Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై టీడీపీ అభ్యర్థి ఆయనే

Vallabhaneni Vamsi: ఎన్నికలన్నాక రాజకీయ వ్యూహాలు కామన్. కానీ ఇప్పుడు ఎన్నికలన్న కాన్సెప్టే లేకుండా నాయకులకు చెక్ చెప్పాలని చూస్తున్నారు. పలానా నాయకుడ్ని అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అన్ని పార్టీలు ఇలా టార్గెట్ చేసిన నాయకులు ఉన్నాయి. అయితే టీడీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. ఇందులో నాని వైసీపీ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కూడా. […]

Written By: Dharma, Updated On : March 6, 2023 11:45 am
Follow us on

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi: ఎన్నికలన్నాక రాజకీయ వ్యూహాలు కామన్. కానీ ఇప్పుడు ఎన్నికలన్న కాన్సెప్టే లేకుండా నాయకులకు చెక్ చెప్పాలని చూస్తున్నారు. పలానా నాయకుడ్ని అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. అన్ని పార్టీలు ఇలా టార్గెట్ చేసిన నాయకులు ఉన్నాయి. అయితే టీడీపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇద్దరు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్. ఇందులో నాని వైసీపీ ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి కూడా. టీడీపీ నుంచి రెండుసార్లు, వైసీపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత దశాబ్ద కాలంగా వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వంశీ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి.. వైసీపీకి ఫిరాయించారు. అప్పటి నుంచి చంద్రబాబు, లోకేష్ లతో పాటు టీడీపీ నాయకులపై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అందుకే ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు వారికి బద్ధ శత్రువులుగా మారారు.

Also Read: Kotam Reddy- Anam Ramanaraya Reddy: కోటంరెడ్డి, ఆనంల విషయంలో మారిన టీడీపీ స్ట్రాటజీ

అయితే వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరి నాయకులను చెక్ చెప్పాలని చంద్రబాబు వ్యూహాలు రూపొందిస్తున్నారు. వారు కూడా తమపై నేరుగా పోటీచేయాలని చంద్రబాబు, లోకేష్ లకు సవాల్ విసురుతున్నారు. దీంతో వీరిపై పోటీకి గట్టి నాయకులను అన్వేషిస్తున్నారు. ముందుగా గన్నవరం పంచాయతీని తేల్చేయాలని చూస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గ ఇన్ చార్జిగా బచ్చుల అర్జునుడు ఉండేవారు.కానీ ఆయన ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ను ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. కానీ వంశీపై పోటీకి ఆయన సరిపోరు. అందుకే కొత్త నాయకుల అన్వేషణలో పడిన చంద్రబాబుకు దేవినేని నెహ్రూ కుటుంబంపై కన్నుపడింది.

గత ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిపై నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ ను చంద్రబాబు ప్రయోగించారు. కానీ నిరాశే ఎదురైంది. ఎన్నికల అనంతరం అవినాష్ వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారు. దేవినేని నెహ్రూ తమ్ముడు కుమారుడు చందును గన్నవరం నుంచి పోటీచేయించాలని చూస్తున్నారు. దివంగ‌త దేవినేని నెహ్రూ సొంత త‌మ్ముడు బాజీ ప్ర‌సాద్ త‌న‌యుడే చందు. బాజీ ప్ర‌సాద్ 2016లో మ‌ర‌ణించారు. బాజీ ప్ర‌సాద్ భార్య అప‌ర్ణ విజ‌య‌వాడ‌లో కార్పొరేట‌ర్‌గా రెండుసార్లు గెలుపొందారు. తెలుగు యువ‌త నాయ‌కుడిగా టీడీపీలో చందు క్రియాశీలకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. లోకేశ్‌కు స‌న్నిహితుడిగా పేరు పొందారు. కాస్త ప‌ద్ధ‌తైన నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని అటు చంద్రబాబు, ఇటు లోకేష్ మొగ్గు చూపినట్టు తెలుస్తోంది.

devineni

గుడివాడ విషయంలో చంద్రబాబు వెనుకా ముందు ఆలోచిస్తున్నారు. జనసేనతో పొత్తు కుదిరితే ఒకలా.. ఒంటరిగా బరిలో దిగితే మరోలా వ్యవహరించడానికి ప్రణాళిక రూపొందించారు. కానీ బలమైన అభ్యర్థిని బరిలో దించడం ఖాయమన్నట్టు ప్రచారం సాగుతోంది. ఇక్కడ రావి వెంకటేశ్వరరావుతో పాటు మరొక ఎన్ఆర్ఐ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఆ ఇద్దర్ని ఒకచోట కూర్చోబెట్టిన చంద్రబాబు వారి మధ్య సమన్వయం కుదిర్చారు. మరో బలమైన అభ్యర్థి ఎంటరైతే ఆ ఇద్దరి నేతల సాయంతో కొడాలి నాని కోటను బద్ధలుకొట్టాలని చంద్రబాబు చూస్తున్నారు.

Also Read:WPL 2023: బ్యాట్లు విరిగేలా.. బంతులు పగిలేలా: టీ 20 ల్లో ఓపెనింగ్ భాగస్వామ్యం ఇలా ఉండాలి

Tags