https://oktelugu.com/

AP Cassino Issue: ఏపీ ‘క్యాసినో’ వ్యవహారంలో ఏది నిజం..? ఏదీ అబద్ధం..?

AP Cassino Issue: ఏపీ రాజకీయాలు ఇప్పుడు ‘క్యాసినో’ చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అధికార పార్టీ మంత్రి ఒకరు క్యాసినో నిర్వహించారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గుడివాడ కేంద్రంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ తతంగం నడిపించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే నిజ నిర్దారణ కోసం ఆ పార్టీ నాయకులు గుడివాడ కు వెళ్లేందుకు ప్రయత్నించగా వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను […]

Written By:
  • NARESH
  • , Updated On : January 26, 2022 / 09:00 AM IST
    Follow us on

    AP Cassino Issue: ఏపీ రాజకీయాలు ఇప్పుడు ‘క్యాసినో’ చుట్టూ తిరుగుతున్నాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా అధికార పార్టీ మంత్రి ఒకరు క్యాసినో నిర్వహించారని ప్రతిపక్షాల నాయకులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా గుడివాడ కేంద్రంగా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో ఈ తతంగం నడిపించారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే నిజ నిర్దారణ కోసం ఆ పార్టీ నాయకులు గుడివాడ కు వెళ్లేందుకు ప్రయత్నించగా వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరు పార్టీల నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం సంచలనంగా మారింది. అయితే ప్రతీ సంక్రాంతి సంబరాల్లో కోళ్ల పందేలు, జూదం ఎలాగూ ఉంటాయి. కానీ ఈసారి కొత్తగా క్యాసినో నిర్వహించడం.. ఉత్తరాధికి చెందిన అమ్మాయలతో జూదం ఆడించాని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ ఉద్యమంలోకి ఏపీ బీజేపీ కూడా దిగడంతో రచ్చ రచ్చ అవుతోంది. ఇంతకీ ఏపీ ‘క్యాసినో’ వ్యవహారంలో ఏది నిజం..? ఏదీ అబద్ధం..?

    ఏసెస్ అనే సంస్థ విజయవాడ సమీపంలో తాము క్యాసినో నిర్వహించామని చెబుతూ ఇన్ స్ట్రాగ్రామ్లో కొన్ని వీడియోలను పెట్టింది. ఈ వీడియోలో విజయవాడ అని తెలియకపోయినా అందులో తెలుగు మాటలే వినిపిస్తున్నాయి. లోకేషన్ కూడా తెలుగు రాష్ట్రాలకే చెందినదిగా కనిపిస్తున్నాయి. కానీ ఇందులో ఎక్కువగా ఉత్తరాది అమ్మాయిులు కనిపిస్తున్నారు. మరోవైపు బ్యాక్ రౌండ్ తెలుగు పాట వినిపిస్తుండడంతో ఇది ఏపీకి చెందినదేనని కొందరు కామెంట్లు పెడుతున్నారు. అయితే మంత్రి కొడాలి నాని మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.

    సాధారణంగా ప్రతీ సంక్రాంతిలో కోళ్ల పందేలు నిర్వహిస్తుంటారు. దీనిపై నిషేధం ఉన్నా.. ప్రభుత్వాలు కూడా ప్రజల సరదాను దృష్టిలో పెట్టుకొని చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. కోళ్ల పందేలతో పాటు గుండాటలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కొత్తగా క్యాషినో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా కోళ్ల పందేలు, గుండాటలు ఓపెన్ ప్లేసులో ఏర్పాటు చేస్తారు. కానీ క్యాషినోవాను ఓ భవనంలో ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. రంగరంగుల టేబుళ్లు ఏర్పాటు చేసి వాటి ముందు ఉత్తర భారతదేశానికి చెందిన అమ్మాయిలు కూర్చుని ఉన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సినిమా సెట్ లాంటి హంగులతో,ప్రత్యేకంగా అలంకరించిన చోట, జూదాల వీడియోల్లో సాధారణంగా కనిపించిన విధంగా అమ్మాయిలు జూదం ఆడించడం అందరికీ ఆసక్తి కలిగించింది.

    పండుగ సమయంలో జూదం అందరికీ తెలిసిందే. కానీ ఈసారి క్యాసినో తరహాలో జూదం నిర్వహంచడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదంతా మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలోనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. మంత్రి సొంత కల్యాణ మండపంలో ఈ జూదం నిర్వహించారని ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగా నిజ నిర్దారణ తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ తరుపున ఓ బృందం గుడివాడకు వెళ్లింది. కానీ ఇరు పక్షాలు పోటా పోటీగా రోడ్డెక్కడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగింది.

    అయితే ‘తాన కల్యాణ మండపంలో క్యాసినో నిర్వహించానని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా’నని మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం తమ దగ్గర ఆరోపణలున్నాయని, నిరూపించకపోతే మేము అదే పని చేస్తామని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో విజయవాడ దగ్గర పొంగల్ సందర్భంగా క్యాసినో నిర్వహిస్తున్నట్లు ఏసెన్ అనే కాసినో సంస్థ తన ఫేస్ బుక్లో ప్రకటించింది. అలాగే లోకేశన్ గుడివాడ చూపిస్తోంది. గుడివాడ లో నిర్వహించిన క్యాసినోలో పాల్గొన్న అమ్మాయిల వివరాలను కూడా టీడీపీ బయటపెట్టింది. అందులో టికెట్లు బుక్ చేసిన ఎయిర్ లైన్స్ నంబర్లు, వారు విజయవాడ మీదుగా బెంగులూరు, గోవా వెళ్లినట్లు విమానం వివరాలను వారి పేర్లతో టీడీపీ నేత వర్ల రామయ్య మీడియాకు రిలీజ్ చేశారు.