Huzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నికపై (Huzurabad Bypoll) పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నా పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ అంత దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ప్రకటనపై తాత్సారం చేస్తోందని ప్రచారం సాగుతోంది. కానీ వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా ఎవరికి లాభం అని ప్రశ్నిస్తోంది. దీంతోనే పోటీకి అంతగా ప్రభావం చూపలేకపోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకే ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో ఇప్పుడే ఎన్నిక నిర్వహించాలని చూస్తున్నా నోటిఫికేషన్ ఆలస్యమవడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ దళితబంధు పేరుతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. సానుభూతి తనకే ఉందని ఈటల తన గెలుపు ఖాయమని చెబుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికతో తమ బలాబలాలు ఏమిటో చూపించుకోవాలని చూస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.
నియోజకవర్గ వ్యాప్తంగా ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర పేరుతో పర్యటన చేసి తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. తన గెలుపును ఏ పార్టీ కూడా అడ్డుకోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరి దృష్టి పడుతోంది. రాజేందర్ కు మంచి ఆదరణ లభిస్తున్నా ప్రచారంలో కూడా ఎవరు తగ్గకుండా చూసుకున్నారు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇప్పుడు వస్తే బీజేపీకి లాభం కలుగుతుందని ఇంటలిజెన్స్ రిపోర్టు వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా నిర్వహించాలని చూస్తున్నా నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఉప ఎన్నిక రిపోర్టులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం అసాధ్యమనే విషయాలు వచ్చినట్లు సమాచారం. దీంతో కరోనా సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి.
ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదాపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ప్రజల సానుభూతి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఈటల రాజేందర్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. అధికార పార్టీ కూడా అంతే స్థాయిలో సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఇందుకోసం ఇరు పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.