https://oktelugu.com/

Economic Growth: భారత్ ఆర్థిక వృద్ధి ఎందుకు ఆగిపోయింది? అడ్డంకులు ఏమిటీ?

Economic Growth: ప్రపంచంలో ఆర్థికాభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది ఒకప్పటి మాట. దశాబ్దాలు గడుస్తున్నా ఈ స్థానం నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఇండియా మారడం లేదు. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఉన్నత స్థితిలోకి రావడం లేదు. వృద్ది మాట అటుంచితే ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగింది. 2022 జనవరి నుంచి మార్చి వరకు వరుసగా ధరలు పెరిగి ద్రవ్యోల్భణం 6 శాతంగా నమోదైంది. దీంతో […]

Written By:
  • NARESH
  • , Updated On : June 1, 2022 / 09:34 AM IST
    Follow us on

    Economic Growth: ప్రపంచంలో ఆర్థికాభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఇది ఒకప్పటి మాట. దశాబ్దాలు గడుస్తున్నా ఈ స్థానం నుంచి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఇండియా మారడం లేదు. ప్రభుత్వాలు మారినా.. పరిస్థితులు ఎలా ఉన్నా.. భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఉన్నత స్థితిలోకి రావడం లేదు. వృద్ది మాట అటుంచితే ద్రవ్యోల్భణం విపరీతంగా పెరిగింది. 2022 జనవరి నుంచి మార్చి వరకు వరుసగా ధరలు పెరిగి ద్రవ్యోల్భణం 6 శాతంగా నమోదైంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సంలో 7.9 శాతంగా లక్ష్యంగా పెట్టుకున్న జీడీపీ 7.6 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో అసలు భారత ఆర్థిక వ్యసస్థ ఇలా మారడానికి కారణం ఏమిటి..? ఆర్థికాభివృద్ధి ఎందుకు ఆగిపోయింది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

    Economic Growth

    కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన గణాంకాల ప్రకారం.. 2022 జనవరి నుంచి మార్చి వరకు జీడీపీ వృద్ధి రేటు 4.1 శాతంగా నమోదైంది. అంతకుముందు అక్టోబర్, డిసెంబర్ మధ్య 5.3 గా ఉండేది. అయితే జనవరి నుంచి జీడీపీ వృద్ధి రేటు తగ్గడానికి కొనుగోలు శక్తి పడిపోవడమేనని తెలుస్తోంది. అందుకు ద్రవ్యోల్భణమే కారణం. వీటికి తోడు ఉక్రెయిన్, రష్యా యుద్ధంతో గూడ్స్ సప్లయ్ కు అంతరాయం ఏర్పడడం, వస్తుసేవలపై ధరలు పెరిగాయి. 2021-2022లో ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక కార్యకలాపాలు బాగా తగ్గాయి. భౌగోళికంగా కొన్ని వస్తువుల కొరత కారణంగా అధిక ధరలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఉక్కు, ప్లాస్టిక్ వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.

    Also Read: Hardik Pandya: టీమిండియాకు మరో కపిల్ దేవ్ దొరికినట్టేనా?

    ఇదిలా ఉండగా భారత్ లో ద్రవ్యోల్భణం ఎనిమిది సంవత్సరాల గరిష్ఠ స్థాయికి పెరిగింది. ఎక్కువగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా మిగతా రంగాలపై ప్రభావం పడింది. ఫలితంగా బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రోజువారీ వినియోగ వస్తు సేవల ధరలు పెరిగాయి. 2022 జనవరి నుంచి మార్చి త్రైమాసిక సంవత్సరంలో వరుసగా నాలుగు నెలల పాటు ధరల పెరుగుదల కొనసాగింది. ఈ కాలంలో ద్రవ్యోల్భణం 6 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్భణానికి ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణమైంది. భారత్ కు అందాల్సి వస్తువులు సరైన సమయంలో రాకపోవడంతో ఉన్నవాటిపై భారం పెరిగింది. దీంతో ద్రవ్యోల్భణం తప్పలేదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.

    మోర్గాన్ స్టాన్లీ ప్రకారం ద్రవ్యోల్భణం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థికవృద్ది రేటు 7.9 శాతం నుంచి 7.6 శాతానికి తగ్గింది. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం.. భారత జీడీపీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది. అయితే ప్రభుత్వం 8.9 శాతం లక్ష్యంగా పెట్టుకుంటే అంతకు తక్కువగానే నమోదు కావడం గమనార్హం. 2021-2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 5.3 శాతంగా నమోదైంది. అయితే 2020-2021లో 6.6 శాతంగా ఉంది.

    Economic Growth

    ద్రవ్యోల్భణం కారణంగా చిన్న పరిశ్రమలు కుచించుకుపోయాయి. కిచెన్ సామగ్రి తయారు చేసే ఫ్యాక్టరీలు చాలా నష్టపోయానని నిర్వాహకులు తెలుపుతున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి ఉక్కు రేటు విపరీతంగా పెరగడంతో ఒకటిన్నర రేట్లు ఎక్కువ ధర పెట్టాల్సి వచ్చిందని ముంబైలోని నిర్వాహకులు తెలుపుతున్నారు. అధిక ధరల కారణంగా ఎక్కువగా ఉక్కు కొనలేకపోయామని, దీంతో కొన్ని ప్లాంట్లు మూసివేయాల్సి వచ్చిందని అంటున్నారు. ఈ ప్రభావం కార్మికులపై పడి వారికి ఉపాధి కరువైందని అంటున్నారు. అత్యధికంగా శ్రామికులు ఉండే వ్యవసాయ రంగంలో కాస్త వృద్ది కనిపించినా ఎరువులు, వాతావరణ పరిస్థితులపై అనుమానాలు నెలకొనడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటులో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే వాణిజ్యం, హోటళ్లు, కమ్యూనికేషన్ వంటి సేవలు నాలుగో త్రైమాసికంలో 5.3 శాతంగా నమోదైంది. గత త్రైమాసికంలో ఇది 6.3 శాతంగా ఉంది.

    ఆర్థికాభివృద్ధి చెందుతున్న జాబితాలోనే ఉంటున్న భారత్ లో పెట్టుబడులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియాలో 7 శాతం నుంచి 8 శాతానికి వృద్ధి రాకపోవడానికి కారణం ఏమీ లేదని, అయితే పెట్టుబడులు పెట్టేందుకు అనేక ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయంటున్నారు. రోడ్లు, రైల్వేలు, ఓడరేవులు, విద్యుత్ వంటి వాటిపై ప్రభుత్వం ఎక్కువ మోతాదులో వెచ్చించినా.. ఆ రంగాల నుంచి ఆశించిన ఫలితాలు రాలేకపోయాయని అబ్జర్వేటరీ గ్రూప్ సీనియర్ అనలిస్ట్ అనంత్ నారాయణ్ ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

    Also Read:Imd- Monsoon: వర్షాల విషయంలో వాతావరణ శాఖ విరుద్ధ ప్రకటనలకు అర్థమేమిటో?

    Recommended Videos:


    Tags