Balakrishna vs Nagarjuna : బాలయ్య అక్కినేని కుటుంబం మీద ఇటీవల కాలం లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ఎలాంటి దుమారం ని రేపాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కినేని ఫ్యాన్స్ కూడా బాలయ్య పై చాలా తీవ్రంగా విరుచుకుపడ్డాయి..పలు చోట్ల బాలయ్య దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేశారు..ఇంత జరిగిన తర్వాత బాలయ్య దీనిపై స్పందించి వివాదానికి ఫుల్లు స్టాప్ పెడుతాడు అనుకుంటే అక్కినేని ఫ్యాన్స్ ని మరింత రెచ్చగొట్టాడు..బాబాయ్ నాగేశ్వరరావు అంటూనే ఆయన కుటుంబ సభ్యులపై పరోక్షంగా సెటైర్లు వేసాడు.

‘బాబాయి నాగేశ్వరరావు నన్ను సొంత బిడ్డలకంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేవారు.ఎంతో ఆప్యాయతగా పలకరించేవాడు..ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఆయనకీ ఆప్యాయత దొరకడం లేదు..నా దగ్గరే దొరుకుంటుంది అన్నట్టుగా మాట్లాడాడు..అంటే ఆయన ఉద్దేశ్యం నాగార్జున కి నాగేశ్వరరావు మీద ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేవని..ప్రత్యేకంగా నాగార్జునని బాలయ్య ఇలా టార్గెట్ చెయ్యడానికి కారణం ఏమిటి..వీళ్లిద్దరి మధ్య ఏమి జరిగింది అనేది ఇప్పుడు మనం ఈ కథనం లో చూడబోతున్నాము.
ఇంతకీ బాలయ్య బాబు కి నాగార్జున మీద అంత కోపం ఉండడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి కి మొదటి నుండి నాగార్జున భజన చెయ్యడమే..పలు సందర్బాలలో చిరంజీవిని టాలీవుడ్ నెంబర్ 1 హీరో అని చెప్పాడు..అది బాలయ్య బాబు ఈగోని బాగా హార్ట్ చేసింది..కేవలం ఆ కారణం చేతనే బాలయ్య బాబుకి నాగార్జున అంటే కోపం అంటున్నారు ఇండస్ట్రీ లో కొంతమంది.
మరికొంత మంది చెప్పేది ఏమిటంటే బాలయ్య బాబు ఆహా లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో కి నాగార్జున ని ముఖ్య అతిథిగా బాలయ్య బాబు స్వయంగా ఆహ్వానించినప్పటికీ రాలేదని..అందుకు బాలయ్య మనసు నొచ్చుకుందని..ఇంతకు ముందు నాగార్జున మీద అతనికి ఉన్న కోపాన్ని మరింత రెట్టింపు అయ్యేలా చేసిందంటున్నారు విశ్లేషకులు..ఏది ఏమైనా ఇండస్ట్రీ కి మూలస్థంబాలు లాంటి ఈ రెండు కుటుంబాలు ఇలా గొడవలు పడడం అభిమానులకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని..దయచేసి ఈ వివాదానికి ఎండ్ కార్డు వెయ్యండి అంటున్నారు ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు.