Karnataka Assembly Elections 2023: దక్షిణాదిక భారతీయ జనతాపార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. మే 10వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. మళ్లీ తామే అధికారంలోకి వస్తామని బీజేపీ దీమా వ్యక్తం కేస్తోంది. రావడానికి శ్రమిస్తోంది. దక్షిణాదిన పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈసారి మాదే రాజ్యం అని కాంగ్రెస్ అంటోంది. ఇక జేడీఎస్ తామే కింగ్ మేకర్ అంటోంది. తమ మద్దతు లేకుండా ఎవరూ ప్రభ్తువం ఏర్పాట చేయలేరని మాజీ మంత్రి జనార్దన్‌రెడ్డి అంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై వివిధ సంస్థలు ప్రపోల్ సర్వేలు నిర్వహించాయి. ఎప్పటిలాగే జన్ కి బాత్ సంస్థ నిర్వహించిన సర్వేని ప్రముఖ కన్నడ టీవీ చానల్ సువర్ణ టీవీ విడుదల చెయ్యడం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.
మళ్లీ సంకీర్ణమే..
జన్ కీ బాత్ సర్వేలో ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయి, ఎవరు అధికారంలోకి వస్తారు అనే వివరాలతో కర్ణాటకలోని వివిద ప్రాంతాలు, జిల్లాల్లో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి 98–109 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌కు 89– 97 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక జేడీఎస్ పార్టీకి 25 నుంచి 29 స్థానాలు మాత్రమే దక్కుతాయని వెల్లడించింది. మొత్తం మీద కర్ణాటకలో మరోసారి పూర్తి మెజారిటీ ఎవ్వరూ అధికారంలోకి రారని, సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని జన్ కీ బాత్ సర్వే తెలిపింది.
ఓట్ల శాతం ఇలా..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 37 నుంచి 39 శాతం ఓట్లు సంపాధిస్తుందని, కాంగ్రెస్ పార్టీ 38 నుంచి 40 శాతం ఓట్లు సంపాధిస్తుందని సర్వే ఫలితాల ఆధారంగా అంచనా వేసింది. జేడీఎస్ 16 నుంచి 18 శాతం ఓట్లు సంపాదిస్తుందని జన్ కీ బాత్ సర్వే వెల్ల్లడించింది. స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 5 నుంచి 7 శాతం ఓట్లు సంపాధిస్తారని తెలిపింది. మధ్య కర్ణాటక (కర్ణాటక సెంట్రల్)లో మొత్తం 26 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయని. ఈసారి ఈ ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి పోటీ ఉందని సర్వే తెలిపింది. కర్ణాటక సెంట్రల్ ప్రాంతంలో బీజేపీకి 13, కాంగ్రెస్ పార్టీకి 12, జేడీఎస్ కు 1 సీటు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
మొత్తం మీద కర్ణాటకలో మరోసారి ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాదని, హంగ్ గ్యారెంటీ అని జన్ కీ బాత్ సర్వే వెల్లడించింది. మరి ఈ ప్రీపోల్ సర్వే ఎంతమేరకు నిజమవుతుందో తెలియాలంటే మే 13 వరకు ఆగాల్సిందే.