఎన్నికతో పార్టీకి అధిక బలం చేకూరినా కొత్త నాయకులెవరూ రాలేదు. అందులోనూ కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఎందుకంటే స్థానిక నాయకుల్లో కొందరు కొత్తవారిని చేర్చుకుంటే తాము పట్టుకోల్పోతామని ఆలోచిస్తున్నారు. దీంతో కొందరు పార్టీలో చేరుదామని అనుకున్నా స్థానిక సమస్యలతో అటువైపు చూడడం లేదు.
కానీ రేపు జరగబోయే సమావేశాల్లో కొంతమందిని పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానం సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కొందరు నేతలను సంప్రదించినట్లు సమాచారం. తమ పార్టీ అధికారంలో వస్తే ఏం చేస్తామో ముందే చెబుతోంది. ఒకవేళ అధికారంలోకి రాకున్నా పార్టీ పదవుల గురించి వివరిస్తున్నారు. మొత్తంగా ఏదో రకంగా కొత్తవారిని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ నాయకులు తలమునకలయ్యారు.
Also Read:TDP : మొదటి బాణం సంధించిన టీడీపీ..