Homeజాతీయ వార్తలుCommunist Parties Decline: కాలనుగుణంగా మారని కమ్యూనిస్టులు.. పతనానికి కారణం ఇదే!

Communist Parties Decline: కాలనుగుణంగా మారని కమ్యూనిస్టులు.. పతనానికి కారణం ఇదే!

Communist Parties Decline: భారత రాజకీయ చరిత్రలో ఒకప్పుడు శక్తివంతమైన శక్తిగా, పేద ప్రజల గొంతుకగా నిలిచిన కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు నామమాత్రంగా మిగిలాయి. ప్రజల తరఫు, కార్మికుల తరఫున ఎన్నో పోరాటాలుచేసి, హక్కుతు సాధించిన కమ్యూనిస్టులను ఇప్పుడు పట్టించుకునేవారు తగ్గిపోతున్నారు. ఉద్యమాల వరకు మాత్రమే వాటిని ఆదరిస్తున్నారు. ప్రజా ప్రదినిధులుగా చట్ట సభలకు మాత్రం పంపడం లేదు. ఇందుకు కారణం వారు అనుసరిస్తున్న బూర్జువా విధానాలే. తాజాగా సీపీఎం (కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా – మార్క్సిస్ట్‌) నేత ప్రకాశ్‌ కారత్‌ విజయవాడలో చేసినవ్యాఖ్యలు ఈ పార్టీల పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రధాని మోదీ విదేశాంగ విధానంపై, ముఖ్యంగా పశ్చిమాసియా యుద్ధంపై భారత వైఖరిపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. కానీ ఈ విమర్శలు వాస్తవ భౌగోళిక రాజకీయాలకు దూరంగా, ఆదర్శవాదపు కోణంలోనే ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ఏంటి ఈ బౌలింగ్ తో ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తారా.. బ్యాగులు సర్దుకుని ఇంటికి వచ్చేయండి

కారత్‌ చేసిన విమర్శలు ఇవీ..
ప్రధాని మోదీ అమెరికాకు సాగిలపడ్డారని కారత్‌ ఆరోపించారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులను భారత్‌ ఖండించకపోవడాన్ని ఆక్షేపించారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ హత్యను ఖండించకపోవడంపై విమర్శలు చేశారు. పశ్చిమాసియా యుద్ధంపై భారత వైఖరిని ‘దారుణం‘గా ఉందని అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు వినడానికి భావోద్వేగపూరితంగా అనిపించినా, వాస్తవ భౌగోళిక రాజకీయాల దృష్ట్యా ఇవి అప్రాయోగికం. భారత్‌ ప్రస్తుతం బహుళ ధ్రువాల విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది. ఇరాన్‌తో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇజ్రాయెల్‌తో రక్షణ సహకారం దేశ జాతీయ ప్రయోజనాలకు కీలకం.

వాస్తవ పరిస్థితి ఏమిటి?
రష్యాతో భారత్‌ స్నేహంపై ఇప్పటికే అమెరికా అసంతృప్తిగా ఉంది. టారిఫ్‌లు, ఆర్థిక ఒత్తిళ్లు విధిస్తోంది. ఇరాన్‌ దాడులను ఖండిస్తే అమెరికా మరింత ఆగ్రహించి, పాకిస్తాన్‌ను చేరదీసే ప్రమాదం ఉంది. ఇక ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఇజ్రాయెల్‌ భారత్‌కు ఆయుధ సాయం అందించింది. ఇరు దేశాల మధ్య రక్షణ, వ్యవసాయం, సాంకేతిక రంగాల్లో గాఢమైన సహకారం ఉంది. ఇజ్రాయెల్‌ దాడులను ఖండిస్తే ఈ సత్సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.ఇరాన్‌తో భారత్‌కు చమురు సరఫరా, చాబహార్‌ ఓడరేవు వంటి వ్యూహాత్మక అవసరాలు ఉన్నాయి. కానీ కశ్మీర్‌ అంశంలో ఇరాన్‌ పాకిస్తాన్‌కు మొగ్గుచూపడం గమనార్హం. కశ్మీరీలు ఇరాన్‌ ప్రజలకు విరాళాలు పంపించగా, ఇరాన్‌ కశ్మీర్‌ను, భారత్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని ట్వీట్‌ చేసింది. దీనికి పాకిస్తాన్‌ అభ్యంతరం చెప్పగానే ఆ ట్వీట్‌ను తొలగించింది. ఇది ఇరాన్‌ ప్రాధాన్యతలను స్పష్టం చేస్తుంది.

ఒకప్పుడు బలమైన కమ్యూనిస్టులు..
దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీలు ఒకప్పుడు బలంగా ఉండేవి. ఈశాన్య రాష్ట్రాలు, కేరళలో అధికారంలో ఉండేవి. కానీ కాలానుగుణంగా మారకపోవడం, పాత విధానాలనే అవలంబిస్తుండడంతో కమ్యూనిస్టులకు ఆదరణ తగ్గుతోంది. 2004లో సీపీఎంకు 40కిపైగా ఎంపీలు ఉన్నారు. నాడు యూపీఏ ప్రభుత్వం సీపీఎం మద్దతుతోనే ఏర్పడింది. కానీ 2014 నాటికి 9 సీట్లకు పడిపోయింది. 2019లో కేవలం 3 సీట్లు గెలిచింది. 2024లో 4 స్థానాల్లో విజయం సాధించింది.

కమ్యూనిస్టులు మారకపోవడానికి కారణాలు..
కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ 20వ శతాబ్దపు ఆదర్శాలతోనే బతికున్నాయి. మారుతున్న భౌగోళిక రాజకీయాలను, వ్యూహాత్మక అవసరాలను అర్థం చేసుకోలేకపోతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, భారత ఆర్థిక వ్యవస్థ మార్పులకు అనుగుణంగా తమ సిద్ధాంతాలను మార్చుకోలేదు. దేశ అభివృద్ధిలో నిర్మాణాత్మక పాత్ర పోషించే సామర్థ్యం కమ్యూనిస్టులకు ఉంది. కానీ వారు ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రకే పరిమితమయ్యారు. విమర్శలు చేయడం తప్ప, పరిష్కారాలు సూచించడంలో విఫలమయ్యారు. ‘నేలవిడచి సాము చేయడం‘ వల్ల ప్రజాదరణ కోల్పోయారు. సీపీఎం, సీపీఐల మధ్య మాత్రమే కాకుండా, పార్టీల లోపల కూడా తీవ్ర విభేదాలు ఉన్నాయి.

ఒకప్పుడు కార్మికులు, రైతాంగం మధ్య బలమైన పునాది ఉన్న కమ్యూనిస్టు పార్టీలు, ఇప్పుడు ఆ వర్గాల నుంచి కూడా దూరమయ్యాయి. ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమాలు, రైతు పోరాటాల్లో పార్టీల పాత్ర క్షీణించింది. భారత్‌ కమ్యూనిస్టు విధానాలను అనుసరిస్తే చాలా దేశాలకు దూరమయ్యే ప్రమాదం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular