Kapu Community : ఆంధ్రా రాజకీయాల్లో కుల సమీరణాలు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఎన్ని సిద్ధాంతాలు బయటకు వచ్చినా.. ఆంధ్ర రాజకీయాల్లో ఇప్పటివరకూ రెండు సామాజికవర్గాలే అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటున్నాయి. దీంట్లో సిద్ధాంతాలే కాదు.. సామాజిక పరమైన అంశాలు కూడా కీలకంగా ఉంటాయి.
అత్యధిక సంఖ్యాపరంగా ఉన్న కాపు సామాజికవర్గం ఈసారి ఏపీ ఎన్నికల్లో ఎటువైపు ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ.. మద్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్రాలో కానీ..2014 తర్వాత ఆంధ్రా కానీ ఏనాడు కాపు నేతలు ముఖ్యమంత్రులు కాలేరు. ఇప్పటికీ దాన్ని సాధించుకోవడం అందని ద్రాక్షగా మారింది.
చివరకు 2009లో కాపుల ఆశాదీపంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయనను ఎదగనీయకుండా నాటి రెడ్డి, కమ్మ నేతలు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి పార్టీని నాశనం చేశారో చూశాం. చివరకు చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేశారు.
ఈ క్రమంలోనే ఈసారి కాపు సామాజికవర్గం నాయకుడివైపా? నాయకులవైపా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..